Gun Celebration: ఆసియా కప్-2025లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది. ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాణించిన పాకిస్థాన్ ప్లేయర్లలో ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ఒకడు. 45 బంతులు ఎదుర్కొని 58 పరుగులు సాధించి, శివమ్ దూబే బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అయితే, క్యాచ్ ఔట్ కావడానికి ముందు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టి గ్రాండ్‌గా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ సంతోషంలో అత్యుత్సాహం ప్రదర్శించాడు. తుపాకీ పేల్చుతున్నట్టుగా మైదానంలో ‘గన్ సెలబ్రేషన్స్’ (Gun Celebration) జరుపుకున్నాడు. డగౌట్ వైపు చూస్తూ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం వివాస్పదంగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
తన సెలబ్రేషన్‌పై వ్యక్తమవుతున్న తీవ్ర విమర్శల పట్ల సాహిబ్‌జాదా ఫర్హాన్ స్పందించాడు. హాఫ్ సెంచరీ సాధించిన సమయంలో అలా సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన అకస్మాత్తుగా తన బుర్రలోకి వచ్చిందని, ఇది కొన్ని క్షణాల స్పందన మాత్రమేనని వివరణ ఇచ్చాడు. దీన్ని ఎవరు ఏవిధంగా అర్థం చేసుకున్నా తాను పెద్దగా పట్టించుకోనని ఫర్హాన్ చెప్పాడు. మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలో పాక్ జట్టు ఆడిన విధానాన్ని ప్రస్తావిస్తూ, మిగతా ఓవర్లలో కూడా ఆత్మవిశ్వాసంతో దూకుడుగా ఆడాలని భావించానని తెలిపాడు. గ్రూప్-4లో భాగంగా జరగనున్న శ్రీలంక-పాక్ మ్యాచ్‌పై మాట్లాడుతూ ఈ విధంగా ఫర్హాన్ స్పందించాడు.
Read Also- Pakistan Bombing: ఒకే గ్రామంపై 8 బాంబులు జారవిడిచిన పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్… 30 మంది మృతి
జట్టు ఏదైనా దూకుడుగా ఆడాలి
‘‘సిక్సర్ల గురించి మాట్లాడుకుంటే, భవిష్యత్తులో చాలా సిక్సర్లు చూస్తారని అనుకుంటున్నాను. ఇక, ఆ సెలబ్రేషన్ ఆ సమయంలో నా బుర్రలోకి సడెన్‌గా వచ్చింది. అలా జరిగిపోయింది. సాధారణంగా అయితే హాఫ్ సెంచరీ సాధిస్తే నేను పెద్దగా సెలబ్రేషన్ చేయను. కానీ, ఆ సందర్భంలో అలా అనిపించింది. ఒక్కసారి సెలబ్రేట్ చేద్దామనిపించింది. అందుకే, అలా చేశాను. జనాలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. ఎలా అర్థం చేసుకున్నా నేను పెద్దగా పట్టించుకోను. మిగతా విషయాల వస్తే ఏ జట్టుతో ఆడుతున్నా దూకుడుగా క్రికెట్ ఆడాలి. అది ఒక్క భారత్‌తోనే కాదు, ఏ జట్టుతోనైనా సరే ఇదే తరహాలో ఆడాలి. భారత్‌పై ఆడిన విధంగా దూకుడుగా ఆడాలి’’ అని ఫర్హాన్ వివరించాడు.
Read Also- Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి