Jubliee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో మంత్రి సీతక్క దూకుడు పెంచారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ చేస్తున్న ప్రచారాన్ని ఆమె మరింత ముమ్మకం చేశారు. నియోజకవర్గంలో తనకు కేటాయించిన డివిజన్ లో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాను మంత్రి అన్న ఫీలింగ్ ఏ మాత్రం లేకుండా.. సీతక్క బైక్ పై తిరగడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే..
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం.. బోరబండలోని ఎస్ఆర్‌టీ నగర్ (SRT Nagar), భరత్ నగర్ (Bharat nagar) లో సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి.. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. నవీన్ యాదవ్ ను గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం స్థానికంగా గల హనుమాన్ దేవాలాయన్ని దర్శించుకునేందుకు మంత్రి సీతక్క.. బైక్ పై ప్రయాణించారు. గుడికి వెళ్లేందుకు ప్రధాన రహదారి సౌకర్యం లేకపోవడంతో కాంగ్రెస్ నేత బైక్ ఎక్కారు. గల్లీల గుండా ప్రయాణించి.. ఆలయానికి చేరుకున్నారు.
View this post on Instagram
కేటీఆర్‌పై ఫైర్..
మరోవైపు శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ దివగంత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తల్లి మహానంద కుమారి ఆవేదన చూస్తే కేటీఆర్ ఎంత మోసకారో అర్థమవుతోందని విమర్శించారు. 91 ఏళ్ల వృద్ధురాలని కూడా చూడకుండా ఆమెను కేటీఆర్ అవమానించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Also Read: Shamshabad Airport: శంషాబాద్‌లో ఊహించని సమస్య.. పలు విమానాలు రద్దు.. ఆందోళనలో ప్రయాణికులు
హరీశ్ రావుపై ఆగ్రహం
జూబ్లీహిల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ను పదే పదే టార్గెట్ చేస్తున్న హరీశ్ రావుపైనా మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకూ విషాదంలో ఉన్న ఆయన.. ఇప్పుడు హడావిడిగా బయటకు వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే హరీశ్ రావు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైన్, మైన్, ల్యాండ్, శాండ్ మాఫియాలతో గత పదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని సీతక్క ఆరోపించారు.
