Pakistan-Russia (
జాతీయం, లేటెస్ట్ న్యూస్

India-Russia: భారత్-రష్యా సంబంధాలపై తొలిసారి స్పందించిన పాకిస్థాన్

India-Russia: భారత్, రష్యా మధ్య (India-Russia) బలమైన దౌత్య సంబంధాలు కొనసాగుతున్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. రష్యా నుంచి ముడిచమురు కొంటున్నారనే కారణాన్ని చూపుతూ, భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50 శాతం సుంకాలు విధించినా మన దేశం బెదరలేదు. అమెరికాతో దౌత్య సంబంధాలు దెబ్బతినే ముప్పు ఏర్పడినా లెక్కచేయలేదు. రష్యాతో సంబంధాలకే కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అయితే, భారత్ మాదిరిగానే రష్యాకు దగ్గరవ్వాలనుకుంటున్న దాయాది దేశం పాకిస్థాన్ మంగళవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

Read Also- Kaleshwaram Project: కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు.. మాజీ ఎంపీ కవిత సంచనల కామెంట్స్!

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. రష్యా-భారత్ సంబంధాలపై మంగళవారం స్పందించారు. ‘‘మేము కూడా రష్యాతో చాలా బలమైన సంబంధాలను ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాం. ఇరు దేశాల స్నేహం ఈ ప్రాంత అభివృద్ధి, ప్రగతికి తోడ్పడుతుంది’’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పుతిన్‌ అత్యంత ఉత్సాహభరితమైన నాయకుడు అని ఈ సందర్భంగా షెహబాజ్ అభివర్ణించారు. ఆయనతో సన్నిహితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చైనాలో ఉన్న పాక్ ప్రధాని షెహబాజ్ ఖాన్, అక్కడే ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మంగళవారం సమావేశమయ్యారు. ఇరువురూ కాసేపు పరస్పరం మాట్లాడుకున్నారు.

Read Also- MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన 80వ వార్షికోత్సవం సందర్భంగా చైనా నిర్వహిస్తున్న భారీ మిలిటరీ పరేడ్‌లో రష్యా, పాకిస్థాన్ అధినేతలు పాల్గొనబోతున్నారు. అందుకే, షాంఘై సదస్సుకు హాజరైన రష్యా అధ్యక్షుడు పుతిన్, పాక్ ప్రధాని షెహబాజ్ ఖాన్, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోతో బీజింగ్‌లోనే ఉన్నారు. పలువురు నేతలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.

Read Also- Relief to KCR Harish Rao: కేసీఆర్, హరీశ్‌కు రిలీఫ్.. హైకోర్టు ఉత్తర్వులు.. కొన్ని రోజులు సేఫ్!

ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో జరిగిన ఎస్‌సీవో సదస్సులో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల దృష్టిని ఆకర్షించేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రయత్నించారు. మోదీ, పుతిన్ కలిసి వెళ్తున్న సమయంలో చేయి కలపాలని షెహబాజ్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ 25వ ఎస్‌సీవో హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ సదస్సులో మాట్లాడుతూ, ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికీ పరిమితం కాదని, మానవాళికే ఒక పెద్ద ముప్పు అని సందేశం ఇచ్చారు. ఉగ్రవాదంపై ద్వంద్వ విధానాలను విడనాడాలంటూ దాయాది దేశం పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చారు. దీంతో, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడిని ఎస్‌సీవో సదస్సు ఖండించింది.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం