Indian Railways: వింటర్ రష్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో పాటు ఇండిగో సహా పలు విమానాలు రద్దు కావడం, ఆలస్యాలు ఏర్పడటం వల్ల ప్రయాణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వచ్చే మూడు రోజుల్లో మొత్తం 89 ప్రత్యేక రైళ్లు (100కి పైగా ట్రిప్స్) నడిపి ప్రయాణికుల రవాణా సాఫీగా సాగేందుకు రైల్వే శాఖ పెద్ద నిర్ణయం తీసుకుంది.
సెంట్రల్ రైల్వే భాగంలో 14 స్పెషల్ రైళ్లు ప్రకటించగా, ఇవి పుణే–బెంగళూరు, పుణే–హజ్రత్ నిజాముద్దీన్, LTT–మడ్గావో, CSMT–నిజాముద్దీన్, LTT–లక్నో, నాగ్‌పూర్–CSMT, గోరఖ్‌పూర్–LTT, బిలాస్‌పూర్–LTT రూట్లలో డిసెంబర్ 6 నుంచి 12 మధ్య నడవనున్నాయి. ఇదే సమయంలో సౌత్ సెంట్రల్ రైల్వే కూడా చెర్లపల్లి–శాలిమార్, సికింద్రాబాద్–చెన్నై ఈగ్మోర్, హైదరాబాద్–ముంబై LTT రూట్లలో మూడు ప్రత్యేక రైళ్లు విడుదల చేసింది.
ఈస్ట్రన్, వెస్ట్రన్ రైల్వేలు కూడా వింటర్ రష్‌ను తగ్గించేందుకు అదనపు సర్వీసులు ప్రవేశపెట్టాయి. హౌరా, సీాల్దా నుంచి న్యూ ఢిల్లీ, LTT వంటి ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. వెస్ట్రన్ రైల్వే ప్రకటించిన 7 రైళ్లలో ముఖ్యంగా ముంబై సెంట్రల్–భివాని సూపర్‌ఫాస్ట్ స్పెషల్ రైలు డిసెంబర్ 9 నుంచి 31 వరకు నడవనుంది.
Also Read: Actress Pragathi: నవ్వుకున్న వాళ్లందరికీ ఇదే ప్రగతి ఆన్సర్.. ఇండియా తరపున టర్కీ ఏషియన్ గేమ్స్‌కు!
బిహార్, ఉత్తర భారత ప్రయాణికుల కోసం ఈస్ట్ సెంట్రల్ రైల్వే పాట్నా, దర్భంగా–ఆనంద్ విహార్ రూట్లలో స్పెషల్ ట్రైన్లు నడుపుతుండగా, నార్త్ వెస్ట్రన్ రైల్వే రెండు స్పెషల్ ఫేర్ రైళ్లు విడుదల చేసింది. ప్రయాగ్‌రాజ్–న్యూ ఢిల్లీ రూట్‌లో అదనపు రైళ్లు నడుస్తాయి. అలాగే పీక్ సీజన్ రద్దీని దృష్టిలో పెట్టుకుని దుర్గ్–హజ్రత్ నిజాముద్దీన్ రూట్‌పై కూడా డిసెంబర్ 7, 8 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ప్రయాణికుల రవాణా కొంతవరకు సులభం కానుందని రైల్వేలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

