Ram Pothineni: సినిమాకు మంచి కథ, అద్భుతమైన దర్శకత్వం, నటీనటుల ప్రతిభ ఎంత ముఖ్యమో, సరైన రిలీజ్ డేట్ కూడా అంతే ముఖ్యం. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంలో ఈ రిలీజ్ టైమింగ్ కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది నిర్మాతలు, దర్శకులు ఈ ‘లక్’ ఫ్యాక్టర్‌ను బలంగా నమ్ముతారు. ముఖ్యంగా పండుగల సీజన్ (సంక్రాంతి, దసరా) మరియు వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని పెద్ద సినిమాలను విడుదల చేయడానికి పోటీ పడతారు.
Read also-Barrel Battle: బిగ్‌బాస్9 లో ఈ రోజు టాస్క్ చమట్లుపట్టిస్తుంది.. గెలిచింది ఏవరంటే?
నెలల ప్రభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ అంశంపై యువ కథానాయకుడు రామ్ పోతినేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రిలీజ్ డేట్ ప్రభావంపై ఆయనకు ఉన్న వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, ఒక ప్రత్యేకమైన నెలపై తనకు ఉన్న ‘భయాన్ని’ వెల్లడించారు. రామ్ పోతినేని మాట్లాడుతూ.. “నాకు నవంబర్ అంటే చాలా భయం. ఎందుకంటే, 2012లో నేను, వెంకటేష్ కలిసి చేసిన ‘మసాలా’ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేశాం. కనీసం ఎవరూ చూడటానికి కూడా రాలేదు. అందుకే నవంబర్ అంటే భయం. ఎందుకంటే, ఆ సమయంలో అందరూ వారి వారి పనుల్లో, ఇతరత్రా అంశాలలో బిజీగా ఉంటారు. అందుకే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంటుంది,” అని స్పష్టం చేశారు.అయితే, అదే సమయంలో ఆ నెలలో రిలీజైన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ‘లాంగ్ రన్’ గురించి కూడా రామ్ ఆసక్తికర
అంశాన్ని తెలిపారు. “లాంగ్ రన్ మాత్రం చాలా బాగుంటుంది. సినిమా చూసిన పది మందిలో తొమ్మిది మంది బాగుంది అంటున్నారు. కానీ, పది మందే చూస్తున్నారు,” అంటూ చెప్పుకొచ్చారు. దీని అర్థం ఏమిటంటే, నవంబర్ వంటి నెలల్లో విడుదలైనప్పుడు ప్రారంభ వసూళ్లు (ఓపెనింగ్స్) తక్కువగా ఉన్నప్పటికీ, సినిమాకు మంచి ‘మౌత్ టాక్’ వస్తే, ఆ సినిమా ఎక్కువ రోజులు థియేటర్లలో నిలబడి నెమ్మదిగా వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది. కానీ, మొదటి రోజు, మొదటి వారాంతం వసూళ్లు కీలకంగా మారిన నేటి మార్కెట్‌లో, ప్రేక్షకుల రద్దీ ఎక్కువగా ఉండే సీజన్‌లో సినిమాను విడుదల చేయడానికే మేకర్స్ మొగ్గు చూపుతారు.
Read also-Kalki 2: ‘కల్కి 2’ లో ప్రభాస్ సరసన గ్లోబల్ హీరోయిన్ ఎంట్రీ?.. అయితే ఫ్యాన్స్‌కు పండగే..
ఏ నెలలో రిలీజ్ చేస్తే హిట్ అవుతుంది?
సాధారణంగా, సినిమాలు హిట్టవడానికి ఉత్తమమైన నెలలు ఏంటంటే?.. జనవరి (సంక్రాంతి) ఇది అతిపెద్ద పండుగ సీజన్. ఈ సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారు. ఏప్రిల్ – మే (వేసవి సెలవులు) విద్యార్థులకు సెలవులు కావడంతో, కుటుంబ సమేతంగా సినిమా చూసేందుకు అధిక సంఖ్యలో వస్తారు. అక్టోబర్ (దసరా) ఈ పండుగ సీజన్ కూడా మంచి వసూళ్లకు దోహదపడుతుంది. రామ్ పోతినేని అభిప్రాయం ప్రకారం, నవంబర్ వంటి నెలలు స్టార్ హీరోల సినిమాలకు అంతగా కలిసిరాకపోవచ్చు. అందుకే, నిర్మాతలు తమ సినిమా కంటెంట్, టార్గెట్ ఆడియన్స్ ఆ సమయంలో ఉన్న పోటీని బట్టి రిలీజ్ డేట్‌ను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక్క రోజు తేడా కూడా సినిమా భవిష్యత్తును మార్చగలదు.
