Mirchi Madhavi: సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి ఎప్పుడూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా ధైర్యంగా నటీమణులు.. వారు ఫేస్ చేసిన లైంగిక వేధింపుల గురించి చెబుతున్నారు. తాజాగా నటి మిర్చి మాధవి (Mirchi Madhavi) కూడా తను ఫేస్ చేసిన లైంగిక వేధింపుల గురించి తన తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు కూడా లైంగిక వేధింపులు ఉంటాయా? అని అనుకునే వాళ్లంతా.. ఆమె చెప్పిన విషయాలు వింటే షాక్ అవుతారు. మిర్చి మాధవి వంటి వారే ఇలాంటివి ఫేస్ చేశారంటే.. ఇండస్ట్రీలో ఇంకెంత భయంకరంగా ‘కమిట్‌మెంట్స్, వేధింపుల’ సమస్య ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..
Also Read- Ram Gopal Varma: వర్మ తనలోని ఇంకొకడ్ని తీశాడయ్యో.. ‘మ్యాడ్ మాన్‌స్టర్’ న్యూ అవతార్!
ఐదుగురుతో కాంప్రమైజ్ కావాలి
‘‘నేను ఏది ఉన్నా.. ఉన్నది ఉన్నట్లుగా చెబుతాను. ‘100 పర్సంట్ లవ్’ సినిమా చేసిన తర్వాత ఒకతను ఫోన్ చేశాడు. ప్రకాశ్ రాజ్ (Prakash Raj) పక్కన వైఫ్ పాత్ర చేయాలి. ఒక ఐదుగురు ఉంటారు. కాంప్రమైజ్ అయితే మీకే ఆ పాత్ర అన్నారు. ‘కాంప్రమైజ్’ (Casting Couch) అంటే ఏంటి అని అడిగాను. మీరు ‘100 పర్సంట్ లవ్’కు కూడా.. అని ఏదో అన్నాడు. ‘100 పర్సంట్ లవ్’ సినిమాకు అలాంటిదేమీ లేదు. 25 రోజులు వర్క్ చేశాను. సుకుమార్‌గారు బంగారంలా సెలక్ట్ చేసుకున్నారు. అక్కడ మా పాత్ర చేసుకున్నాం.. వచ్చేశాం. ఆ సినిమాలో పిల్లలతో చక్కగా ఆడుకున్నాను. సాత్విక్ ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. పిల్లలందరూ కుర్చీలు వేసుకుని కూర్చునే వారు. ఒకరిద్దరు ఫుడ్ తినకపోతే.. నేను నా చేతులతో తినిపించేదాన్ని. చాలా సరదాగా ఉండేది. అంత చక్కగా ఆ సినిమా షూటింగ్ చేశాం.
Also Read- Bigg Boss Telugu 9: ‘కట్టు! నిలబెట్టు’.. ఆరో యుద్ధం మొదలైంది.. కన్నింగ్ రీతూకి కరెక్ట్ టాస్క్!
అదే పని చేసుకుంటాం కదా
ఇక ఫోన్ చేసిన అతను మాకు తెలుసు.. మీరు ‘100 పర్సంట్ లవ్’కు కూడా.. అని మళ్లీ అన్నాడు. సరే.. ఎవరు అన్నారో అతనితో ఫోన్ చేయించండి. నేనయితే సారీ అని చెప్పేశాను. అప్పటికి నాకు అర్థమైంది. మనం అతనితో గొడవపడి చేసేది ఏం లేదని నేను అప్పటికే ఓ క్లారిటీతో ఉన్నాను. ఆ తర్వాత ఎప్పుడూ నాకు అలాంటి సందర్భాలు ఎదురు కాలేదు. నిజంగా అతను ఐదుగురు ఉంటారని అన్నాడు. సారీ చెప్పేసి.. అలా అడిగితే ఏం చెప్తాను సార్ నేను. నిజంగా అలాంటివి చేయాలని అనుకుంటే అదే పని చేసుకుంటాం కదా. డబ్బులు కూడా బాగా ఎక్కువ వస్తాయి. నేనయితే ఇప్పటి వరకు ఇలాంటివి చేయలేదు అని చెప్పా. ‘చూసుకోండి మంచి అవకాశం మరి’ అని అన్నాడు. పరవాలేదండి.. ఇది కాకపోతే ఇంకో అవకాశం వస్తుంది అని చెప్పేశా. ఇది ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే లేదు. ప్రతి ఇండస్ట్రీలో ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీ ఎక్కువగా ఫోకస్ అవుతుంటుంది’’ అని ఆమె చెప్పుకొచ్చారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

