RCB Sale: ఐపీఎల్-18వ ఎడిషన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరు నగరంలో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత కేసుల పరిణామాల నేపథ్యంలో ఫ్రాంచైజీని విక్రయించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్టుగా కొన్ని నెలలక్రితమే కథనాలు వెలువడ్డాయి. ఈ మేరకు బీసీసీఐకి సమాచారం (RCB Sale) కూడా ఇచ్చినట్టు కథనాలు వెలువడ్డాయి. కాగా, ఆర్సీబీని దక్కించుకునే రేసులో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా ముందువరుసలో ఉన్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ‘కరెక్ట్ వాల్యూయేషన్‌కి ఆర్సీబీ మంచి జట్టు’ అంటూ ఆయన ట్వీట్ చేయడంతో ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది. దీంతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును ఆయన కొనుగోలు చేయబోతున్నారంటూ జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామం క్రీడావర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పెద్దగా హడావుడి లేకుండానే ఆయన రేసులో నిలిచారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఆర్సీబీ జట్టు ప్రస్తుతం యునైటెడ్ స్పిరిట్స్ నేతృత్వంలోని డియాజియో యాజమాన్యంలో ఉంది.
Read Also- Shocking Video: ర్యాంప్ వాక్ చేస్తుండగా భూకంపం.. హడలిపోయిన మోడల్స్.. దెబ్బకు పరుగో పరుగు!
వ్యాల్యూ 2 బిలియన్ డాలర్లు?
పలు మీడియా కథనాల ప్రకారం, ఆర్సీబీని విక్రయించాలని డియాజియో భావిస్తోంది. అయితే, దాని వ్యాల్యూ 2 బిలియన్ డాలర్లుగా నిర్ణయించినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. భారతీయ కరెన్సీలో ఈ విలువ రూ.17 వేల కోట్లు పైగానే ఉంటుంది. కాబట్టి, ఈ రేటుకు ఆర్సీబీ సేల్ అయితే గనుక క్రికెట్ చరిత్రలో అత్యంత విలువైన సింగిల్-టీమ్ డీల్‌గా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్సీబీ సేల్ ప్రాసెస్‌ను పర్యవేక్షించేందుకుగానూ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ‘సిటీ’ని ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా నియమించినట్లు తెలుస్తోంది.
Read Also- Madhya Pradesh: శిశువును చెత్తలో పడేసి.. పైన బండరాయి పెట్టిన తల్లిదండ్రులు.. 72 గంటల తర్వాత..
ఆర్సీబీ జట్టు 2025 ఐపీఎల్ ట్రోఫీని గెలవడంతో ఫ్రాంచైజీ బ్రాండ్ విలువ గణనీయంగా పెరిగింది. ఈ కారణంగానే ధరను 2 బిలియన్ డాలర్లుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ జట్ల వ్యాల్యూను లెక్కించేందుకు ఇటీవల జరిపిన సర్వేలో ఆర్సీబీ అగ్రస్థానంలో నిలిచింది. ధరను నిర్ణయించడంలో ఇలాంటి సర్వేలో కూడా దోహదపడ్డాయి. కాబట్టి, కొనుగోలుదారులు సైతం ప్రీమియం ధర చెల్లించడానికి సిద్ధంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ 2 బిలియన్ డాలర్లకు అమ్ముడుపోతే, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో పోలిస్తే రెట్టింపు విలువను దక్కించుకున్నట్టు అవుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుని ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ రూ. 7,090 కోట్లకు కొనుగోలు చేసింది.
2008లో ప్రస్థానం మొదలు
ఆర్సీబీ జట్టు ప్రస్థానం 2008లో మొదలైంది. ఆ ఏడాది జరిగిన వేలంలో విజయ్ మాల్యా నేతృత్వంలోని యూబీ గ్రూప్ సుమారు 111.6 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాతి డియాజియో (Diageo) కంపెనీ మెజారిటీ వాటా దక్కించుకొని యజమానిగా మారింది. కాగా, పూనావాలా టేకోవర్ చేసుకుంటే, భారీ ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. ఆర్సీబీ 2025లో ట్రోఫీని గెలుచుకోవడంతో మీడియా రైట్స్, స్పాన్సర్‌షిప్, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ ద్వారా భారీ ఆదాయాన్ని పొందే వీలుంటుంది.