EC on Voters( iamge credit: twitter)
జాతీయం

EC on Voters: 20 ఏళ్ల సమస్య పరిష్కారం.. ఒకే రకం ఎపిక్ నంబర్ల సమస్యకు చెక్!

EC on Voters: ఎన్నికల జాబితాను సరిచేసి, నవీకరించే ప్రయత్నంలో భాగంగా, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) 2005 నుంచి కొనసాగుతున్న ఒకే రకం ఎపిక్ (ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డు) నంబర్ల సమస్యను పరిష్కరించింది. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 99 కోట్లకు పైగా ఓటర్ల ఎన్నికల డేటాబేస్‌ను పరిశీలించారు.

సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో 1000 మంది ఓటర్లు ఉండగా, ఈ పరిశీలనలో ఒకే రకం ఎపిక్ నంబర్లు చాలా తక్కువగా, అంటే సగటున నాలుగు పోలింగ్ స్టేషన్లలో ఒక్కటి చొప్పున కనిపించినట్లు ఈసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

 Also Read: Uttam kumar reddy: హరీష్ రావు అబద్దాలు మానుకో.. మంత్రి సంచలన కామెంట్స్!

ఈ ఒకే రకం ఎపిక్ నంబర్లను కలిగిన ఓటర్లు.. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో నిజమైన ఓటర్లుగా గుర్తించబడ్డారని పేర్కొన్నది. వీరందరికీ కొత్త ఎపిక్ నంబర్లతో కొత్త కార్డులు జారీ చేశామని వివరించింది. ఈ సమస్య 2005లో ప్రారంభమైనట్లు ఈసీఐ వర్గాలు తెలిపాయి. అప్పట్లో వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వేర్వేరు ఆల్ఫాన్యూమరిక్ సిరీస్‌లను వికేంద్రీకృత పద్ధతిలో ఉపయోగించాయి. 2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ సిరీస్‌లను మార్చాల్సి వచ్చింది.

ఈ సమయంలో కొన్ని నియోజకవర్గాలు పొరపాటున పాత సిరీస్‌లను కొనసాగించాయి. ఒకే రకం ఎపిక్ నంబర్ ఉన్నప్పటికీ, ఎవరూ వేరే పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయలేనందున ,ఈ సమస్య ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఈసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dheeraj Mogilineni: వేస్ట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌పై ‘ది గర్ల్ ‌ఫ్రెండ్’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!

Prabhas: ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేయాల్సిన ‘బ్రహ్మరాక్షస్’ డౌటేనా?

Bigg Boss Buzzz: మాధురిపై శివాజీ కౌంటర్స్ చూశారా? ఇది వేరే లెవల్ అంతే..!

TPCC: జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ ‘ఉమెన్స్ వ్యూహం’.. రంగంలోకి 7 మహిళా బృందాలు.. ఏం చేస్తాయంటే?

RT76: ఆషికాతో రొమాన్స్‌లో రవితేజ.. షూటింగ్ అప్డేట్ ఇదే!