Saif Alikhan
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Saif Ali Khan: కీలక పరిణామం.. సైఫ్ అలీఖాన్‌ వారసత్వ ఆస్తులన్నీ ప్రభుత్వ ఆధీనంలోకే!

Saif Ali Khan: బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీ ఖాన్‌కు (Saif Ali Khan) ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందిన సుమారు రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులను ‘ఎనిమీ ప్రోపర్టీ’గా గుర్తిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. దీంతో, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై వారసత్వ హక్కులను ఆయన, ఇతర కుటుంబ సభ్యులు కోల్పోయారు. సైఫ్ అలీఖాన్‌కు నాయనమ్మ సాజిదా సుల్తాన్‌కు అనుకూలంగా 2000లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎనిమీ ప్రోపర్టీ చట్టం ప్రకారం, దేశ విభజన తర్వాత భారతదేశాన్ని వీడి పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన వ్యక్తుల ఆస్తులను ‘శత్రువు ఆస్తులు లేదా విడిచిపెట్టిన ఆస్తులు’గా పరిగణిస్తారు. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్‌ పెద్ద కూతురు సాజిదా, ఆస్తులకు వారసురాలిగా ఉన్న సమయంలోనే పాకిస్థాన్‌కు వెళ్లిపోవడంతో ఆ ఆస్తులును ఎనిమీ ప్రోపర్తీగా గుర్తిస్తున్నట్టు మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. హమీదుల్లా రెండో కూతురు సాజిదాకు చెందిన వారసులైన సైఫ్, ఇతరులు వారసత్వం తమకే దక్కుతుందంటూ కొన్నేళ్లుగా న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. హైకోర్టు తీర్పు రావడంతో వారికి పెద్ద దెబ్బతగిలినట్టు అయింది.

భోపాల్‌లో భారీగా ఆస్తులు
భోపాల్ చివరి నవాబ్ అయిన హమీదుల్లాకు చెందిన ఆస్తులు భోపాల్‌లో పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వేల ఎకరాల భూములతో పాటు భారీ భవంతులు, ప్యాలెస్‌లు ఉన్నాయి. భోపాల్‌లోని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, నూర్-ఉస్-సబా ప్యాలెస్‌ ఉన్నాయి. భోపాల్‌లో 5,796 ఎకరాలు, భోపాల్ వెలుపల 1,370 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. చివరి నవాబు హమీదుల్లా ఖాన్‌ ఆస్తికి షర్మిలా, సైఫ్‌లు నిజమైన వారసులంటూ ఫిబ్రవరి 2000 నాటి భోపాల్ జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వివాదానికి కేంద్ర బిందువేది?
వివాదం మూలాల్లోకి వెళ్తే సైఫ్ అలీ ఖాన్ ముత్తాత హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు అబిదా సుల్తాన్, సాజిదా సుల్తాన్, రబియా సుల్తాన్. హమీదుల్లా మరణం తర్వాత పెద్ద కూతురైన అబిదా వారసురాలు అయ్యారు. అయితే, ఆస్తులపై తన హక్కులను వదులుకుని పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆస్తులపై హక్కులను ఆమె కోల్పోవడం వివాదానికి కేంద్ర బిందువైంది. రెండవ కూతరు సాజిదా సుల్తాన్‌ను వారసురాలిగా అప్పట్లో ప్రకటించారు. ఆమెను వారసురాలిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా 1962 జనవరి 12న ఉత్తర్వులు జారీ చేసింది. సాజిదా ‘పటౌడీ నవాబ్’ అయిన ఇఫ్తికార్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. 1995లో సాజిదా చనిపోయాక ఆమె ముగ్గురు పిల్లలు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, అక్కాచెల్లెళ్లు సలేహా సుల్తాన్, సబీహా సుల్తాన్ ఆస్తికి వారసులయ్యాయి. ముస్లిం పర్సనల్ లా ప్రకారం వారసత్వంగా ఆస్తులను పొందారు. మన్సూర్ అలీ ఖాన్ వారసత్వంగా పొందిన ఆస్తులను అతడి ముగ్గురు పిల్లలు సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్, సబా అలీ ఖాన్ వారసత్వంగా పొందారు. అయితే, ఖాన్ కుటుంబానికి చెందిన ఇతర వారసులు బేగం సురయ్య రషీద్, బేగం మెహర్ తాజ్, సాజిదా సుల్తాన్, నవాబ్జాది ఖమర్ తాజ్ రబియా సుల్తాన్, నవాబ్ మెహర్ తాజ్ సాజిదా సుల్తాన్, ఇతరులు దీనిని వ్యతిరేకించారు. హమీదుల్లా ఖాన్‌కు చెందిన భోపాల్ ఆస్తులకు సైఫ్‌ను వారసుడిగా ప్రకటిస్తూ భోపాల్ జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వును వారు వ్యతిరేకించారు. భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధాలలో పాల్గొని పోరాడినా, లేదా శత్రు దేశాల పౌరసత్వం పొందిన వ్యక్తులు లేదా వారి వారసులు వదిలిపెట్టిన ఆస్తులను ఎనిమీ ఆస్తులుగా గుర్తిస్తారు.

ఎనమీ ఆస్తిగా ఎందుకు ప్రకటించారు?
భారతదేశంలో హమీదుల్లాకు చెందిన ఆస్తులను ఎనిమీ ప్రోపర్టీగా గుర్తిస్తున్నట్టు 2015 ఫిబ్రవరి 24న సీఈపీఐ (Custodian of Enemy Property in India) ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఈ వివాదం జాతీయ సమస్యగా మారింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హమీదుల్లా ఆస్తులకు వారసురాలైన పెద్ద కూతురు అబిదా సుల్తాన్ పాకిస్థాన్‌కు పారిపోవడంతో ఎనిమీ ప్రోపర్టీగా గుర్తిస్తున్నట్టు స్పష్టం చేసింది. సీఈపీఐ ఉత్తర్వులను సవాలు చేస్తూ సైఫ్ అలీఖాన్, ఇతర వారసులు మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఆశ్రయించారు.

ఎనిమీ ప్రోపర్తీ చట్టం, 1968 ప్రకారం ఈ ఆస్తుల శాశ్వత సంరక్షణ బాధ్యతలు సీఈపీఐ వద్దే ఉంటాయి. ఈ ఆస్తులను ఏ వ్యక్తీ వారసత్వంగా పొందడానికి వీల్లేదు. బదిలీ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సీఈపీఈ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సైఫ్ అలీఖాన్ ఇతర వారసులు 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సైఫ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు 2024లోనే తోసిపుచ్చింది. సైఫ్, అతడి తల్లి షర్మిలా ఠాగూర్, అతడి తోబుట్టువులు సోహా, సబా అలీ ఖాన్‌లను చట్టబద్ధ వారసులుగా గుర్తిస్తూ 2000 సంవత్సరంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా రద్దు చేసింది. అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల గడువు కూడా ఇచ్చింది. అయితే, సైఫ్ తరపున ఎటువంటి అప్పీల్ దాఖలు కాలేదు. ‘ఎనిమీ ప్రోపర్టీ’గా అప్పుడు స్టేటస్ ఇచ్చారు. ఆ తర్వాత సమగ్ర విచారణ జరిపిన కోర్టు ఏడాది లోపే తాజా తీర్పును వెలువరించింది.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ