Harish Rao: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు యూరియా సంక్షోభం వచ్చిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు. అసెంబ్లీలో యూరియా కొరత, వదరల మీద చర్చ చేయాలని బీఆర్ఎస్(brs) డిమాండ్ చేస్తే, మాకు యూరియా, వరదల కంటే బురద రాజకీయాలే ముఖ్యమని అన్నారని ఎద్దేవా చేశారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి, కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా ఆదరాబాదరాగా సభను నిర్వహించి, అర్థంతరంగా, అసంపూర్తిగా ముగించారని మండిపడ్డారు.
Also Read: Kambalapalli Lake: గుట్టల నడుమ కాకతీయులనాటి కంబాలపల్లి చెరువు.. దీని ప్రత్యేకత తెలుసుకోవాల్సిందే!
యూరియా కోసం రైతులు ఇంతగా తిప్పలు
ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం లేదు, సామర్థ్యం లేదు. ఇలాంటి దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) తీరు తెలంగాణ రైతాంగానికి పెనుశాపంగా మారిందన్నారు. దేశ చరిత్రలో యూరియా(Urea) కోసం రైతులు ఇంతగా తిప్పలు పడ్డ పరిస్థితులు ముందెన్నడూ లేదన్నారు. కాంగ్రెస్ చేతకాని పాలనతో పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు(Farmers) యూరియా కోసం నడిరోడ్ల వెంట బారులు తీరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు, పాస్ బుక్కులు చేత పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల రైతన్నకు వచ్చిన సంక్షోభం
పత్తి పూత దశతో ఉంది. ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి రాదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభానికి నిన్న సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో కట్టలు తెంచుకున్న రైతుల(Farmers) ఆగ్రహమే నిదర్శనం అన్నారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభం కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల రైతన్నకు వచ్చిన సంక్షోభం అని మండిపడ్డారు. యూరియా అడిగిన పాపానికి రైతుల చెంపలు చెల్లుమనిపించిన సోకాల్డ్ ప్రజా పాలన ఇదన్నారు. 22 నెలల పాలనలో యావత్ తెలంగాణ రైతాంగాన్ని నడి రోడ్డు మీదకు ఈడ్చిన దుర్మార్గ పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది, రేవంత్ రెడ్డిది అని దుయ్యబట్టారు. జై కిసాన్ అని నాటి కాంగ్రెస్ అంటే, నై కిసాన్ అని నేటి రేవంతు అంటున్నాడని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరి వల్ల రైతులు కంటి నిండా నిద్ర పోని పరిస్థితి లనెకొందన్నారు.
కేంద్రం పై ఒత్తిడి చేయాలి
8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణకు చేస్తున్నది ఏమున్నదని, శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అని మండిపడ్డారు. పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపును ఉపసంహరించుకోవాలని, పత్తిపై ఎత్తివేసిన దిగుమతి సుంకాన్ని యదావిధిగా కొనసాగించాలని ఈ మేరకు ఎంపీలు కేంద్రం పై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనికి మాలిన డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని, రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరా చేయడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే యూరియా కోసం రైతుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Also Read: Lavanya Tripathi: మెగా ఫ్యాన్సుకు గుడ్ న్యూస్.. వారసుడికి వెల్‌కమ్ చెప్పిన లావణ్య త్రిపాఠి