December Releases: ఈ డిసెంబర్‌లో విడుదలయ్యే సినిమాలు ఇవే..
MOVIES-IN-DECEMBER(x)
ఎంటర్‌టైన్‌మెంట్

December Releases: ఈ డిసెంబర్‌లో విడుదలయ్యే ధమాకా సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి మరి..

December Releases: సంవత్సరాంతంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి డిసెంబర్ నెల సిద్ధమైంది. ఈ నెలలో భారీ అంచనాలున్న సీక్వెల్స్‌తో పాటు, వైవిధ్యభరితమైన కథాంశాలతో కూడిన చిత్రాలు, పాత క్లాసిక్స్ రీ-రిలీజ్‌లు కూడా థియేటర్లను కళకళలాడించనున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది చివరి నెలలో యాక్షన్, సైన్స్ ఫిక్షన్, హారర్ ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని జానర్‌ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Read also-Kalki 2: ‘కల్కి 2’ లో ప్రభాస్ సరసన గ్లోబల్ హీరోయిన్ ఎంట్రీ?.. అయితే ఫ్యాన్స్‌కు పండగే..

డిసెంబర్ 5: ఓపెనింగ్ వీక్ రష్!

డిసెంబర్ మొదటి వారంలో (5వ తేదీ) అనేక చిత్రాలు పోటీ పడుతున్నాయి. వీటిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘అఖండ 2’. నందమూరి అభిమానులు ఈ యాక్షన్ డ్రామా సీక్వెల్‌ కోసం ఉత్సాహంగా ఉన్నారు. దీనితో పాటు, హాలీవుడ్ హారర్ సీక్వెల్ ‘ఫైవ్ నైట్ ఎట్ ఫ్రెడ్డీస్ 2’ కూడా అదే రోజున విడుదలై హారర్ ప్రియులను భయపెట్టడానికి వస్తోంది. అన్గామల్, లాక్ డౌన్, సావువేదు, సారా, దురంధర్, కలామ్ కవాల్, ఖజరహో డ్రీమ్స్, పొంగలా, ధీరమ్ తదితర సినిమాలు ఈ వారంలో విడుదల కానున్నాయి.

డిసెంబర్ 11 & 12: క్లాసిక్ రివైవల్!

రెండో వారంలో, డిసెంబర్ 11న మిస్టీరియస్ థ్రిల్లర్ ‘థ డెవిల్’ విడుదల కానుంది. డిసెంబర్ 12న, విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. కొత్తదనంతో కూడిన చిత్రాలు.. వాత్తియార్, మానభూమి గుపరాయ్, మనసేన్షా, రచెల్, మోగ్లీ.. ప్రేక్షకులను అలరించడానికి సూపర్ స్టార్స్ నటించిన పాత క్లాసిక్స్ ఈజమాన్ విడుదలవుతున్నాయి.

డిసెంబర్ 19: గ్లోబల్ వండర్!

మూడో వారంలో అత్యంత ముఖ్యమైన విడుదల డిసెంబర్ 19న జరగనుంది. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ అవతార్ ఫైర్ అండ్ యాష్ థియేటర్లలోకి అడుగుపెడుతోంది. విజువల్స్ పరంగా ఈ సినిమా సృష్టించబోయే రికార్డులపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 18న ప్రదీప్ రంగనాధన్ (LIK),లవ్ ఎన్సూరెన్స్ కంపెనీ..భాభాభా విడుదల కానున్నాయి.

Read also-Smriti Mandhana: స్మృతి మంధానా వివాహ తేదీపై క్లారిటీ ఇచ్చిన ఆమె సోదరుడు.. ఏం అన్నాడంటే?

డిసెంబర్ 25: క్రిస్మస్ పండుగ రేస్!

క్రిస్మస్ సెలవులను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 25న భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ పండుగ రేసులో మల్టీ-లింగ్వల్ చిత్రం ‘వృషభ’ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. యాక్షన్/మాస్ ఎంటర్‌టైనర్స్ రెట్టతాలా, కొంబుసేవి, మార్క్ ద అనకొండ, దండోరా, ఛాంపియన్ విడుదల కానున్నాయి. ఫ్యామిలీ డ్రామాలు, థ్రిల్లర్లు అయిన సర్వమాయా, చెత్తపచ్చా, సిరాయ్ , ఈక్కీస్, 45మూవీ, ‘శంబాల’ కూడా క్రిస్మస్ వీకెండ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. మొత్తం మీద, ఈ డిసెంబర్ 2025 సినీ ప్రేక్షకులకు పండగ వాతావరణాన్ని తీసుకొస్తోంది. ప్రతి వారం కొత్త సినిమాలు, పాత సినిమాల రీ-రిలీజ్‌లతో థియేటర్లు నిండిపోనున్నాయి.

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!