Messi India Visit: అర్జెంటీనా సూపర్‌స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్నాడు. దీంతో, అతడి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. చివరిసారిగా 2011లో భారత్ వచ్చిన మెస్సీ, సుధీర్ఘకాలం తర్వాత మళ్లీ ఇండియా రావడంతో (Messi India Visit) అతడిని చూసేందుకు, ఫ్రెండ్లీ మ్యాచ్‌లను ఆస్వాదించేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. కాగా, మెస్సీ శనివారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భారత్‌లో అడుగుపెట్టాడు. అతడు ప్రయాణించిన విమానం కోల్‌కతాలో ల్యాండయ్యింది. ప్రత్యేక విమానంలో రావడంతో అతడు ప్రయాణించిన విమానంపై ఆసక్తి నెలకొంది.
లీజుపై లగ్జరీ జెట్
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోనే కాదు, విమాన ప్రయాణంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఎందుకంటే, ఒక ప్రత్యేక ప్రైవేట్ లగ్జరీ జెట్‌ను అతడు లీజుకు తీసుకున్నాడు. ఈ విమానం కేవలం ప్రయాణం కోసమే కాదు. అందులో అత్యాధునిక సౌకర్యాలు, హైలెవల్ భద్రత ఉంటుంది. ఇంకా, చెప్పాలంటే, ‘ఎగిరే ఇల్లు’ అని కూడా అభివర్ణిస్తుటారు.
ధర ఎంత ఉంటుంది?
మెస్సీ వాడుతున్న ప్రైవేట్ జెట్ మోడల్ పేరు ‘గల్ఫ్‌స్ట్రీమ్ వీ’ (Gulfstream V). ఈ విమానాన్ని మెస్సీ సొంతంగా కొనుగోలు చేయకుండా, ఒక ఆర్జెంటినా కంపెనీ ద్వారా లీజుకు తీసుకున్నాడు. మెస్సీ తరచూగా ఈ విమానాన్ని ఉపయోగిస్తుంటాడు. ఈ జెట్ వేరియెంట్, కండీషన్, అప్‌గ్రేడ్‌లను బట్టి ఈ విమానం విలువ సుమారుగా 15 మిలియన్ల (సుమారు రూ.120 కోట్లు) నుంచి 25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.200 కోట్లు) మధ్య ఉంటుందని అంచనాగా ఉంది. అదే కొత్త విమానం ఖరీదైతే సుమారుగా 40 మిలియన్ డాలర్లు ఉండొచ్చని తెలుస్తోంది. కాగా, మెస్సీ ఈ విమానాన్ని లీజుకి తీసుకొని ఉపయోగిస్తుంటాడు. నిర్వహణ, వినియోగానికి సంబంధించిన ఖర్చులను కంపెనీకి చెల్లిస్తుంటాడు.
ఫ్యామిలీ కోసం
గల్ఫ్‌స్ట్రీమ్ వీ జెట్ విమానం చాలా ప్రత్యేకమైనది. ప్రత్యేకంగా మెస్సీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. అందుకే, ఈ విమాన వసతులు వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా ఉంటాయి. విమానం వెనుక భాగంలో తోకపై ‘10’ అనే నంబర్ ముద్రించి ఉంటుంది. ఫుట్‌బాల్ ఆడేటప్పుడు మెస్సీ జెర్సీ నంబర్ ఇదే కావడం గమనార్హం. ఇక జెట్ ఎక్కడానికి ఉపయోగించే మెట్లపై లియోనెల్, ఆయన భార్య అంటోనెల్లా, వారి రు పిల్లలు టియాగో, మాటియో, సిరో పేర్లు రాసి ఉంటాయి.
16 మంది ప్రయాణించొచ్చు
గల్ఫ్‌స్ట్రీమ్ విమానం సీటింగ్ కెపాసిటీ విషయానికి వస్తే, సాధారణంగా 16 మంది ప్యాసింజర్లు సౌకర్యవంతంగా ప్రయాణం చేసే వీలుంటుంది. విమానం లోపల విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. రెండు విశాలమైన బాత్‌రూమ్‌లు, ప్రత్యేకంగా షవర్ గది, రెండు కిచెన్స్ ఉన్నాయి. ప్రయాణ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా సీట్లను బెడ్స్‌గా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు, ఈ విమానం అధిక వేగంతో, ఎక్కువ దూరం నాన్-స్టాప్‌గా ప్రయాణించగలదు. తద్వారా అంతర్జాతీయ మ్యాచ్‌ల మధ్య వేగంగా రాకపోకలు కొసాగించడానికి ఈ విమానం దోహదపడుతుంది. అంతేకాదు, మెస్సీకి, ఆయన కుటుంబానికి ప్రైవసీ కల్పిస్తుంది.
Read Also- Fake Journalists: ఫ్లయింగ్ స్క్వాడ్ ముసుగులో బలవంతపు వసూళ్లు.. సిగ్నేచర్ స్టూడియో యాంకర్ అరెస్ట్!
గల్ఫ్‌స్ట్రీమ్ వీ విమానం అల్ట్రా-లాంగ్-రేంజ్ బిజినెస్ జెట్. అంటే, ప్యాసింజర్లు 6,500 నాటికల్ మైళ్ల దూరం వరకు ప్రయాణించగలదు. న్యూయార్క్ నుంచి టోక్యోకు, లండన్ నుంచి సింగపూర్ వరకు నాన్-స్టాప్ వెళ్లగలుగుతుంది. అంతేకాదు, ఈ విమానం 51,000 అడుగుల ఎత్తులో ఎగరడానికి అనుమతి ఉంటుంది. తద్వారా ఎయిర్ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లేకుండా ప్రయాణిస్తుంది. గంటకు 550 మైళ్లకు పైగా వేగంతో ప్రయాణిస్తుంది.

