Kaleshwaram Project (image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Kaleshwaram Project: కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు.. మాజీ ఎంపీ కవిత సంచనల కామెంట్స్!

Kaleshwaram Project: తెలంగాణ రాష్ట్ర వరప్రదాయినిగా పేరుగాంచిన కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని మహబూబాబాద్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్(BRS)  జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత(Kavitha)  మండిపడ్డారు.  మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి కురవి మండల కేంద్రంలోని రహదారిపై మంత్రుల కాన్వాయ్ ని అడ్డుకున్నారు. అనంతరం రహదారిపై బైఠాయించి ఆందోళన కార్యక్రమంలో నిర్వహించారు. అక్రమ అరెస్టులను ఖండించారు.

 Also Read: Thummala Nageswara Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇక యూరియా కష్టాలు తీరినట్లే.. మంత్రి కీలక ఆదేశాలు

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…. కాలేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన సిబిఐ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కల్పతరువుగా ఉన్న కాలేశ్వరం ప్రాజెక్టుపై  కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోటి ఎకరాల మాగానికి సాగునీరు అందించాలని లక్ష్యంతో కట్టిన ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలని ఉద్దేశంతో కాలేశ్వరం నిర్మించి మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడంతో పోయిన పదేళ్ల కాలం రైతులు పంటలను సస్యశ్యామలం చేసుకున్నారని తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వంలో కాలేశ్వరం నీళ్లు ఫుల్… రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిల్
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అభివృద్ధి దిశగా సాగుతూ కోటి ఎకరాల మాగానిని సాగులోకి తేవాలన్న లక్ష్యంతో మాజీ సీఎం కేసీఆర్(KCR) కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించి నీళ్లు నింపి రైతులకు సరఫరా చేస్తే… రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసి ఒక్క చుక్క నీరు లేకుండా చేసి రైతులకు సాగునీరు నిల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే హుటాహుటిన కాలేశ్వరం కేసు సిబిఐకి అప్పగించడంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుస్తుందని చెప్పారు. సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ఏమో ఈ డి, సిబిఐ లు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని అంటే రేవంత్ రెడ్డి మాత్రం సిబిఐ అస్త్రంతో కాలేశ్వరం ప్రాజెక్టును,  బీఆర్ఎస్ పార్టీని అస్తవ్యస్తం చేయాలని పన్నాగం పన్నుతున్నట్లు తెలుస్తోందన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడంతో పాటు రైతులను పంటలు పండించుకోకుండా అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు ప్రమాదకరంగా ఉందని 300 కోట్లతో ఎల్ అండ్ టి కంపెనీకి మరమ్మత్తుల కోసం అప్పగించి కాలయాపన చేస్తున్నారన్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 10 గంటల వరకు చంటి బిడ్డలను సంకలో ఎత్తుకొని క్యూ లైన్ లలో నిలబడుతున్నారంటే ఈ పాపం   కాంగ్రస్‌ది  కాదా అని ప్రశ్నించారు. అదే మహా నాయకుడు కేసీఆర్ సీఎంగా ఉంటే రెండు నెలల ముందే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని నిల్వ చేసి రైతులకు అందించేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేసినందుకు చెంపలు కొట్టుకుంటున్నారని వివరించారు.

 Also Read: Hanuman Lord: హనుమాన్ కిందకి దిగి వచ్చాడు.. ఇదిగో ప్రూఫ్.. దేవుడని మొక్కి పూజలు మొదలు పెట్టండి ఇక?

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్