Jagapathi Babu: ఒకప్పుడు హీరోగా, ప్రస్తుతం విలక్షణ నటుడిగా వెండితెరపై దూసుకెళుతున్న జగపతి బాబు (Jagapathi Babu), ఇప్పుడు బుల్లితెర, ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. నందమూరి నటసింహం బాలయ్య తరహాలోనే జగ్గూభాయ్ కూడా సెలబ్రిటీ టాక్ షో హెస్ట్‌గా అవతారమెత్తారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ (Jayammu Nischayammu Raa) అంటూ ఫస్ట్ ఎపిసోడ్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. జీ5 ఓటీటీ, జీ తెలుగు కోసం చేస్తున్న ఈ షో.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆగస్ట్ 15న గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్‌కు కింగ్ నాగార్జున (King Nagarjuna) గెస్ట్‌గా వచ్చారు. కింగ్ నాగార్జున, జగపతిబాబు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అనే విషయంతో పాటు, వారిద్దరి లైఫ్‌లో జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ ఎపిసోడ్‌లో పంచుకున్నారు. మరి కింగ్ నాగ్ తర్వాత, ఈ షోకి వచ్చే సెలబ్రిటీ గెస్ట్ ఎవరా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో.. ఆ గెస్ట్ ఎవరో? మేకర్స్ రివీల్ చేశారు.
తాజాగా ఈ సెలబ్రిటీ షోకు సంబంధించిన రెండో ఎపిసోడ్ ప్రోమోని జీ5 ఓటీటీ విడుదల చేసింది. ఈ ఎపిసోడ్‌కు వచ్చే గెస్ట్ ఎవరో కాదు.. డ్యాన్సింగ్ బ్యూటీ, అచ్చతెలుగు ఆడపిల్ల శ్రీలీల. ఇలాగే ఆమెను జగ్గు భాయ్ షోలోకి ఆహ్వానించారు జగపతిబాబు. ఇక ఈ షోలో శ్రీలీల చేసిన రచ్చ మాములుగా లేదనే విషయాన్ని ఈ ప్రోమో తెలియజేస్తుంది. మరీ ముఖ్యంగా ‘ఆ టాపిక్ తీసుకొస్తే.. నేను మీ టాపిక్ తీసుకొస్తా’ అంటూ జగ్గు భాయ్‌కి వార్నింగ్ ఇచ్చేలా చెబుతున్న డైలాగ్ బాగా వైరల్ అవుతోంది. నాగ్ ఎపిసోడ్‌కు ఆయన సోదరుడు వెంకట్, సోదరి నాగ సుశీల సర్‌ప్రైజ్ ఇస్తే.. శ్రీలీల (Sreeleela) ఎపిసోడ్‌కు ఆమె మదర్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ప్రోమో విషయానికి వస్తే..
‘మేమందరం ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాం.. నువ్వు యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావు’ అని జగపతిబాబు అంటే.. ‘ఇప్పుడు తిట్టారా? పొగిడారా? అర్థం కావటం లేదు’ అని శ్రీలీల కామెడీ చేసింది. దీనికి జగపతిబాబు ‘అబ్బో అబ్బో.. శ్రీలీల అని పిలవాలా? ఏ లీల అని పిలవాలి నిన్ను? చాలా లీలలు ఉన్నాయి.. ఏ లీలో చెప్పు?’ అని అడిగారు. ‘వద్దండి బాబు..’ అని శ్రీలీల దండం పెట్టేసింది. ‘గుంటూరు కారం’ సినిమా చేసేటప్పుడు ఫేస్‌లో కొంచెం తేడా ఉండేదని జగపతిబాబు అంటే.. ‘ఆ టాపిక్ తీసుకొస్తే.. నేను మీ టాపిక్ తీసుకొస్తాను సార్’ అని శ్రీలీల చెబితే.. ‘ఏ టాపిక్?’ అని జగపతి ప్రశ్నించారు. ‘మీ హీరోయిన్‌తో కలిసి మీరు..’ అంటూ సెట్‌లో నుంచి పరార్ అయినట్లుగా సిగ్నల్ చూపించింది. ‘ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్’ కొట్టేశావ్.. అని జగ్గు భాయ్ అంటే.. ‘దూల తీరిపోతుంది సార్’ అని తన కష్టాన్ని చెప్పే ప్రయత్నం చేసింది శ్రీలీల.
‘నీ మీద ఓ కంప్లైంట్ ఉందమ్మా’ అని అనగానే.. శ్రీలీల మదర్ ఎంట్రీ ఇచ్చారు. జగపతిబాబు శ్రీలీల మదర్‌ని చూసి.. ‘మీరు హీరోయిన్ అవ్వాలనుకొని మీ అమ్మాయిని హీరోయిన్‌ని చేశారా?’ అని అడిగారు. ‘అన్నింటికంటే ముందు నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని అండి’ అని శ్రీలీల మదర్ చెబితే.. ‘మా అమ్మ మీకు చాలా పెద్ద ఫ్యాన్’ అని శ్రీలీల సిగ్గుపడిపోయింది. ‘నువ్వెందుకు సిగ్గుపడుతున్నావ్’ అని జగపతిబాబు ప్రశ్నించారు. ఫైనల్‌గా ‘ఇంకా చాలా ఉన్నాయమ్మా.. వెయిట్ చెయ్’ అని అంటే.. ‘ఒక్క సెకన్ టైమ్ ఇవ్వరా నాకు’ అంటూ శ్రీలీల హాయిగా నవ్వేసుకున్నారు. ఫుల్ ఎపిసోడ్ జీ5లో ఆగస్ట్ 22 నుంచి, జీ తెలుగులో ఆగస్ట్ 24న టెలికాస్ట్ కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
