Haunted Temple: మనిషి మనసు రహస్యాలవైపు ఎప్పుడూ ఆకర్షితమవుతూనే ఉంటుంది. భయానక సంఘటనలు, అతీంద్రియ కథలు వింటే కొందరిలో భయం కలిగిస్తాయి, మరి కొందరిలో మాత్రం ఆత్మవిశ్వాసం, ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి రహస్యాలే మన సంస్కృతిలో కూడా భాగమైపోయాయి. భారతదేశం వంటి ఆధ్యాత్మిక దేశంలో ప్రతి మూలలోనూ ఒక దివ్య గాధ, ఒక అజ్ఞాత శక్తి, ఒక విశ్వాసం దాగి ఉంటుంది.
మన దేశంలోని వేలాది ఆలయాల్లో ప్రతి ఒక్కదానికి ఓ చరిత్ర, ఓ శక్తి ఉంది. కానీ, కొన్ని దేవాలయాలు మాత్రం మామూలు ఆలయాలు కావు. అవి ఇప్పటికీ కూడా మిస్టరీలతో నిండిపోయాయి. అలాంటి దేవాలయాలలో అత్యంత రహస్యమైనది, అత్యంత శక్తివంతమైనది. మెహందీపూర్ బాలాజీ ఆలయం.
మెహందీపూర్ బాలాజీ ఆలయం విశేషాలు ఇవే..
ఈ ఆలయం పేరు వినగానే చాలామంది గుండెల్లో ఒక రహస్యమైన భయం. మరికొందరిలో భక్తి ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఇక్కడ భూతవైద్యం దుష్టశక్తులను తరిమివేయడం వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు చెబుతున్నట్టుగా, బాలాజీ స్వయంగా హనుమాన్ అవతారంలో భక్తులను చెడు శక్తుల నుండి రక్షిస్తాడని నమ్ముతారు. ఈ ఆలయంలో చేసే ఆచారాలు, మంత్రోచ్చారణలు, నైవేద్య విధానాలు అన్నీ ఒక నిర్దిష్ట పద్ధతిలో జరుగుతాయి. ఈ ఆచారాలను చూసి చాలా మంది షాక్ అవుతారు. కానీ, వాటి ప్రభావం నమ్మినవారికి మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం పర్యాటకుల్లా మాత్రమే కాకుండా.. వారు అన్నింటికీ సిద్ధమై రావాలి. ఆలయ నియమాల ప్రకారం, సందర్శకులు ఆలయానికి రాకముందు కనీసం వారం రోజుల పాటు శాకాహార ఆహారమే తీసుకోవాలి. మానసికంగా, శారీరకంగా పరిశుభ్రంగా ఉండటమే ఇక్కడి ప్రధాన నియమం.
ఇక్కడ ఓ ప్రత్యేక నియమం ఉంది?
ఇక్కడి ప్రసాదం ఇతర ఆలయాల్లోఉన్నట్లు అసలు ఉండదు. భక్తులు దానిని తినరాదు, ఇంటికి తీసుకెళ్లరాదు, అలాగే ఎవరికీ పంపిణీ చేయరాదు. దానికి బదులుగా, ఆలయంలోని నిర్ణీత ప్రదేశంలో వదిలి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోవాలి. ఎందుకంటే వెనక్కి చూడడం అనేది దుష్టశక్తిని తిరిగి ఆహ్వానించినట్లుగా భావిస్తారు.
Also Read: Tummala Nageswara Rao: భారీ వర్షాలకు ఈ జిల్లాలోనే ఎక్కువ పంట నష్టం.. అధికారుల ప్రాథమిక అంచనా
గమనిక: ఈ కథనం భక్తి భావంతో మాత్రమే రాయబడింది. ఇందులో పేర్కొన్న విషయాలు భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక అనుభవాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఎవరికీ భయం కలిగించడం లేదా (అమాయక విశ్వాసం) ప్రోత్సహించడం మా ఉద్దేశ్యం కాదు. దేవాలయ పూజలు, ఆచారాలు, నమ్మకాలు అన్నీ భక్తుల విశ్వాసానికి సంబంధించినవి. వాటిని గౌరవంతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				