South Africa Win: రాయపూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియాపై పర్యాటక జట్టు దక్షిణాఫ్రికా (India Vs South Africa) థ్రిల్లింగ్ విజయం (South Africa Win) సాధించింది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో చేధించింది. స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ అద్భుత శతకంతో రాణించడం, మాథ్యూ బ్రీజ్కీ, డెవాల్డ్ బ్రెవీస్, కెప్టెన్ తెంబా బవూమా, చివరిలో కోర్బిన్ బాష్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడడంతో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఐడెన్ మార్క్రమ్ 110, క్వింటన్ డీకాక్ 8, తెంబా బవూమా 46, మ్యాథ్యూ బ్రీట్జీకి 68, డెవాల్డ్ బ్రెవీస్ 54, టోనీ డీ జోర్జీ 17, మార్కో యన్సెన్ 2, కార్బిన్ బాష్ 26 (నాటౌట్), కేశవ్ మహారాజ్ 10 (నాటౌట్ చొప్పున) పరుగులు చేశారు. దీంతో, సిరీస్ 1-1 తేడాతో సమం అయింది.
తేలిపోయిన భారత బౌలర్లు
ఈ మ్యాచ్‌లో టీమిండియా 358 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ దానిని కాపాడుకోవడంలో బౌలర్లు విఫలమయ్యారు. కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో చతికిలపడ్డారు. పరుగుల నియంత్రణలో కూడా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై దక్షిణాఫ్రికా బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ప్రసిద్ధ్ కృష్ణ కేవలం 8.2 ఓవర్లు ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు.
Read Also- Indigo Flights: 85 విమానాలు రద్దు.. క్షమించాలంటూ ఇండిగో ప్రకటన
అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా మినహా మిగతా వారు భారీగానే పరుగులు సమర్పించారు. అర్షదీప్ , ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఉతికి ఆరేశారు. 10 ఓవర్లు ఓవర్లు వేసి 78 పరుగులు సమర్పించుకున్నాడు.
బ్యాటింగ్‌లో రాణించిన టీమిండియా
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రాణించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో సెంచరీ సాధించడం, యంగ్‌స్టార్ రుతురాజ్ గైక్వాడ్ కెరీర్‌తో తొలి శతకం నమోదు చేయడం, మరోవైపు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించడంతో భారత్ ఈ భారీ స్కోర్ చేయగలిగింది.
విరాట్ కోహ్లీ 90 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసి, 102 పరుగుల వద్ద ఔటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ అద్భుత రీతిలో శతకాన్ని నమోదు చేశాడు. 83 బాల్స్ ఎదుర్కొని 105 పరుగులు బాదాడు. 12 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన అతడు, మార్కో యన్సెన్ బౌలింగ్‌లో జోర్జీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే, ఓపెనర్లు యశస్వి జైస్వాల్, దిగ్గజ ప్లేయర్ రోహిత్ శర్మ అంతగా ఆకట్టుకోలేకపోయారు. జైస్వాల్ 22, రోహిత్ 14 పరుగులు మాతమ్రే చేసి ఔటయ్యారు. భారత వన్డే తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో వన్డేలోనూ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 24 (నాటౌట్) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి, దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు.
Read Also- Gadwal District: గ్రామాల్లో జోరందుకున్న ప్రచారం.. అభివృద్ధికై బుజ్జగింపులు ప్రలోభాలు బేరసారాలు
