IND vs AUS 1st T20I (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

IND vs AUS 1st T20I: వరుణుడి సడెన్ ఎంట్రీ.. భారత్ – ఆసీస్ తొలి టీ20 రద్దు.. తర్వాతి మ్యాచ్ ఎప్పుడంటే?

IND vs AUS 1st T20I: భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా అర్ధంతరంగా రద్దు అయ్యింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొలిసారి వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్ ను కొద్దిసేపు నిలిపివేసిన ఎంపైర్లు.. వర్షం తగ్గాక తిరిగి ప్రారంభించారు. అయితే కాసేపటికే మళ్లీ వాన పెరగడంతో మరోమారు ఆటను నిలిపివేశారు. అప్పటికే భారత్ 9.4 ఓవర్లు ఆడి 97 పరుగులు చేయడంతో.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఆసీస్ ను తిరిగి బ్యాటింగ్ కు ఆహ్వానిస్తారని అంతా భావించారు. కానీ వర్షం తెరిపించేలా కనిపించకపోవడంతో మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేశారు.

ఆకట్టుకున్న సూర్య, గిల్

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. మ్యాచ్ రద్దయ్యే సమయానికి పటిష్ట స్థితిలోనే నిలిచింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (19), శుభమన్ గిల్ తొలి వికెట్ కు 35 పరుగులు జోడించారు. ఆ తర్వాత నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ (39).. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ (37) తో కలిసి దూకుడుగా ఆడాడు. మ్యాచ్ డక్ వర్త్ లూయిస్ కు వెళ్లొచ్చన్న అనుమానంతో వీలైనంత ఎక్కువ పరుగులు స్కోర్ బోర్డుపై ఉంచేందుకు ఈ జోడి ప్రయత్నించింది. 35 బంతుల్లో 62 పరుగులు చేసింది. అయితే వర్షం తీవ్రత ఎక్కువ కావడం, మ్యాచ్ ను తిరిగి నిర్వహించే పరిస్థితులు కనిపించకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు.

సెకండ్ టీ20 ఎప్పుడంటే?

ఐదు టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ రద్దు కావడంతో టీమిండియా ఫ్యాన్స్ దృష్టి రెండో టీ20పై పడింది. ఈ మ్యాచ్ అక్టోబర్ 31న అనగా శుక్రవారం జరగనుంది. ఆ రోజు కూడా ప్రస్తుతం ఆడిన జట్లతోనే ఇరు జట్లు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక మిగిలిన మ్యాచ్ ల విషయానికి వస్తే నవంబర్ 2న మూడో టీ20, నవంబర్ 6న నాల్గో టీ20, నవంబర్ 8న ఐదో టీ20 జరగనున్నట్లు బీసీసీఐ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ లను స్టాప్ స్పోర్ట్స్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. అలాగే జియో హాట్ స్టార్ యాప్, వెబ్ సైట్ లో లైవ్ స్ట్రీమింగ్ లో చూడవచ్చు.

Also Read: Azharuddin: నిజమా!.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి?.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ ఊహించని ట్విస్ట్?

మనోళ్లదే పైచేయి..

భారత్ ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకూ 32 టీ20 మ్యచ్ లు జరిగాయి. అందులో భారత్ 20 మ్యాచుల్లో విజయం సాధించగా.. ఆసీస్ 11 గెలిచింది. ఒకటి డ్రాగా ముగిసింది. ఇదిలా ఉంటే 2007లో జరిగిన తొలి టీ20 నుంచి ఆసీస్ పై భారత్ ఆదిపత్యం కొనసాగిస్తోంది. స్వదేశంతో పాటు విదేశీ గడ్డలపైనా ఆసీస్ ను పలుమార్లు భారత్ ఓడించింది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ భారత్ సైతం ఆ రికార్డ్ ను కొనసాగించాలని భావిస్తోంది. ఇటీవల ఆసియా కప్ గెలిచిన జట్టుతో భారత్ బరిలోకి దిగుతుండటం కలిసిరానుంది.

Also Read: TG CM – Cyclone Montha: తెలంగాణపై మెుంథా ఎఫెక్ట్.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

Just In

01

Pawan Kalyan: మొంథా తుపాను నేపథ్యంలో అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు

GHMC Commissioner: ఎన్నికల నిబంధన ప్రకారమే విధులు నిర్వర్తించాలి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్

Nonstop Fun: బిగ్ బాస్ హౌస్‌లో నాన్ స్టాప్ ఫన్.. ఇమ్ము, సుమన్ ఇమిటేషన్‌కు మెంబర్స్ షాక్!

Montha Effects TG: మొంథా ఎఫెక్ట్‌తో అల్లాడిపోతున్న వరంగల్.. పలు జిల్లాల్లో కనీవినీ ఎరుగని వర్షపాతం

Heavy Inflow: జలాశయాలకు మళ్లీ వరద.. గరిష్ట స్థాయికి చేరుతున్న నీటి మట్టాలు