Akhanda Promotion: ‘అఖండ 2 తాండవం’ ప్రచారంలో వేరే లెవెల్..
akhanda-2-pramotions(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda Promotion: బాలయ్య ‘అఖండ 2 తాండవం’ ప్రచారంలో వేరే లెవెల్.. ఇది వర్తే మామా..

Akhanda Promotion: తెలుగు సినిమా ప్రచారంలో బాలయ్య బాబు ‘అఖండ 2 తాండవం’ చిత్రం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. సినిమా ప్రమోషన్ అంటే కేవలం పోస్టర్‌లు, టీవీ యాడ్‌లు అనే పాత ఫార్ములాను బద్దలు కొడుతూ, 14 రీల్స్ ప్లస్ సంస్థ ఊహించని కొత్త పంథాలో దూసుకుపోతోంది. ముఖ్యంగా, ‘అఖండ 2’ టీమ్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలో అత్యధిక మంది ప్రజలు ఉపయోగించే అమెజాన్ డెలివరీ బాక్స్‌లపై సినిమా ప్రకటనలను ముద్రించడం సరి కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇలా చేయడంతో సినిమా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తుందని నిర్మాతలు చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తీసిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు నిర్మాతలు. బోయపాటి కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే బాలయ్య బాబు పాన్ ఇండియా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు థమన్ అందించిన పాటలు ఒక ఊఫు ఊపేస్తున్నాయి. ప్రచారం కూడా పీక్స్ లో ఉండటంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Ram Pothineni: రిలీజ్ డేట్ సినిమా విజయాన్ని ప్రభావితం చేస్తుందా? రామ్ పోతినేని ఏం అన్నారంటే?

మాస్ రీచ్..

ఇది తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారిగా జరిగిన ప్రచారం. ఈ వినూత్న మార్కెటింగ్ వ్యూహం ద్వారా, ‘అఖండ 2’ ప్రచారం కోట్లాది మంది ప్రజల ఇంటి గుమ్మాలకే నేరుగా చేరుతోంది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే ప్రతి ఒక్కరికీ సినిమా పేరు, పోస్టర్ కళ్లకు కనపడేలా చేయడం ద్వారా, చిత్రంపై మాస్ రీచ్ (సామాన్య ప్రజల దృష్టి) భారీ అంచనాలు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. “ఫ్రెష్, అగ్రెసివ్ మార్కెటింగ్ ఐడియాలతో సరిహద్దులు దాటుతున్నాము,” అంటూ 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ ఈ ప్రచార పద్ధతిని గురించి ప్రకటించింది.

Read also-Barrel Battle: బిగ్‌బాస్9 లో ఈ రోజు టాస్క్ చమట్లుపట్టిస్తుంది.. గెలిచింది ఏవరంటే?

అమెజాన్ బాక్స్‌లతో పాటు, ‘అఖండ 2’ ప్రచార వ్యూహం పరిధి చాలా పెద్దదిగా ఉంది. అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌లలో భారీ హోర్డింగ్‌ల ద్వారా హై-క్లాస్ ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నారు. ప్రజల జీవితంలో భాగమైన ప్రతి చోటా ఈ ప్రచారం ఉండేలా టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. బాలకృష్ణ అభిమానుల అంచనాలను మరింత పెంచేలా, సినిమా విడుదల సమయానికి ఈ అగ్రెసివ్ క్యాంపెయిన్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. ఏదేమైనా, ‘అఖండ 2’ మార్కెటింగ్ వ్యూహం, భవిష్యత్తులో తెలుగు సినిమా ప్రచారానికి ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందనడంలో సందేహం లేదు. ఈ మాస్ ప్రచారం చూసి అభిమానులు తెగ సంబర పడుతున్నారు. తమ అభిమాన హీరో డెలివరీ బాక్సులపై కనిపించడంతో వాటిని జాగ్రత్తగా దాచుకుంటున్నారు.

Just In

01

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్

CPR to Snake: పాముకు కరెంట్ షాక్.. నోట్లో నోరు పెట్టి ఊపిరిపోసిన వ్యక్తి.. రియల్లీ గ్రేట్!

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?

Indigo flight: సౌదీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీగా అహ్మదాబాద్ మళ్లింపు

Loan Apps Ban: కేంద్రం మరో సంచలనం.. 87 లోన్ యాప్స్‌పై నిషేధం.. లోక్‌సభ వేదికగా ప్రకటన