IPL Auction 2025: వేలంలో రూ.25.20 కోట్లు పలికిన విదేశీ ప్లేయర్
IPL-Auction (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

IPL Auction 2026: ఐపీఎల్ వేలంలో సరికొత్త రికార్డు… రూ.25.20 కోట్లు పలికిన విదేశీ ప్లేయర్

IPL Auction 2025: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలం-2026లో (IPL Auction 2025) సరికొత్త రికార్డు నమోదయింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను (Cameron Green) కోల్‌కతా నైట్‌‌రైడర్స్ ఫ్రాంచైజీ (Kolkata Knight Riders) సంచలన ధరకు కొనుగోలు చేసింది. ఏకంగా రూ.25.20 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. దీంతో, ఐపీఎల్ హిస్టరీలోనే (IPL) అత్యధిక ధర దక్కించుకున్న విదేశీ ప్లేయర్‌గా కామెరాన్ గ్రీన్ అవతరించాడు. గ్రీన్‌ను దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఫ్రాంచైజీ తీవ్రంగా గట్టిగా ప్రయత్నించింది. అయితే, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో బిడ్డింగ్ నుంచి సీఎస్కే వెనక్కి తగ్గింది. చివరాఖరకు కోల్‌కతా ఫ్రాంచైజీ గ్రీన్‌ను సొంతం చేసుకుంది. గత ఐపీఎల్ వేలంలో (2025) గరిష్ఠంగా రూ.24.75 కోట్ల రికార్డు ధర పలికి, అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను కామెరాన్ అధిగమించినట్టు అయింది.

ఐపీఎల్‌లో రూ.20 కోట్లకు పైగా ధర పలికిన మూడవ ఆసీస్ ఆటగాడిగా కూడా గ్రీన్ నిలిచాడు. గ్రీన్‌ కంటేముందు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ ఇద్దరూ 2025లో రూ.20.5 కోట్లు దక్కించుకున్నారు.

Read Also- Thummala Nageswara Rao: యూరియా తగ్గింపుపై దృష్టి పెట్టండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు!

చెల్లించేది రూ.18 కోట్లే!

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కామెరాన్ గ్రీన్ రూ.25.20 కోట్లు పలికినప్పటికీ, అతడు గరిష్ఠంగా రూ.18 కోట్లు మాత్రమే అందుకుంటాడు. మిగతా మొత్తం రూ.7.20 కోట్లు బీసీసీఐకి చెందుతుంది. వేతన పరిమితి ఇందుకు కారణంగా ఉంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, వేలంలోకి ప్రవేశించే ఏ ఆటగాడికైనా గరిష్ట జీతంపై ఒక పరిమితి ఉంటుంది. వరుసగా రెండు సార్లు వేలంలోకి ప్రవేశించినా, లేదా వేరే లీగ్ నుంచి ఐపీఎల్‌లోకి ప్రవేశించిన ఆటగాళ్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. కాబట్టి, ఫ్రాంచైజీలు సదరు ఆటగాడికి గరిష్ఠంగా ఒక సీజన్‌లో రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిమితిని మించి చెల్లించడానికి ఫ్రాంచైజీలకు అనుమతి ఉండదు. కాబట్టి, కేకేఆర్ జట్టు రూ.25.20 కోట్లు బిడ్‌తో దక్కించుకున్నప్పటికీ, రూ.18 కోట్లు మాత్రమే ఆటగాడికి చెల్లిస్తుంది.

Read Also- Telangana Pocso Cases: పసిమొగ్గలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలు.. గడిచిన ఐదేళ్లలో 16,994 పోక్సో కేసులు నమొదు.. శిక్షపడింది..!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?