Barrel Battle: బిగ్ బాస్ 9 తెలుగు దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుంతం పైనల్ రేస్ లో ఉండటానికి సభ్యలు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 87 రోజు కు సంబంధించి ప్రోమో విడుదలైంది. దీనిని చూస్తుంటే మరితం రసవత్తరంగా సాగుతుంది. ఇద్దరు పోటీదారులకు పెడుతున్న రెండో యుద్ధం బారిల్, బాటిల్ , బాలన్స్. ఈ యుద్ధంలో ఇద్దిరిని బిగ్ బాస్ ఎంచుకుంది. వారు ఎవరంటే?.. సుమన్ శెట్టి తనూజా.. వీరిద్దరూ ఈ గేమ్ ఆడటానికి ముందుకు వచ్చారు. టాస్క్ ఏంటంటే.. వీరిద్దరూ ఒక టవర్ పైన ఉన్న బ్యారెల్ ను బ్యాలన్స్ చేస్తారు. ఎవరికి అయితే వీరిద్దిరిలో పైనల్ కు వెళ్లాలని సభ్యులు అనుకుంటున్నారో వారి బ్యారెల్ లో నీటిని నింపాలి. దీనిని సంచాలక్ ఎవరిని అయితే పిలుస్తారో వారు ముందుగా వెళ్లి ట్యాప్ విప్పి ఎవరికి అయితే ఇష్టం ఉండదో వారి బ్యారల్లో నీటిని నింపాలి. ముందుగా సంచాలక్ భరణి అవకాశం ఇచ్చారు. అయితే అది భరణి వెళ్లి తనూజ పైప్ ఓపెన్ చేశారు. దీంతో తనూజ భరణి వైపు ఒక్క సీరియస్ లుక్ ఇచ్చింది. కళ్యాణ్ సుమన్ శెట్టి బ్యారెల్ నింపుతారు. దీంతో ఒక్కసారిగా అందిరిలో టెన్షన్ మొదలవుతుంది.
Read also-December Releases: ఈ డిసెంబర్‌లో విడుదలయ్యే ధమాకా సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి మరి..
వారిద్దరి తర్వాత సంచాలక్ ఇమ్మానియేల్ ను పిలుస్తుంది. ఆయన కూడా వచ్చొ సుమన్ శెట్టి పైప్ విప్పుతాడు. దీంతో అందరూ ఒక్కసారి షక్ గురవుతారు. రీతూ కూడా సుమన్ శెట్టి రేసులో ఉండకూడతు అనే ఉద్దేశంతో ఆయన ట్యాప్ విప్పుతుంది. ఇంతలో కొంత మంది సభ్యలు టాస్క్ లో ఉన్నవారికి సూచనలు ఇవ్వ సాగారు. ముఖ్యంగా తనూజకు ఎందుకంటే ఆమె మెదటినుంచీ చాలా ఇబ్బంది పడుతూ కపిపించింది. డెమాన్ పవన కూడా తనూజ వైపు వెళ్లి ట్యాప్ ఓపెన్ చేశాడు. దీంతో తనూజకు మరింత ఇబ్బందిగా మారింది. దీంతో ఎవరు గ్రిప్ వదిలేశారు? ఎవరు చివరి వరకూ పట్టుకున్నారు. అన్న విషయం తెలియాలి అంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే.
Read also-Kalki 2: ‘కల్కి 2’ లో ప్రభాస్ సరసన గ్లోబల్ హీరోయిన్ ఎంట్రీ?.. అయితే ఫ్యాన్స్‌కు పండగే..
