India Vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఛండీగఢ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసం సృష్టించాడు. 46 బంతుల్లోనే 90 పరుగులు బాది ఔట్ అయ్యాడు. దీంతో, దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత విజయ లక్ష్యం 214 పరుగులుగా ఖరారైంది.
సిక్సర్లు, ఫోర్ల వర్షం..
దక్షిణాఫ్రికా బౌలర్లు ఈ మ్యాచ్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించింది. మొత్తం 14 సిక్సర్లు, 15 ఫోర్లు బాదారు. ఓపెన్ క్వింటన్ డికాక్ 46 బంతుల్లో 90 పరుగులు సాధించచగా అందులో, 7 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే, డొనోవాన్ ఫెర్రిరా 30 (నాటౌట్) చివరిలో చెలరేగి ఆడాడు. 16 బంతుల్లో 30 పరుగులు కొట్టాడు. అందులో 3 సిక్సర్లు, 1 ఫోర్ ఉన్నాయి. మిగతా బ్యాటర్లలో హెండ్రిక్స్ 8, మార్క్రమ్ 29, డెవాల్డ్ బ్రెవీస్ 14, డేవిడ్ మిల్లర్ 20 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు.
Read Also- Panchayat Elections: సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు.. ఎంతమంది ఓటు వేశారో తెలుసా?
రాణించలేకపోయిన భారత బౌలర్లు
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్య బౌలింగ్ ఎంచుకోగా, బౌలర్లు నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ కేవలం 4 ఓవర్లలోనే 54 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా 45, వరుణ్ చక్రవర్తి 29, అక్షర్ పటేల్ 27, హార్ధిక్ పాండ్యా 34, శివమ్ దూబే 18 చొప్పున పరుగులు ధాటిగా సమర్పించుకున్నారు.
మార్పులు లేకుండానే బరిలోకి
ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా, తొలి మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. టాస్ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ ఈ గ్రౌండ్‌లో ఆడడం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఫ్రాంచైజీ క్రికెట్ (ఐపీఎల్) మ్యాచ్‌లు, ఈ మధ్యే మహిళల మ్యాచ్ కూడా ఇక్కడ జరిగాయి. ఈ గ్రౌండ్‌లో మొట్టమొదటిసారిగా పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ ఇదేనని విన్నాను. ఆ విషయంలో మరింత ఉత్సాహంగా అనిపిస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను’’ అని సూర్య పేర్కొన్నాడు.
జట్టు కూర్పు విషయానికి వస్తే, పరిస్థితిని బట్టి జట్టుకు ఏం అవసరమో గుర్తించి, ఆటగాళ్లు తమ బాధ్యతలను తీసుకోవడం చాలా ముఖ్యమని సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. తొలి మ్యాచ్‌లో ప్లేయర్లు పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేశారని, ఆ వికెట్‌పై 175 పరుగులు సాధించడం కొంచెం పెద్ద స్కోరేనని అన్నాడు. తొలి మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రతిభను బట్టి చూస్తే అద్భుతంగా రాణించారని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. ఇక, హార్దిక్ పాండ్యా జట్టుకు అందించే సమతుల్యత అద్భుతమైనదని వివరించాడు. పాండ్యా బ్యాటింగ్ చేసిన విధానం, ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా మైదానంలో ప్రశాంతంగా ఉంటాడని మెచ్చుకున్నాడు. బౌలింగ్‌లో కూడా పాండ్యా ముఖ్యమని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.

