Delhi University: ఢిల్లీలో రెండు కాలేజీలకు బాంబు బెదిరింపులు
Delhi University ( Image Source: Twitter)
క్రైమ్, జాతీయం

Delhi University: బ్రేకింగ్.. ఢిల్లీలో రెండు కాలేజీలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్

Delhi University: ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన రామ్‌జస్ కాలేజ్‌ (నార్త్ క్యాంపస్), దేశ్‌బందు కాలేజ్‌ (కల్కాజీ)లకు బుధవారం ఉదయం బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చాయి. ఈ విషయం తెలియడంతో వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌ దళాలు రెండు క్యాంపస్‌లకు చేరుకుని పరిశీలనలు ప్రారంభించాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని అధికారులు తెలిపారు.

Also Read: Alibaba Quark AI Glasses: కళ్ల ముందే అన్నీ.. AI కళ్లజోడును రిలీజ్ చేసిన అలీబాబా, దీని ఫీచర్స్‌ తెలిస్తే ఫిదా అయపోతారు

కొద్దీ రోజుల క్రితం ఢిల్లీలో వరుసగా ఇలాంటి బెదిరింపు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్‌లో రెండు పాఠశాలలు, మూడు కోర్టులకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌ రావడం గమనార్హం. అన్ని చోట్ల కూడా పోలీసులు విచారణ చేసినప్పటికీ చివరకు అవన్నీ తప్పుడు అలారాలుగానే తేలాయి.

Also Read: DGP Shivadhar Reddy: సైబర్ నేరాల కట్టడిలో మనమే నెంబర్​ వన్.. ఫ్రాడ్​ కా ఫుల్​ స్టాప్​ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి

ఇదే విధంగా జూలైలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌, ద్వారకాలోని సెయింట్ థామస్ స్కూల్‌ సహా కనీసం ఏడు పాఠశాలలకు ఒకే రోజున బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌ రావడం ఆందోళన రేపింది. ఆ సమయంలో కూడా ఏ బెదిరింపు నిజం కాకపోవడంతో పోలీసులు పరిశీలనలు ముగించారు. విచారణలో ఒక బెదిరింపు ఈమెయిల్‌ను సౌత్ ఢిల్లీకి చెందిన 12 ఏళ్ల బాలుడు సరదాగా పంపినట్లు గుర్తించారు. అతడిని ప్రశ్నించిన అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి విడుదల చేశారు. అన్ని బెదిరింపులు చివరకు తప్పుడు‌విగా తేలినా, ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం వల్ల తల్లిదండ్రులు, విద్యాసంస్థల్లో భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

Also Read: YS Jagan: గన్నవరం విమానాశ్రయంలో ఆసక్తికర సంఘటన.. ఓ చిన్నారికి కింద పడిన చెప్పును అందించిన వైఎస్ జగన్..!

Just In

01

Bigg Boss First Finalist: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు? రేసులో ఆ నలుగురు?

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

OnePlus 13: OnePlus 13 ఫోన్ కు 10 వేల డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!