sai ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Case Filed on Director: హీరోలు ఇలా తయారయ్యారేంటి.. అదనపు కట్నం కోసం భార్యను వేధించిన డ్రింకర్ సాయి హీరో

Case Filed on Director: సినిమాల్లో హీరో.. కానీ రియల్ లైఫ్ లో కట్టుకున్న భార్యకే విలన్ గా మారాడు. సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలు, షికార్లకు అలవాటు పడిన హీరో ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో హీరో ధర్మా మహేష్ మీద గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సింధూరం డ్రింకర్ సాయి సినిమాలలో హీరోగా నటించిన ధర్మా మహేష్ అలియాస్ కాకాని ధర్మసత్య సాయి శ్రీనివాస మహేష్(30), మాదాపూర్ లోని ఫార్చ్యూన్ టవర్స్ లో నివాసం ఉంటున్నాడు.

Also Read: Tollywood: టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ పవర్ స్టార్ పవనేష్.. ఫొటో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ధర్మ మహేష్ కు 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి (31) తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారగా 2019లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. గౌతమి, ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఇద్దరు కలిసి ఓ హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని సైతం ప్రారంభించారు. కాగా, ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలకు అలవాటు పడిన ధర్మా మహేష్, యువతులతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురి చేయసాగాడు.

Also Read: Siddepeta Tragedy: సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో విషాదం.. విద్యుదాఘాతంతో తండ్రి కొడుకుల మృతి

ప్రస్తుతం తన స్టేటస్ పెరిగిందని.. అదనపు కట్నం కావాలంటూ ధర్మా మహేష్, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. గౌతమి డబ్బుతో ప్రారంభించిన హోటల్ ఫ్రాంచైజీ ని సైతం తన పేరు మీదకు మార్చుకున్నాడు. ధర్మ మహేష్, అతని కుటుంబ సభ్యుల శారీరక, మానసిక వేధింపులకు విసిగిపోయిన భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది. దీంతో, గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో హీరో ధర్మా మహేష్ మీద బి.ఎన్.ఎస్ సెక్షన్ 85, 115(2), 316(2), 351(2), 352, సెక్షన్ 4 ఆఫ్ డిపి యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధర్మ మహేష్ గతంలో సైతం వేధింపుల గురి చేయడంతో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారని కానీ ధర్మా మహేష్ తీరు మారకపోవడంతో మరోసారి పోలీసులను ఆశ్రయించినట్లు గౌతమి తన ఫిర్యాదును 8 పేజీలలో తెలిపింది.

Also Read: VN Aditya: దాసరైనా, చిరంజీవైనా.. చర్చలతో సమస్య‌కి పరిష్కారం తేలేని నాయకుడు ఏ సంఘానికైనా అప్రయోజకుడే!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?