J-35B figher Jet
జాతీయం, లేటెస్ట్ న్యూస్

F-35B Jet: కేరళలో నిలిచిన బ్రిటన్ ఎఫ్-35బీ విషయంలో కీలక పరిణామం

F-35B Jet: కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో గత మూడు వారాలుగా నిలిచివున్న యూకే రాయల్ నేవీకి చెందిన ఎఫ్-35బీ (F-35B) స్టెల్త్ ఫైటర్ జెట్‌ రిపేర్ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం విమానాన్ని హ్యాంగర్‌లోకి లాక్కెళ్లి మరమ్మతు పనులు మొదలుపెట్టారు. సాంకేతిక నిపుణులు విమానంలోని లోపాలను గుర్తించి సరిచేయడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మేరకు కొత్తగా మరో ఇంజినీర్ల బృందం ‘ఎయిర్‌బస్ A400M అట్లాస్’ కార్గో విమానంలో భారత్ చేరుకుంది. రిపేర్‌ను ఇక్కడే చేయాలా, లేక విమానాన్ని విడగొట్టి స్పెషల్ కార్గో విమానంలో బ్రిటన్‌కు తీసుకెళ్లాలా అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఒకవేళ తరలించాల్సి వస్తే, భాగాలు విడదీయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రిపేర్‌ సాధ్యపడకపోతే, సీ-17 గ్లోబ్‌మాస్టర్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా విమానాన్ని బ్రిటన్‌కి తరలించే అవకాశముంది.

Read Also- Shubman Gill: చరిత్ర తిరగరాసిన గిల్.. 148 ఏళ్ల చరిత్రలో తొలిసారి

రేటు ఎంత?
నిలిచిపోయిన ఈ యుద్ధ విమానాన్ని హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇంజనీర్లు ఇప్పటికే పరిశీలించి అంచనా వేశారు. యూకే నుంచి అదనపు సాంకేతిక నిపుణులు సాయం, ప్రత్యేక పరికరాలు అవసరమని వారు చెప్పారు. కాగా, ఎఫ్-35బీ ఫైటర్ జెట్ ధర ఏకంగా 110 మిలియన్ డాలర్లుకు పైమాటే. భారతీయ కరెన్సీలో ఈ విలువ రూ.940 కోట్లకు పైగానే ఉంటుంది. తయారీ ఖర్చు పరంగా అత్యంత ఖరీదైన యుద్ధ విమానమని నిపుణులు చెబుతున్నారు.

Read Also- NASA: సౌరవ్యవస్థలో వింత.. విశ్వంతరాల నుంచి ప్రవేశించిన కొత్త వస్తువు

నిజానికి, ఎఫ్-35బీ విమానం రెక్కలు తొలగించి వాయుమార్గాన తరలించిన ఘటన 2019 మే నెలలో తొలిసారి జరిగింది. ఫ్లోరిడాలోని ఎగ్లిన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి, సీ-17 గ్లోబ్మాస్టర్ అనే భారీ విమానం ద్వారా ఎఫ్-35బీ లైట్నింగ్ IIను యూటాలోని హిల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు తరలించారు. ఎఫ్-35లో ఉన్న అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ కారణంగా భాగాలను విడదీయడం చాలా సున్నితమైన పని. రకరకాల టెక్నాలజీలను ఉపయోగించడంతో స్టెల్త్ ఫైటర్ జెట్‌ భాగాలు విడదీస్తున్నప్పుడు బ్రిటిష్ సైన్యం నిశితంగా పర్యవేక్షిస్తుంది. ఆర్మీ నిపుణులు దగ్గరుండి పరిశీలిస్తారు. ప్రతి కదలికను కూడా రికార్డు చేసి ధృవీకరించాల్సి ఉంటుంది. ప్రతి భాగాన్ని కఠిన నిబంధనలతో రికార్డ్ చేయాలి. విమానానికి సంబంధించిన డేటా ఉల్లంఘన జరగకుండా ప్రతి స్క్రూ నుంచి టెక్నాలజీ వరకు భద్రంగా కాపాడుతారు. అన్నింటికీ కోడింగ్ ఇస్తారు. స్టెల్త్ టెక్నాలజీ చౌర్యం జరిగితే యుద్ధ రహస్యాలను బహిర్గతం అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా దౌత్య, సైనిక పరమైన ముప్పులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దేశ భద్రత సమగ్రతకు చాలా కీలకమైన స్టెల్త్ టెక్నాలజీని పరిరక్షించడం చాలా కీలకమని బ్రిటన్ భావిస్తోంది.
అందుకే, అత్యంత గోప్యతను పాటిస్తోంది. మరి, విమానం కదులుతుందో లేదో వేచిచూడాలి.

Read Also- Saif Ali Khan: కీలక పరిణామం.. సైఫ్ అలీఖాన్‌ వారసత్వ ఆస్తులన్నీ ప్రభుత్వ ఆధీనంలోకే!

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!