IND vs AUS 2nd T20I: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆసీస్ పేసర్లు నిప్పులు చెరగడంతో 18.4 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి భారత్ ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 68 (37) ఒంటరి పోరాటంతో భారత్ ఆమాత్రం స్కోర్ అయిన చేయగలిగింది. భారత బ్యాటర్లలో ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్ కు పెవిలియన్ చేరడం గమనార్హం.
Also Read: Minister Vivek: పెండింగ్‌లో ఎమ్మెల్సీ పదవి.. అయినా కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు
తొలుత టాస్ గెలిచిన టీమిండియా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన భారత ఓపెనర్లు గిల్ (5), అభిషేక్ (68) ఆరంభంలో ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. 20 పరుగుల వద్ద గిల్ ను ఔట్ చేసిన హెజిల్ వుడ్ ఆసీస్ కు శుభారంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (2)ను తర్వాతి ఓవర్ లోనే నాథన్ ఎల్లిస్ అద్భుతమైన బంతితో ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (0), అక్షర్ పటేల్ (7) కూడా ఆసీస్ పేసర్ల ధాటికి వెంట వెంటనే తమ వికెట్లను సమర్పించుకున్నారు. మిడిల్ లో హర్షిత్ రానా 35 పరుగులు చేసి వికెట్ల పతనానికి కొద్దిసేపు బ్రేకులు వేశారు. 15.2 ఓవర్ లో హర్షిత్ కూడా పెవిలియన్ చేరడంతో ఆ తర్వాత వచ్చిన శివం దూబే (4), కుల్దీప్ యాదవ్ (0), జస్ప్రిత్ బుమ్రా (0) వరుసపెట్టి పెవిలియన్ చేరారు. దీంతో భారత జట్టు 125 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఆసీస్ బౌలర్ల విషయానికి వస్తే.. హెజిల్ వుడ్ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. గ్జేవియర్ బ్రెట్ లెట్, నాథన్ ఎల్లిస్ సైతం తలో రెండు వికెట్లు పడగొట్టి రాణించారు. ఆసీస్ ఆల్ రౌండర్ స్టోయినిస్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ విజయానికి 126 పరుగులు అవసరం. కాగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్.. వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న భారత జట్టు.. 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				