N Ramchandra Rao (imagecredit:twitter)
తెలంగాణ

N Ramchandra Rao: పరీక్ష హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం: రాంచందర్ రావు

N Ramchandra Rao: గ్రూప్​ 1 పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు(Ramchandra Rao) అన్నారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు. గ్రూప్​ 1 అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ(BJP) చేసిన పోరాట ఫలితమే ఈ తీర్పు అని అన్నారు. జాబ్​ క్యాలెండర్(Job calendar) మాట దేవుడెరుగు.. ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని కాంగ్రెస్(Congress)​ పై ఘాటు విమర్శ చేశారు. గ్రూప్-1 నిర్వహణలో గందరగోళం సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని తాము మొదటినుంచి చెబుతున్నామని ఆయన గుర్తుచేశారు. కేవలం మొండిపట్టుకు పోయి వేలాదిమంది అభ్యర్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం చెలగాటమాడిందని ఆయన దుయ్యబట్టారు.

ప్రతినిధులు ప్రత్యక్ష పోరాటం

నోటిఫికేషన్ విడుదల నుంచి ఆన్సర్ షీట్స్ మూల్యాంకనం వరకు అన్నీ తప్పుడు విధానాలనే టీజీపీఎస్సీ(TGPCS) అవలంభించిందని రాంచందర్ రావు ఆరోపించారు. గ్రూప్-1 అభ్యర్థుల అభ్యర్థనలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాంచందర్ రావు విమర్శించారు. అభ్యర్థులకు మద్దతుగా కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi sanjay) కుమార్ తో సహా పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రత్యక్ష పోరాటం చేశారని గుర్తుచేశారు. భారతీయ జనతా యువమోర్చా నిరంతర పోరాటాలు కొనసాగించిందని వివరించారు. ఒక పరీక్ష కేంద్రంలోని ఒకే గదిలో పరీక్ష రాసిన అభ్యర్థులు ఎక్కువమంది సెలక్ట్ కావడం, మూల్యాంకనం పూర్తిగా లోపభూయిష్టంగా నిర్వహించడంతో వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులను తీవ్ర మనోవేదనకు గురయ్యారని ఆయన వివరించారు. ప్రతిఏటా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఒక్క పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించ లేకపోయారని రాంచందర్ రావు ఆరోపించారు.

Also Read: Dr. Jeevan Chandra: నిత్య కృషీవలుడు..పేద ఇంట్లో వికసించిన జ్ఞాన దీపం.. జీవన్ చంద్ర!

కాళేశ్వరంపై కాంగ్రెస్ ద్వంద వైఖరి

కాళేశ్వరం ప్రాజెక్ట్​ పై కాంగ్రెస్​ ద్వంద వైఖరిని అవలంభిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్​ శంకర్(MLA Payal Shankar)​ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా మాట్లాడిన కాంగ్రెస్(Congress)​ అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతోందన్నారు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్ట్​ పై పీ.సీ.ఘోష్​ కమిషన్​(P.C. Ghosh Commission) ను మాత్రం ఏర్పాటు చేసిందన్నారు. కమిషన్ వేసిన తరువాత మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు ఎందుకు చేశారని ప్రశ్నించారు. గ్రోటింగ్ చేసి ఆధారాలు లేకుండా చేసిందన్నారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాంగ్రెస్​ నేతలు ఏ విషయంలో అవినీతి జరిగిందో అన్నది నిగ్గు తేల్చ లేదన్నారు. కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమయ్యారని అంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) అవినీతిని బయట పెట్టే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై సీబీఐ(CBI) విచారణకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో(GO)ను వెంటనే సవరించాలన్నారు. ఈ జీవోలో సీబీఐకి పరిమితులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. జీవోను సవరించక పోతే కాంగ్రెస్​(Congress).. బీఆర్​ఎస్(BRS) ఒక్కటే అని తేలిపోతుందని వ్యాఖ్యానించారు. జీవో సవరింపుపై అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళతామని చెప్పారు.

Also Read: Agriculture Officer: మహబూబాబాద్ ఏవో నిర్లక్ష్యమే.. రైతులకు యూరియా కష్టాలు!

Just In

01

Indian Handicrafts: ఈ నెలలో భారతీయ చేతివృత్తుల మహోత్సవం.. ఎక్కడో తెలుసా..?

Shocking Incident: అందరూ చూస్తుండగానే.. కుప్పకూలిన స్వీడన్ ఆరోగ్య మంత్రి.. వీడియో వైరల్

Bhadra Kaali Trailer: విజయ్ ఆంటొనీ భద్రకాళి ట్రైలర్ ఇదే.. సస్పెన్స్‌తో మరోసారి మన ముందుకు

Gold Rate Today: బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Day Care Centers: క్యాన్సర్ నివారణ పై సర్కార్ ఫుల్ ఫోకస్.. అందుకు ప్రణాళికలు ఇవే..!