Rinku-Singh
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Rinku Singh: రింకూ సింగ్‌కు దావూద్ ఇబ్రహిం గ్యాంగ్ బెదిరింపులు!.. ఏం అడిగారంటే?

Rinku Singh: ఆసియా కప్-2025లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ ఆడిన టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌కు (Rinku Singh) అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి- ఏప్రిల్ నెలల మధ్యలో ఈ బెదిరింపులు వచ్చాయంటూ ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు రింకూ సింగ్ ఎండార్సర్లు (అడ్వర్టైజ్‌మెంట్ టీమ్) ఫిర్యాదు చేశారు. ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బెదిరింపులు ఓ ఇంటర్నేషనల్ నంబర్ నుంచి వచ్చాయని, చాలా కటువుగా స్పందించారని, చివరికి డీ-కంపెనీ (దావూద్ ఇబ్రహిం గ్యాంగ్) పేరు చెప్పారని ఫిర్యాదులో వివరించారు.

కాగా, ఫిర్యాదు ఆధారంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో కీలక ఆధారాలు లభించాయని, మొహమ్మద్ దిల్షాద్, మొహమ్మద్ నవీద్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విచారణ కోసం ఇంటర్‌పోల్ వంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో ముందుకెళుతున్నామని ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. రింకూ సింగ్ అడ్వర్టైజ్‌మెంట్ టీమ్‌కు మెసేజుల రూపంలో బెదిరింపులు వచ్చాయని వెల్లడైందని అధికారులు వివరించారు. ‘‘సాయం కోసం అడుగుతున్నారేమోనని తొలుత భావించారు. ఆ తర్వాత రూ.5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం, చివరకు ‘డీ-కంపెనీ’ నుంచి అని పేరు చెప్పడంతో రింకూ సింగ్ టీమ్ ఉలిక్కిపడింది’’ అని చెప్పారు. కాగా, ఈ వ్యవహారం వెనుక కుట్ర ఏమైనా దాగివుందా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితులిద్దరినీ ఒక కరేబియన్ దేశంలో అరెస్టు చేసినట్టు సమాచారం. ఆగస్టు 1న ఇద్దరినీ భారతీయ అధికారులకు అప్పగించినట్టు తెలుస్తోంది. అరెస్టైన ఇద్దరికీ నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు. గతంలోనూ రూ.10 కోట్ల డిమాండ్ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు.

Read Also- Naveen Yadav: జూబ్లీహిల్స్ సీటుపై నవీన్‌ యాదవ్‌కు కలిసొచ్చిన అసలు ప్లస్ పాయింట్లు ఇవే!

కాగా, ఈ వ్యవహారం తర్వాత రింకూ సింగ్ భద్రతపై ముంబై పోలీసులు సమీక్షిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, బెదిరింపు వ్యవహారం నేపథ్యంలో క్రికెటర్లతో పాటు స్టార్ ప్లేయర్ల భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. కాగా, సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో మోసగాళ్లు.. సెలబ్రిటీలపై కన్నేస్తుంటారు. బెదిరింపులకు పాల్పడ డబ్బులు గుంజాలని చూస్తుంటారు. ఒక్క క్రీడారంగమే కాకుండా, సినీ, వ్యాపారరంగాలకు చెందినవారిని సైతం బెదిరిస్తుంటారు. ఈ తరహా ఘటనలు సెలబ్రిటీలు అప్రమత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.

Just In

01

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..

AI photo controversy: దీపావళికి దీపికా పదుకోణె చూపించిన ‘దువా’ ఫోటో నిజం కాదా!.. మరి ఏంటంటే?