Actress Pragathi: ప్రగతి ఆంటీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏ పాత్ర చేసినా దానికి 100 శాతం న్యాయం చేసే నటీమణుల్లో ప్రగతి (Actress Pragathi) కూడా ఒకరు. తన డైలాగ్ డెలివరీ తనకు మరో ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది ప్రగతి. ఆమె నటనకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. కొంతకాలంగా ఆమె నటనకు దూరంగా ఉంటున్న విషయం తెలియంది కాదు. సోషల్ మీడియాలో వర్కవుట్స్, డ్యాన్స్‌లు చేస్తున్న వీడియోలతో హాట్ టాపిక్‌గా మారిన ప్రగతిని చూసి, అంతా నవ్వుకున్నారు. అయినా కూడా ఆమె ఫీల్ కాలేదు. కారణం, ఒక మహిళగా తన డ్రీమ్‌ని నెరవేర్చుకునేందుకు ఆమె ఎవరి మాటలను పట్టించుకోలేదు. ఆమె వర్కవుట్స్ వెనుక, ఆమె కష్టం వెనుక పెద్ద కారణమే ఉంది. అదే పవర్ లిఫ్టింగ్ (Pragathi Powerlifting).
ఎగతాళి చేసిన వారు కూడా ఆశ్చర్యపోయేలా..
నటిగా ఆమె ఎంత ప్రతిభావంతురాలో, పవర్ లిఫ్టింగ్‌లోనూ అంతకంటే ఎక్కువ టాలెంటెడ్ పర్సన్‌గా మారడానికి ఆమె చేసిన కృషి ఏంటో.. ఒక్కసారి ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ వెళ్లి చూస్తే అర్థమవుతుంది. జిల్లా, ప్రాంతీయ, సౌతిండియాతో పాటు జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్‌లో అనేక మెడల్స్ ఆమె గెల్చుకోవడం విశేషం. ఈ వయసులో అసలు ఆమె ఏం చేయగలదని ఎగతాళి చేసిన వారు కూడా ఆశ్చర్యపోయేలా, తన గోల్ కోసం ఆమె రెడీ అయిన విధానం నిజంగా ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న ప్రగతి, కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారు పతకం గెల్చుకుంది. 2023 నుంచి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిన ప్రగతి.. రెండేళ్లుగా హైదరాబాద్, తెలంగాణ, ఏపీతో పాటు జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్‌లో వరుసగా గోల్డ్ మెడల్స్ గెల్చుకుంటూ సత్తా చాటుతోంది. త్వరలో టర్కీలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో (Turkey Asian Games) ప్రగతి ఇండియా తరపున పాల్గొనబోతోంది అంటే.. ఇంతకంటే ఆమె సక్సెస్‌కు కొలమానం ఏముంటుంది. ఆమె నటిగా ఉన్నప్పుడు అసలు ఇలాంటి ఒక దారిలో ఆమె వెళుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, తన డ్రీమ్ కోసం ఎన్నో త్యాగాలు చేసి, ఇష్టమైన నటనను వదులుకుని మరీ డ్రీమ్‌ని ఫుల్ ఫిల్ చేసుకుంది. ఇక ఇండియా తరపున మెడల్ కొడితే.. నిజంగా ఓ హిస్టరీనే. ఆమె గోల్డ్ మెడల్ కొట్టి.. హిస్టరీ క్రియేట్ చేయాలని కోరుకుందాం.
Also Read- Ram Gopal Varma: వర్మ తనలోని ఇంకొకడ్ని తీశాడయ్యో.. ‘మ్యాడ్ మాన్‌స్టర్’ న్యూ అవతార్!
పవర్ లిఫ్టింగ్‌లో ఇప్పటి వరకు ప్రగతి సాధించిన మెడల్స్ వివరాలివే..
2023లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ (గోల్డ్ మెడల్)
2023లో పవర్ లిఫ్టింగ్ ఇండియా తెలంగాణ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ (గోల్డ్ మెడల్)
2023లో తెనాలిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ (5వ స్థానం)
2023లో ఎల్‌బీ స్టేడియం వేదికగా జరిగిన బెంచ్ ప్రెస్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఇండియా పోటీ (గోల్డ్ మెడల్)
2023లో షేక్ పేటలో జరిగిన తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీ (గోల్డ్ మెడల్)
2023లో బెంగళూరులో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ (గోల్డ్ మెడల్)
2024లో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ (సిల్వర్ మెడల్)
2025లో ఖైరతాబాద్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ (గోల్డ్ మెడల్)
2025లో హైదరాబాద్ రామాంతపూర్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా తెలంగాణ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ (గోల్డ్ మెడల్)
2025లో కేరళలో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ (గోల్డ్ మెడల్)
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

