Ind-Pak-Final
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Asia Cup 2025 Final: ఇది జరిగితే చాలు.. ఫైనల్ మ్యాచ్‌పై పాకిస్థాన్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Asia Cup 2025 Final: మరికొన్ని గంటల్లో ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ (Asia Cup 2025 Final) తలపడనున్నాయి. టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టుని టీమిండియా ఇప్పటికే రెండుసార్లు ఓడించింది. దీంతో, ఫైనల్‌లో మరోసారి మట్టికరిపించి గ్రాండ్‌ లెవల్‌లో ఆసియా కప్‌‌ను ముద్దాడాలన్న పట్టుదలతో ఉంది. కాగా, మ్యాచ్‌కు ఒక్కరోజు ముందు పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్‌లో భారత్‌పై పాక్ గెలుస్తుందన్న ఆశాభావంతో ఉన్నాడు. ఫైనల్లో తమ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందని నమ్ముతున్నానని అన్నాడు. టీమిండియా ప్లేయర్లను ఒత్తిడిలోకి నెట్టగలిగితే చాలు అని, పాక్ జట్టుకు ఎదురయ్యే ప్రధాన సవాలు ఒత్తిడేనని హెసన్ వ్యాఖ్యానించాడు.

గ్రూప్ దశలో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ సంపూర్ణంగా అన్ని విభాగాల్లో చతికిలపడిందని హెసన్ అంగీకరించారు. అయితే, గ్రూప్-4 మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ ప్లేయర్లు మెరుగైన ప్రదర్శన చూపించారని కొనియాడాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 171 పరుగులు సాధించిందని గుర్తుచేశాడు. ఇక, ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టుపై ఒత్తిడి పెంచేంత రీతిలో చక్కటి ప్రదర్శన చేయాలని మైక్ హెసన్ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత జట్టు ప్రపంచ టీ20 క్రికెట్‌లో నెంబర్ వన్ జట్టు అనడానికి కారణం ఉంది. అయినప్పటికీ, ఒత్తిడిని స్థిరంగా కొనసాగించగలిగితే మాకు కావాల్సిన ఫలితాన్ని సాధించవచ్చు’’ అని అన్నాడు. కాగా, ఆదివారం రాత్రి 8 గంటలకు దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Read Also- Jr NTR: ‘కాంతార చాప్టర్ 1’ వేదికపై ‘డ్రాగన్’ అప్డేట్ ఇవ్వబోతున్నారా? ఫ్యాన్స్ వెయిటింగ్!

అభిషేక్ మా విజయాన్ని లాగేశాడు

లీగ్ దశలో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ 111/9 వద్ద ఉన్నప్పటికీ, షాహీన్ అఫ్రిది చివరిలో మెరుపులు మెరిపించి స్కోరును 127కి తీసుకెళ్లాడు. కానీ, పాక్ విజయానికి అది చాలలేదు. ఆ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 7 వికెట్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక, గ్రూప్-4లో భాగంగా జరిగిన మ్యాచ్‌ గురించి హెసన్ మాట్లాడుతూ, ‘‘ఆ మ్యాచ్‌లో గెలుపు రేసులో ఉన్నామని అనిపించింది. కానీ, అభిషేక్ శర్మ ఒక్కడే మమ్మల్ని గెలుపు నుంచి దూరం చేశాడు’’ అని వ్యాఖ్యానించాడు. ‘‘ ఆ మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు‌ మెరుగుపడ్డారు. మొదటి మ్యాచ్‌లో మేము కొంచెం రక్షణాత్మకంగా ఆడాం. భారత జట్టుకు ఆటపై పూర్తి నియంత్రణ ఇచ్చేశాం. కానీ, రెండవ మ్యాచ్‌లో చాలా సమయంపాటు మేమే మ్యాచ్‌పై నియంత్రణ సాధించాం. అయితే, అభిషేక్ శర్మ అనూహ్యమైన ఇన్నింగ్స్ ఆడి ఆ ఆటను మాకు దూరంగా తీసుకెళ్లాడు’’ హెసన్ వివరించారు.

ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ద్వారా విశ్వాసాన్ని కూడగట్టుకున్నామని, కాబట్టి, దానిని ఉపయోగించుకోవాలనుకుంటున్నామని తెలిపాడు. ఆసియా కప్ ట్రోఫీని గెలవడానికి తాము చాలాకాలంగా కృషి చేస్తున్నామని హెసన్ గుర్తుచేశాడు. తమ జట్టు ప్రతిసారీ విజయాలు సాధించలేకపోవచ్చు, కానీ, ఫలితాలను సాధించడంలో విజయవంతమయ్యేలా యువజట్టు సరైన దిశలో పరిణితి చెందుతోందని ఆయన చెప్పారు.

Read Also- Petal Gahlot: ఐరాసలో పాక్ ప్రధాని వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చిన భారత లేడీ ఆఫీసర్

Just In

01

Hydra: వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన హైడ్రా!

TVK Rally Stampede: తమిళ హీరో విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట.. పెద్ద సంఖ్యలో మరణాలు

Mohan Babu: కింగ్ నాగార్జున రూటులోనే కలెక్షన్ కింగ్.. మరో పిక్ వచ్చింది చూశారా?

Harish Rao: టూరిజం అభివృద్ధి పేరుతో సర్కార్ స్కాం.. మంత్రి హరీశ్ సంచలన కాామెంట్స్!

Cow Rescue: భారత పర్యటనలో ఉన్న ఈ ఆస్ట్రేలియా టూరిస్ట్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనేమో!