Railway Stocks: రైల్వే స్టాక్స్‌కు డిమాండ్ పెరిగింది!
Railway Stocks ( Image Source: Twitter)
జాతీయం

Railway Stocks: కీలక ట్రిగర్స్‌తో రైల్వే షేర్లలో దూకుడు.. IRCTC, RailTel, Jupiter Wagons 12% వరకు లాభాలు

Railway Stocks: సోమవారం ట్రేడింగ్‌లో రైల్వే రంగానికి చెందిన కంపెనీల షేర్లు బలమైన కొనుగోళ్లతో భారీగా పెరిగాయి. ముఖ్యంగా IRCTC, RailTel కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, Jupiter Wagons షేర్లు 12 శాతం వరకు లాభాలతో  ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించాయి. IRCTC షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం పైగా పెరిగి రూ.680.80 వద్ద ట్రేడయ్యాయి. భారతీయ రైల్వేలు డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లోకి వచ్చేలా టికెట్ ధరల సరళీకరణ (fare rationalisation) ప్రకటించడంతో ఈ స్టాక్‌కు మద్దతు లభించింది.

Also Read: Bigg Boss Telugu 9: బిగ్ బాస్ జర్నీలో ఇమ్మానియేల్ ఫీలింగ్ ఏంటో తెలుసా.. కళ్యాణ్‌, తనూజల మధ్య ఉన్నది ఇదే?

సవరించిన టారిఫ్ ప్రకారం, 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే నాన్-ఏసీ ప్రయాణికులు అదనంగా రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. అయితే సబర్బన్ సేవలు, మంత్లీ సీజన్ టికెట్లపై ఈ ధరల పెంపు వర్తించదు. అలాగే సాధారణ తరగతిలో 215 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి ఎలాంటి ధర పెంపు ఉండదని రైల్వేలు స్పష్టం చేశాయి.

Also Read: Pawan Sacrifice: ‘హరిహర వీరమల్లు’ సినిమా అంత పని చేసిందా?.. వాటి అప్పులు కట్టడానికి పవన్ ఏం చేశారంటే?

ఇదిలా ఉండగా, RailTel కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు 2.3 శాతం పెరిగి రూ.340.95 వద్ద ముగిశాయి. భారత్‌లో వ్యాపార విస్తరణ కోసం ఎలాన్ మస్క్‌కు చెందిన Starlink‌తో భాగస్వామ్యం సాధించే దిశగా RailTel చర్చలు జరుపుతోందన్న వార్తలు ఈ స్టాక్‌కు బలమైన ఊతమిచ్చాయి. అటు Jupiter Wagons షేర్లు భారీ ర్యాలీ చూపించాయి. ప్రమోటర్ సంస్థ Tatravagonka AS కంపెనీలో అదనంగా 0.55 శాతం వాటా (28.72 లక్షల షేర్లు) ను రూ.135 కోట్లకు కొనుగోలు చేయడంతో, ఈ స్టాక్ ఎన్‌ఎస్‌ఈలో 13.16 శాతం పెరిగి రూ.294.50 వద్ద ట్రేడయ్యింది. ప్రమోటర్ల పెట్టుబడులు పెరగడం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఇదే సమయంలో Rail Vikas Nigam Ltd (RVNL) షేర్లు 3.73 శాతం లాభపడి రూ.331.05కి చేరాయి. ఈ స్టాక్ నిఫ్టీ–100 ఇండెక్స్‌లో అగ్ర లాభదారుల్లో ఒకటిగా నిలిచింది.

Also Read: Godavari Water Dispute: ఆగని జల కుట్రలు.. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో మరో భారీ కుట్రకు తెరలేపిన ఏపీ ప్రభుత్వం..?

అలాగే BEML, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC), RITES, Titagarh Rail Systems వంటి ఇతర రైల్వే  స్టాక్స్ కూడా 3 నుంచి 4 శాతం వరకు పెరిగాయి. మొత్తంగా రైల్వే షేర్లలో కనిపించిన ఈ లాభాలు, రాబోయే కేంద్ర బడ్జెట్‌పై ఉన్న అంచనాలు కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నారు. రైల్వే రంగానికి సంబంధించిన నిర్ణయాలు, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెంపు, కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు ఉండొచ్చన్న ఆశలు ఈ స్టాక్స్‌పై కొనుగోళ్లకు దారితీస్తున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Just In

01

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో విద్యార్థి నేతపై కాల్పులు.. తలలోకి బుల్లెట్..

Govt Hospitals: ఇకపై ప్రభుత్వ ఆసుపత్రిలో ‘క్లీన్’ ఆపరేషన్.. ప్రజల సహకారం కోరిన డీఎంఈ

Student Suicide: పరీక్షల ఒత్తిడితో రాయగఢ్ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న చివరి లేఖ

Mahesh Training: ‘వారణాసి’ కోసం ‘కలరిపయట్టు’ నేర్చుకుంటున్న మహేష్ బాబు.. ఇది వేరే లెవెల్..

Girl Kills Father: నాన్నకు డ్రగ్స్ ఇచ్చి.. మత్తులోకి జారుకున్నాక దగ్గరుండి ప్రియుడితో చంపించిన బాలిక