Kambalapalli Lake ( iMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Kambalapalli Lake: గుట్టల నడుమ కాకతీయులనాటి కంబాలపల్లి చెరువు.. దీని ప్రత్యేకత తెలుసుకోవాల్సిందే!

Kambalapally Lake: ఆహా ఈ చెరువు చూశారా ఎంత ఆహ్లాదకరంగా ఉందో చుట్టూ గుట్టలు మధ్య మధ్యలో చెరువుల ఆనవాళ్లు మరీ చూస్తే పచ్చగా కనపడే ప్రకృతి వనాలుగా పిలుచుకునే చెట్లు. ఆహా ఆహా అంటూ ప్రకృతి ప్రేమికులు పనిగట్టుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంబాలపల్లి చెరువు(Kambalapalli Lake) అందరికీ ఆహ్లాదాన్ని పంచుతుంది. వర్షం పడిందంటే మహబూబాబాద్ జిల్లా తో పాటు సరిహద్దు జిల్లాలు సూర్యాపేట ఖమ్మం ములుగు వరంగల్ జిల్లాల పర్యాటక ప్రేమికులు కంబాలపల్లి చెరువు (Kambalapalli Lake) ను చూసేందుకు ఉత్సాహంగా ప్రయాణాలు కడతారు.

 Also Read: New Thar Crashes: నిమ్మకాయలు తొక్కించబోయి.. రూ.15 లక్షల కొత్త కారును.. బోల్తా కొట్టించిన యువతి

పర్యాటక రంగంగా తీర్చిదిద్ది బోటింగ్ సైతం ఏర్పాటు

కంబాలపల్లి చెరువు (Kambalapalli Lake) కు అతి సమీపంలో బి ఎన్ గుప్త ప్రాజెక్టు గతంలో తులారం ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ప్రాజెక్టు ఉంటుంది. తులారం ప్రాజెక్టును మరో ఐదు నుంచి 8 అడుగులు పెంచితే అక్కడ అడవుల నుంచి వచ్చే జలపాతం బి ఎన్ గుప్తా ప్రాజెక్టులో నిల్వ అవుతుంది. అయితే కంబాలపల్లి చెరువుకు అతి సమీపంలో ఉన్న బియ్యం గుప్త ప్రాజెక్టు నుంచి వాటర్ ను సరఫరా చేస్తే కంబాలపల్లి చెరువు నిత్యం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ చెరువుకు బీఎన్ గుప్త ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేసేందుకు పలుమార్లు సర్వేలు, సందర్శనలు, పర్యవేక్షణలు కొనసాగాయి. తెలంగాణ ప్రభుత్వం అనుకుంటే కొద్ది రోజుల్లోనే కంబాలపల్లి చెరువును పర్యాటక రంగంగా తీర్చిదిద్ది బోటింగ్ సైతం ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

చూపరులకు ఆహ్లాదకరం, కాకతీయుల నాటి ఆలయంతో ఆధ్యాత్మికం

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న కంబాలపల్లి చెరువు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే మహబూబాబాద్ జిల్లా ప్రజలతోపాటు సరిహద్దు ప్రాంత జిల్లాలు ములుగు, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, సూర్యాపేట ప్రాంత ప్రజలకు సైతం ఆహ్లాదకరమైన ప్రాంతం దర్శనమిస్తుంది. అదేవిధంగా కాకతీయ కాలంలో కంబాలపల్లి చెరువును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కంబాలపల్లి చెరువుకు ఆనుకునే కాకతీయ రాజుల కాలంలోనే శివాలయ ఆలయాన్ని నిర్మించారు.

దీంతో ఇక్కడ సందర్శించే పర్యాటకులకు ఒకవైపు ఆహ్లాదకరం, మరోవైపు ఆధ్యాత్మికం లభిస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ సందర్శించిన వారంతా వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు ఆహ్లాదకర, ఆధ్యాత్మికతలను వివరించడంతో పర్యటకుల తాకిడి కంబాలపల్లి చెరువుకు ఎక్కువైపోయింది. దీంతో కంబాలపల్లి గ్రామస్తులు పర్యాటకులు ఎక్కువ మంది రావడంతో వారి జీవనోపాధికి సైతం కొంత ఆదాయ ఆర్థిక అభివృద్ధి లభిస్తుందడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు అభివృద్ధి కోసం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి విశేష కృషి చేస్తుండడం విశేషం.

 Also Read: N Ramchandra Rao: పరీక్ష హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం: రాంచందర్ రావు

Just In

01

Hydra: కూకట్ పల్లిలో రూ. వంద కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

Daggubati Brothers: విచారణకు హాజరుకాని దగ్గుబాటి బ్రదర్స్.. కోర్టు సీరియస్​

Boinapally Vinod Kumar: గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదు.. మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

Mee Seva: మీ సేవ పరిధిలోకి కొత్త విధానం.. ఈ సర్టిఫికెట్ జారీ చేయడంలో మరింత సులభతరం

Pooja Hegde: పూజా హెగ్డేకు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?