Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 89వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 89) ఫస్ట్ ఫైనలిస్ట్ నిమిత్తం కొన్ని టాస్క్‌లు నడుస్తున్నాయి. దాదాపు ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేదానిపై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ ఫైనలిస్ట్ రేసులో భరణి (Bharani), రీతూ(Rithu)ల మధ్య జరిగిన టాస్క్‌లో.. రీతూ కన్నింగ్ చేసి గెలిచిన విషయం తెలిసిందే. భరణి వేయాల్సిన రింగ్‌తో తన దగ్గర దాచుకుని, కనిపించకుండా చేసి, తప్పుడు గేమ్ ఆడింది. అయినా కూడా సంజన ఆమెనే గెలిచినట్లుగా ప్రకటించింది. ఈ విషయంలో భరణికి అన్యాయమే జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న భరణి, తనకి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో హౌస్‌లో చూపించారు.
హౌస్‌లో రణరంగం
భరణి ఆగ్రహానికి ఇప్పటి వరకు తన లోపల దాచుకున్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో కళ్యాణ్, భరణిల మధ్య కూడా చిన్నపాటి యుద్ధం నెలకొంది. ఈ టాస్క్‌లో ఎవరెవరు ఏమేం చేశారో తెలుసుకున్న భరణి.. అందరికీ ఇచ్చి పడేస్తున్నారు. ముఖ్యంగా సంజన ఇక్కడ ఫెయిలైంది. తనూజ చెప్పే వరకు ట్రయాంగిల్ కరెక్ట్‌గా లేదనే విషయాన్ని ఆమె గమనించలేదు. ఆ తర్వాత గేమ్ ఏటేటో తిప్పేసి, ఫైనల్‌గా రీతూ గెలిచిందని ప్రకటించింది. ఇందులో ఇమ్మానుయేల్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండటంతో.. ఒక్కసారిగా ఇమ్ము టాప్ 5 రేసులో పడిపోయాడనే చెప్పుకోవాలి. ఇక మిగిలిన వారికి బిగ్ బాస్ మరో ఛాలెంజ్ విసిరారు. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా టీమ్ విడుదల చేసింది. ఇందులో..
Also Read- Aryan Khan: ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించి.. మరో కాంట్రవర్సీలో షారుఖ్ తనయుడు.. అసలేం జరిగిందంటే?
కట్టు! నిలబెట్టు
‘‘ఫస్ట్ ఫైనలిస్ట్ అవడం కోసం మీరిప్పుడు మరో యుద్ధం చేయాల్సి ఉంటుంది. మీ ముగ్గురికీ ఇస్తున్న ఆరో యుద్ధం ‘కట్టు! నిలబెట్టు’. ఈ యుద్ధంలో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా.. తమకిచ్చిన బ్లాక్స్‌తో ఎత్తైన టవర్ నిర్మించి, ఇంటి సభ్యులు విసిరే బాల్స్ నుంచి తమ టవర్‌ను బాట్స్ సహాయంతో కూలకుండా కాపాడుకోవాలి’’ అని బిగ్ బాస్ ఛాలెంజ్ వివరాలు చెప్పాడు. రీతూ (Rithu), ఇమ్మానుయేల్ (Emmanuel), కళ్యాణ్ (Kalyan) ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. కళ్యాణ్ పెద్ద టవర్ కట్టాడు. కళ్యాణ్ టవర్, ఇమ్ము టవర్ పడగొట్టేందుకు డిమోన్ పవన్ ట్రై చేస్తున్నాడు.
Also Read- Spirit: ‘స్పిరిట్’ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే రికార్డ్!
పవన్‌ని పట్టుకుని ఏడ్చిన రీతూ..
మొదటి నుంచి ఎలా అయితే సపోర్ట్ ఇస్తూ వస్తున్నాడో.. ఈ ఛాలెంజ్‌లో కూడా రీతూకి పవన్ సపోర్ట్ అందించాడు. కళ్యాణ్‌ని ఎవరైతే టార్గెట్ చేస్తారో.. వాళ్లు సపోర్ట్ చేసే పర్సన్‌ని నేను టార్గెట్ చేస్తానని తనూజ అంటోంది. రీతూ టవర్‌ని పడగొట్టేందుకు తనూజ ట్రై చేస్తోంది. సంజన సంచాలక్‌గా ఉంది. మధ్యలో తనూజ లైన్ క్రాస్ చేసి చెయ్యి లోపల పెట్టినా, ఆమెను డిస్‌క్వాలిఫై చేయలేదు. డిమోన్ లోపలికి చేయి పెట్టగానే అతడిని డిస్‌క్వాలిఫై చేసింది. ఈ టాస్క్‌లో రీతూ ఓడిపోయినట్లుగా తెలుస్తోంది. తర్వాత పవన్‌ని పట్టుకుని ఏడ్చేస్తుంది. ఈ ఛాలెంజ్‌లో ఎవరు గెలిచారనేది మాత్రం బిగ్ బాస్ రివీల్ చేయలేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

