BCCI: నాల్గో టీ20 రద్దు.. బీసీసీఐ తప్పు చేసిందా?
BCCI (Image Source: Twitter)
స్పోర్ట్స్

BCCI: నాల్గో టీ20 రద్దు.. నెట్టింట తీవ్ర విమర్శలు.. బీసీసీఐ తప్పు చేసిందా?

BCCI: భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం రాత్రి జరగాల్సిన మ్యాచ్ తీవ్ర పొగమంచు కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. అయితే పొగమంచుకు తోడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఎంతో ప్రమాదకరంగా 400 పైగా నమోదైంది. దీంతో పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన ఎంపైర్లు.. మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని తేల్చేశారు. క్రీడాకారుల ఆరోగ్యాన్ని సైతం దృష్టిలో ఉంచుకొని మ్యాచ్ ను అర్ధాంతరంగా క్యాన్సిల్ చేశారు. దీంతో ఎంతో ఆశతో మ్యాచ్ చూడాలని వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. తీవ్ర అసంతృప్తితో క్రికెట్ ఫ్యాన్స్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ రద్దుకు బీసీసీఐ నిర్లక్ష్యమే కారణమని నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిజంగానే తప్పు చేసిందా? లేదా? అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం.

షెడ్యూల్‌లో గందరగోళం..

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి మైదానంలో డ్యూ ఫ్యాక్టర్ ప్రధాన అంశంగా మారిపోయింది. చీకటి పడిన తర్వాత మంచు ప్రభావం ఎక్కువగా ఉండటం మ్యాచ్ విజయావకాశాలను ప్రభావితం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన జట్టు ముందు బ్యాటింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది. తాజాగా నాల్గో టీ20 రద్దు నేపథ్యంలో ఈ చర్చ మరో లెవల్ కు వెళ్లింది. అసలు శీతాకాలంలో అందులోనూ మంచు, కాలుష్యం ప్రభావం అధికంగా ఉండే ఉత్తర భారతంలో మ్యాచ్ లు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాఫ్రికాతో టెస్టులు, వన్డేలు, టీ-20 మ్యాచ్ లకు సంబంధించి చండీగఢ్, ధర్మశాల, లక్నో, రాంచీ, రాయ్ పూర్, అహ్మదాబాద్, విశాఖపట్నం, కటక్, గువాహటి, కోల్ కత్తా వంటి వేదికలను కేటాయించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో లక్నో, న్యూ చండీగఢ్, ధర్మశాల వంటి నగరాల్లో కాలుష్యం, పొగమంచు తీవ్రస్థాయిలో ఉండటం సర్వ సాధారణంగా కనిపించే అంశం.

లక్నోలో ఏం జరిగిందంటే?

లక్నోలో జరగాల్సిన నాల్గో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. సాయంత్రం 6 గంటలకు కాలుష్యం, పొగమంచు మైదానాన్ని పూర్తిగా కప్పేసింది. విజన్ పూర్తిగా మసకబారిపోయింది. మ్యాచ్ కు ముందు ప్రాక్టిస్ సమయంలోనూ ఆటగాళ్లు ఇబ్బందులకు గురైనట్లు కనిపించారు. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కాలుష్యం కారణంగా ముఖానికి సర్జికల్ మాస్క్ పెట్టుకొని కనిపించాడు. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా విడతల వారీగా ఆరు సార్లు ఎంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. పరిస్థితి సాధారణ స్థితికి రాకపోగా అంతకంతకు దిగజారుతుండటంతో రాత్రి 9:30కి మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి రాత్రి అయ్యే కొద్ది మంచు ప్రభావం ఇంకా పెరుగుతుందని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఎంపైర్లు మైదానాన్ని పరిశీలించడం గమనార్హం. అయితే మ్యాచ్ రద్దు గురించి ఆటగాళ్లకు ముందే క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. అందుకే వారు 7.30 గం.లకే డ్రెసింగ్ రూమ్ లోకి వెళ్లిపోయారు.

బీసీసీఐ ఉపాధ్యాక్షుడు అసంతృప్తి

లక్నో మైదానాన్ని ఎంపైర్లు పరిశీలిస్తున్న క్రమంలోనే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గ్రౌండ్ లోకి వచ్చారు. మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడిన తర్వాత ఆయన ముఖంలో తీవ్ర అసంతృప్తి కనిపించింది. ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే లేకపోవడంతో శుక్రవారం (నవంబర్ 19) జరగాల్సిన ఐదో టీ-20 మ్యాచ్ కోసం భారత్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అహ్మదాబాద్ కు బయలుదేరనున్నారు.

Also Read: Asim Munir – Trump: ఆసీం మునీర్‌కు అగ్నిపరీక్ష.. పాకిస్థాన్‌ తర్జన భర్జన.. ట్రంప్ భలే ఇరికించారే!

న్యూజిలాండ్ సిరీస్‌పై ఫోకస్..

దక్షిణాఫ్రికా సిరీస్ సందర్భంగా చోటుచేసుకున్న అనుభవాల నుంచి బీసీసీఐ పాఠాలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. జనవరి 11, 2026న న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్న వైట్ బాల్ సిరీస్ వేదికలను మార్చే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే న్యూజిలాండ్ సిరీస్ కోసం ఉత్తరాదిన ఉన్న స్టేడియాలను బీసీసీఐ పక్కన పెట్టింది. పశ్చిమ, దక్షిణ భారతంలోని వడోదర, రాజ్‌కోట్, ఇండోర్, నాగ్‌పూర్, రాయ్‌పూర్, విశాఖపట్నం, తిరువనంతపురం వంటి వేదికలను బీసీసీఐ ఎంచుకుంది. ఒక్క మ్యాచ్ కోసం మాత్రం ఈశాన్య భారతంలోని గువాహటి మైదానాన్ని ఎంచుకుంది. దానిని కూడా బీసీసీఐ ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: GHMC Elections: ఆ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు? ఇప్పటి నుంచే ఏర్పాట్లు.. మౌఖిక ఆదేశాలు!

Just In

01

Mobile Recharge: మొబైల్ యూజర్లకు షాక్.. మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు

YS Jagan Mass Warning: అధికారంలోకి రాగానే.. వాళ్లని జైల్లో పెడతాం.. జగన్ మాస్ వార్నింగ్

Google Pixel 10: Pixel 10 యూజర్లకు గుడ్ న్యూస్.. GPU అప్డేట్ వచ్చేసింది!

Avatar Fire and Ash: జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమాపై పాన్ ఇండియా దర్శకుడు ప్రశంసలు..

Google Meet Update: మీటింగ్‌లో వాయిస్ కట్ సమస్యకు చెక్.. గూగుల్ మీట్ కొత్త అప్‌డేట్