Gadwal District: గ్రామాల్లో జోరందుకున్న ప్రచారం
Gadwal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal District: గ్రామాల్లో జోరందుకున్న ప్రచారం.. అభివృద్ధికై బుజ్జగింపులు ప్రలోభాలు బేరసారాలు

Gadwal District: గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా పల్లెపోరుకు రసవత్తర పోటీ నెలకొంది. గ్రామ సర్పంచ్ కుర్చీ కోసం అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే గద్వాల జిల్లాలో మొదటి,‌రెండవ దశ సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ ల ప్రక్రియ పూర్తి అయింది. మూడవ దశ నామినేషన్ల ప్రక్రియ మొదలయింది. మూడవ విడతలో మొదటి రోజు 75 గ్రామపంచాయతీలకు గాను 38 నామినేషన్లు నమోదయ్యాయి. 700 వార్డులకు గాను 46 నామినేషన్లు నమోదు అయ్యాయి.మొదటి దశ నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ బుధవారంతో ముగిసింది‌. ఇందులో భాగంగా గద్వాల, ధరూర్, కేటిదొడ్డి, గట్టు మండలాలో గల ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద హాడావుడి నెలకొంది. 69 పంచాయతీలకు కాంగ్రెస్‌(Congress), బీఆర్‌ఎస్‌(BRS), బీజేపీ(BJP) పార్టీలు బలపర్చిన వారితో పాటు, ఆశావహులు 106 సర్పంచులకు, 974 వార్డులకు నామినేషన్లు వేశారు. అయితే స్క్రుట్నిలో సరైన పత్రాలు లేని సర్పంచు అభ్యర్థుల దరఖాస్తులను క్లస్టర్‌ రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. మొదటి విడత నామినేషన్ల ఉపసంహారణకు బుధవారంతో డెడ్ లైన్ ఉండగా బుజ్జగింపులు, బెదిరింపులకు పాల్పడుతూ నామినేషన్ లు విత్‌డ్రా చేసుకునేలా పావులు కదిపారు.

మాట వింటేసరి..

సర్పంచు అభ్యర్థులకు తలనొప్పి మొదలైంది. బరిలోనుంచి తప్పుకోవాలని, గ్రామాన్ని ఏకగ్రీవం చేయాలన్న బుజ్జగింపులు ఊరూరా కొనసాగుతున్నాయి. మాట వినని వారికి బెదిరింపులు తప్పడం లేదు. ఆర్థికంగా.. అంగబలం ఉన్నవారు.. సర్పంచు పోటీదారులపై ఒత్తిడి తెస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని, తాము చెప్పిన వారికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మాట వినకపోతే హుకుం జారీ చేస్తున్నారు. దీంతో పోటీదారులు సతమతం అవుతున్నారు. ఇందులో ఆశావహులతో పాటు.. పలు రాజకీయ పార్టీల సీనియర్‌ నాయకులు ఉన్నారు.

Also Read: Akhanda Promotion: బాలయ్య ‘అఖండ 2 తాండవం’ ప్రచారంలో వేరే లెవెల్.. ఇది వర్తే మామా..

మద్దతు ఇస్తూ గ్రామాల్లో పావులు

ఎన్నో ఏళ్ల కల రిజర్వేషన్ల పుణ్యమా అని కలిసి వచ్చిందని సర్పంచ్ గా పోటీ చేసి తమ కలను నిజం చేసుకోవాలని భావిస్తున్న వారు కొందరైతే మరికొందరు తమకు అనుకూలంగా ఉండి నామినేషన్ వేసిన వారిని విత్ డ్రా చేయించే ప్రయత్నాల్లో సర్పంచ్ అభ్యర్థులు కొన్నిచోట్ల సఫలమయ్యారు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందాల మేరకు పలు గ్రామాలలో అభ్యర్థులను బుజ్జగించి విత్ డ్రా అయ్యేలా పెద్దల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చిన అవకాశం చేజారకుండా ప్రయత్నాలు ముమ్మరం చేసి ఏకగ్రీవమయ్యేందుకు కుల సంఘాలు, గ్రామ పెద్దల ద్వారా పావులు కదిపారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ అనుచరులతో గ్రామాల్లో తమ మద్దతు ఇచ్చిన వారు గెలిచే విధంగా ప్రణాళికల సిద్ధం చేస్తున్నారు. మరో ప్రక్క ప్రతిపక్ష పార్టీలైన బి ఆర్ ఎస్, ధరూర్, కేటి దొడ్డి మండలాలకే పరిమితమైన బిజెపికు చెందిన నాయకులు సైతం తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మద్దతు ఇస్తూ గ్రామాల్లో పావులు కదుపుతున్నారు. కొంతమంది సర్పంచుగా గెలిచేందుకు ఆస్తులను తాకట్టుపెట్టి బరిలో నిలుస్తున్నారు. నామినేషన్ల పర్వంలోనే మర్యాదలు చేస్తూ కుటుంబ సంబంధాలను పరిచయాలను నెమరు వేసుకుంటున్నారు. కుల సంఘాలు యువకులను యువజన సంఘాలను కలిసి ముక్కుముడిగా మద్దతు ఇస్తే నజరానాలు ప్రకటిస్తున్నారు.

జనరల్ స్థానాల్లో అధిక పోటీ

సర్పంచ్ స్థానానికి జనరల్ రిజర్వేషన్లు వచ్చిన గ్రామాల్లో సందడిగా మారాయి. జనరల్ స్థానాల్లో ఎక్కువ మంది సర్పంచ్ స్థానానికి పోటీపడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు కుల సంఘాలను, యువకులను, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని ఫోన్లు చేస్తూ ప్రాధేయపడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈనెల 11న మొదటి విడత గద్వాల నియోజకవర్గంలో ధరూరు, గద్వాల, గట్టు, కేటి దొడ్డి మండలాలలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామాలు అభ్యర్థుల ప్రచారంతో సందడిగా మారాయి.

Also Read: Sharmila On Pawan: కోనసీమ దిష్టి వివాదంపై స్పందించిన షర్మిల.. పవన్ కళ్యాణ్‌కు చురకలు

Just In

01

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?

Indigo flight: సౌదీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీగా అహ్మదాబాద్ మళ్లింపు

Loan Apps Ban: కేంద్రం మరో సంచలనం.. 87 లోన్ యాప్స్‌పై నిషేధం.. లోక్‌సభ వేదికగా ప్రకటన

Realme Smart Phone: రియల్‌మీ P4x 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. మరి, ఇంత చీపా?

Shyamali Response: రాజ్ నిడిమోరు వివాహం తర్వాత మౌనం వీడిన మాజీ భార్య శ్యామలి దే.. ‘నిద్రలేని రాత్రుల’పై ఆవేదన..