India vs Australia 5th T20: భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ తుది అంకానికి చేరుకుంది. నేడు నిర్ణయాత్మకమైన ఐదో 20 మ్యాచ్ జరగనుంది. బిస్బెన్ లోని గబ్బా స్డేడియంలో జరిగే ఈ మ్యాచ్.. మధ్యాహ్నం 1.45 గం.లకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. ఇప్పటికే 2-1తో సిరీస్ లో భారత్ లీడ్ లో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీ20 సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఒకవేళ ఆసీస్ గెలిస్తే సిరీస్ సమం కానుంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం ఇరుజట్ల మధ్య తీవ్ర పోటీ ఉండే ఛాన్స్ ఉంది.
టీమిండియాలో మార్పులు
ఐదో టీ20 మ్యాచ్ కు ముందు టీమిండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జితేశ్ శర్మ స్థానంలో తిరిగి సంజూ శాంసన్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. సంజూ స్థానంలో మూడో టీ20లో అడుగుపెట్టిన జితేశ్.. 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. నాల్గో టీ20లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. కాబట్టి అతడి స్థానంలో తిరిగి సంజూను తీసుకొని రావొచ్చని క్రీడావర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చేవారంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఉన్నందున ఈ మ్యాచ్ లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వొచ్చని సమాచారం. అతడి స్థానంలో నితీశ్ రాణాను ఆడించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆఖరి టీ20 కావడంతో వాషింగ్టన్ సుందర్, శివం దూబేకి విశ్రాంతి ఇచ్చి.. బెంచ్ కు పరిమితమైన నితీశ్ రెడ్డి, రింకూ సింగ్ లను తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గబ్బా పిచ్ రిపోర్ట్
ఐదో టీ20 జరగనున్న గబ్బా పిచ్.. పేసర్లకు స్వర్గధామంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గబ్బా పిచ్.. గత కొన్నేళ్లుగా బౌన్స్ కు బాగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి బ్యాటర్లు, బౌలర్ల మధ్య మంచి ఫైట్ చూసే అవకాశముంది. బౌన్స్ ను చక్కగా రాబట్టే బౌలర్లు ఈ మ్యాచ్ లో బాగా రాణిస్తారని పిచ్ క్యూరేటర్లు స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ గ్రౌండ్ లో భారత్ – ఆసీస్ ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడాయి. 2018 నవంబర్ 21న జరిగిన ఈ మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరిగా ఈ మైదానంలో ఆసీస్ – పాక్ మధ్య టీ20 జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 7 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 7 ఓవర్లలో 93/4 స్కోరు చేసింది. పాక్ 64/9 మాత్రమే చేసి ఓటమి పాలైంది.
గబ్బా స్టేడియం గణాంకాలు
బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్ (గబ్బా)లో ఇప్పటివరకు 11 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో 8 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించగా.. 3 మ్యాచ్‌ల్లో మాత్రమే ఛేజ్ చేసిన జట్లు గెలిచాయి. ఈ గ్రౌండ్ లో తొలి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 159. రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 138గా ఉంది. దీన్ని బట్టి ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు గెలుపు అవకాశాలు మెండుగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేసేందుకు మెుగ్గు చూపే అవకాశముంది. ఆస్ట్రేలియా టూర్ లో ఇప్పటికే వన్డే సిరీస్ ను కోల్పోయిన భారత్.. టీ20ని ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది.
Also Read: Shamshabad Airport: శంషాబాద్‌లో ఊహించని సమస్య.. పలు విమానాలు రద్దు.. ఆందోళనలో ప్రయాణికులు
భారత్ జట్టు (అంచనా)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
