Madhya Pradesh (Image source: Twitter)
క్రైమ్

Madhya Pradesh: శిశువును చెత్తలో పడేసి.. పైన బండరాయి పెట్టిన తల్లిదండ్రులు.. 72 గంటల తర్వాత..

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కేవలం 3 రోజుల వయసు ఉన్న శిశువును.. కన్న తల్లిదండ్రులే చెత్తకుప్పలో పారేశారు. ఆపై ఎవరికీ కనిపించకుండా బిడ్డపై రాయిపెట్టారు. అయితే చలిని, చీమల కాటును ఎదుర్కొంటూ ఆ శిశువు రాత్రంతా చెత్తకుప్పలోనే బతికింది. చివరికి గ్రామస్తులు శిశువును గుర్తించి శిశువును రక్షించారు.

వివరాల్లోకి వెళ్తే..

సెప్టెంబర్ 23 తెల్లవారుజామున రాజకుమారి అనే మహిళ నాల్గో బిడ్డకు ఇంట్లోనే జన్మనిచ్చింది. అయితే ఆమె భర్త బబ్లు డాండోలియా ప్రభుత్వ టీచర్ గా వ్యవహరిస్తున్నారు. అప్పటికే ముగ్గురు పిల్లలు ఉండగా.. తాజాగా నాల్గో శిశువు చేరడంతో బబ్లు దంపతులు కంగారు పడ్డారు. నలుగురు పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం పోతుందని భయపడ్డారు. దీంతో పుట్టి 72 గంటలే అవుతున్న శిశువును ఎలాగైన అడ్డుతప్పించాలని అనుకున్నారు.

అడవిలో విడిచిపెట్టి..

బిడ్డను వదిలించుకునేందుకు తల్లిదండ్రులు ఇద్దరు నందనవాడి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. చెత్త నిండిన ప్రాంతంలో బిడ్డను వదిలేశారు. ఆపై ఎవరికీ కనిపించకుండా బిడ్డపై ఒక రాయిని సైతం పెట్టారు. అయితే ఉదయం నడకకు వెళ్లిన కొందరు గ్రామస్తులు బిడ్డ ఏడుపు శబ్దాన్ని విన్నారు. పరిగెత్తుకుంటూ అక్కడి వెళ్లి చూడగా రాయి కింద శిశువు కనిపించింది. వెంటనే బండరాయిని పక్కకు తీసి.. బిడ్డను రక్షించారు. ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే?

వాకింగ్ కు వెళ్లినప్పుడు తమకు ఏడుపు శబ్దం వచ్చిందని ఒక గ్రామస్థులు తెలిపాడు. అయితే మెుదట ఏదో జంతువు అని భావించామని.. తీరా అది శిశువు ఏడుపని నిర్ధారించుకున్నట్లు చెప్పారు. దగ్గరకు వెళ్లి చూడగా.. రాయి కింద చిన్న చిన్న కాళ్లు చేతులు కదలాడం చూశామని అన్నారు. తెరిచి చూడగా శిశువు కనిపించిందని.. దీంతో తామంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యామని పేర్కొన్నారు.

శిశువు ఒంటిపై చీమకాట్లు

ఛింద్వారా జిల్లా ఆస్పత్రి వైద్యులు వెంటనే శిశువుకు అత్యవసర వైద్యం అందించారు. బిడ్డ ఒంటిపై చీమల కాట్లు గుర్తించామని తెలిపారు. ‘అలాంటి కఠిన పరిస్థితిలో రాత్రంతా శిశువు అడవిలో బ్రతకడం అద్భుతమే. సాధారణంగా ఇది ప్రాణాంతకమవుతుంది’ అని ఒక వైద్యుడు చెప్పారు. ప్రస్తుతం శిశువు సురక్షితంగా.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

Also Read: IND vs WI First Test: తొలి టెస్టులో చెలరేగిన సిరాజ్.. పీకల్లోతూ కష్టాల్లో వెస్టిండీస్.. ఇక వార్ వన్ సైడేనా!

కేసు నమోదు..

శిశువును వదిలేసిన తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాము చేసిన తప్పును పేరెంట్స్ కూడా అంగీకరించినట్లు చెప్పారు. ఘటనపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. వారి సూచన మేరకు హత్యాయత్నం కింద బిడ్డపై కేసు నమోదు చేస్తామని అన్నారు.

Also Read: Airtel Recharge Plan: అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.. రూ.199కే హైస్పీడ్ 5జీ, అపరిమిత కాల్స్.. వర్త్ మామా వర్త్!

Just In

01

Royal Enfield Bullet 650: త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 లాంచ్..

Viral Video: కూతురికి భోజనం నచ్చలేదని.. ఏకంగా యూనివర్శిటీ ముందే ఫుడ్ స్టాల్ పెట్టేసిన తండ్రి

Dhandoraa Teaser: హైదరాబాద్, అమెరికా.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె!

Sheikh Hasina: షేక్ హసీనాకు మరణశిక్ష.. ఢాకా కోర్టు సంచలన తీర్పు

Teachers Unions: ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌కు ఉపాధ్యాయ సంఘాల పిలుపు.. ఎందుకంటే?