Mahesh Kumar Goud: కవితకు చరిత్ర తెలుసా? అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రశ్నించారు. మెకు విలీన దినోత్సవానికి ఏం సంబంధం ? అంటూ ఫైర్ అయ్యారు. కవిత (Kavitha) చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అధికంగా ఉంటుందని, అందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు మరి కొంత మంది నేతలు బాహాటంగా మాట్లాడుతున్నారన్నారు. కానీ రెడ్ లైన్ దాటితే ఎవర్నీ ఊపేక్షించబోమన్నారు. ఇక బీసీల కోసం పోరాడే నాయకుడిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.ఆపరేషన్ పోలో పేరిట పటేల్ హైదరాబాద్ ను దేశంలో విలీనం చేశారన్నారు. విలీనం నాటికి బీజేపీ పార్టీ పుట్టనే లేదన్నారు. దొడ్డి కొమరయ్య,షేక్ బంధిగి, కొమురం భీం, చాకలి ఐలమ్మ వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.
Also Read: Ramachandra Naik: ఇందిరమ్మ ఇండ్లు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం
గాంధీ మీద బీజేపీకి ప్రేమ లేదని, కానీ మహాత్ముని చంపిన గాడ్సే ను ప్రేమిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ఎన్నికల సంఘాన్ని లొంగదీసుకుని మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ పాలనను ఆయన తీవ్రంగా విమర్శించారు. బీహార్‌లో ఓటు దోపిడీ ప్రయత్నాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నడిపిస్తున్న ఓటు చోరీ ఉద్యమం బీజేపీ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నదని అన్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అద్భుతమైన ప్రజా పాలన కొనసాగుతోందని, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం నుంచి సన్నబియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోంది
ఇక మహిళ సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు.కోటీ మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రభుత్వ పరంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ల నుంచి కుట్టు మిషన్ల కోసం బడ్జెట్ మంజూరు కోసం డిప్యూటి సీఎం తో చర్చిస్తానన్నారు.ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పన కార్యక్రమంలో మదర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని తెలిపారు. మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంద్యా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రోగ్రామ్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మహిళా సాధికరత కోసం ఆమె చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇక కర్నాటక ,తెలంగాణలో తప్ప మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎక్కడా లేదన్నారు. జనహిత పాదయాత్రలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మహిళల కళ్లలో చూసిన ఆనందం మాటల్లో చెప్పలేనన్నారు.
Also Read: Illegal Construction: తూంకుంటలో అక్రమ నిర్మాణాలకు బ్రేక్.. స్పందించిన అధికారులు