ICC Warning: ఆసియా కప్-2025లో భారత జట్టును ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC Warning) అధికారిక హెచ్చరించ్చింది. గ్రూప్ దశలో పాకిస్థాన్‌పై విజయం సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్య మాట్లాడుతూ, భారత విజయాన్ని ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సాయుధ బలగాలకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు, పహల్గామ్ నరమేధంలో మృత్యువాతపడిన 26 మందికి చెందిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంఘీభావాన్ని కూడా తెలియజేస్తున్నామని అన్నాడు. సూర్య చేసిన ఆ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్ అయ్యిందని ‘రెవ్‌స్పోర్ట్స్’ కథనం పేర్కొంది. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఐసీసీ పేర్కొన్నట్టు సమాచారం.
Read Also- Golden Care: సీనియర్ సిటిజన్ల కోసం కొత్త కార్యక్రమం.. ప్రారంభించిన సీపీ సుధీర్ బాబు
పాకిస్థాన్ ఫిర్యాదు మేరకు విచారణ తర్వాత ఈ మేరకు సూర్య కుమార్ యాదవ్‌కు నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. ఐసీసీ విచారణకు సూర్యకుమార్‌తో పాటు బీసీసీఐ సీవోవో హేమాంగ్ అమిన్, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ సమ్మర్ మల్లాపుర్కర్ కూడా హాజరయ్యారు. రిచీ రిచర్డ్‌సన్ నేతృత్వంలో ఈ విచారణను చేపట్టరు. అధికారికంగా ఐసీసీకి ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలుగా పరిగణించినట్టు తెలుస్తోంది. దీంతో సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా, లేదా డిమెరిట్ పాయింట్ విధించే అవకాశం ఉందని ‘రెవ్‌స్పోర్ట్స్’ పేర్కొంది.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో ఏకంగా 26 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నరమేధ ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దిగజారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్-2025లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే తలపడ్డాయి. గ్రూప్ దశ, గ్రూప్-4 దశలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు సూర్యకుమార్ యాదవ్ హ్యాండ్‌షేక్ ఇవ్వలేదు. ఈ పరిణామం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
హరిస్ రౌఫ్, ఫర్హాన్‌పై బీసీసీఐ ఫిర్యాదు
భారత్‌పై సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్లేయర్లు హరిస్ రౌఫ్, సహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన ఉద్దేశపూర్వక హావభావాలపై బీసీసీఐ కూడా ఫిర్యాదు చేసింది. ఫర్హాన్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత బ్యాట్‌ను గన్‌లా పైకెత్తి ‘గన్ సెలబ్రేషన్’ చేసుకోవడం, హరిస్ రౌఫ్ భారతీయ అభిమానులను ఉద్దేశించి ‘6-0’ హావభావాలు (భారతీయ యుద్ధ విమానాలను కూల్చినట్టుగా) ప్రదర్శించాడు. ఈ ఘటనలపై కూడా ఐసీసీ ప్రత్యేక విచారణ చేపట్టనుంది.
Read Also- ICC Warning: కెప్టెన్ సూర్య వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్ వార్నింగ్.. జరిమానా విధించే ఛాన్స్!