Fitness Tips: జీవనశైలి అంతా మారిపోయిన నేటి రోజుల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన చాలా చాలా ముఖ్యం. శారీరకంగా, మానసికంగా మనిషి ఫిట్‌గా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే, రోగాలను కొనితెచ్చుకోవడమే అవుతుంది. అయితే, ఫిట్‌నెస్ కోసం చేసే ప్రయత్నాల్లో చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. వాటి కారణంగా మధ్యలోనే ట్రాక్ తప్పుతుంటారు. అలాంటివారి కోసం ఆర్జా బేడి అనే ఫిట్‌నెస్ కోచ్ జులై 9న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఐదు ముఖ్యమైన అంశాలను పంచుకున్నారు.
బరువు తగ్గే క్రమంలో ఆచరణాత్మకంగా పాటించాల్సిన చిట్కాలు, ప్రణాళికల విషయంలో కొన్ని మెలకువలను ఆమె వెల్లడించారు. సాధారణ చిన్నచిన్న తప్పులను సరిదిద్దుకొని ఫలితాలు సాధింవచ్చని ఆమె పేర్కొన్నారు. బరువు తగ్గే విషయంలో చాలామంది తరచుగా నిర్లక్ష్యం చేసే కొన్ని వాస్తవాలను ఆర్జా తన పోస్టులో పంచుకున్నారు. ‘‘బరువు తగ్గే ప్రయాణాన్ని తొలుత మొదలుపెట్టినప్పుడు నేను తెలుసుకోవాలనుకున్న సత్యాలు అంత ఆకర్షణీయంగా అనిపించలేదు. పైగా ట్రెండింగ్‌లో కూడా లేవు. అయితే, నేను ఫిట్‌నెస్ సాధించడానికి కొన్ని నిజమైన కారణాలు ఉన్నాయి. వాటిని అస్సలు విడిచిపెట్టలేదు’’ అని ఆమె పేర్కొన్నారు. అత్యంత కీలకమైన ఆ ఐదు చిట్కాలపై మీరు కూడా ఒక లుక్కేయండి మరి.
Read Also- Bihar’s Supaul district: అత్తతో అల్లుడి ఎఫైర్.. చావకొట్టి పెళ్లి చేసిన మామ.. ఎక్కడంటే?
1. అప్పటికప్పుడు మార్పు ఉండదు
బరువు తగ్గాలనే ప్రయత్నాలు మొదలుపెట్టిన వెంటనే మార్పు కనిపించాలని చాలామంది తహతహలాడుతుంటారు. అప్పటికప్పుడే మార్పు వచ్చేయాలని, అలాంటిదేమీ లేదని ఆరంభంలో కంగారుపడిపోతుంటారు. నిజానికి, స్కేల్‌లో మార్పు కనిపించకపోవచ్చు, దుస్తులు అలాగే అనిపించవచ్చు. కానీ, చేస్తూ ఉంటే మార్పు తప్పకుండా మొదలవుతుంది. ఆ రోజు నుంచి దుస్తులు వదులు అవడం కనిపిస్తుంది. ముఖం, శరీరాకృతిలో మార్పులు కూడా మొదలవుతాయి. తెరవెనుక పనిచేసింది వ్యాయామేనని అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పటివరకు ప్రయత్నిస్తూ ముందుకు వెళ్లాలి.
2. క్రమశిక్షణ చాలా ముఖ్యం
ప్రతిరోజూ ఉత్సాహంగా నిద్రలేవడం ఎవరికైనా కష్టమే. ఇంకాసేపు నిద్రపోతే బావుంటుందని అనిపించడం సహజం. అయితే, ఫిట్‌నెస్ విషయంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇబ్బందిగా అనిపించినా అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణగా వ్యాయామం చేయాలి. క్రమంగా ఫలితం తప్పకుండా వస్తుంది.
3. మెరుగుదల ప్రతిసారి కనిపించదు
సంఖ్యాపరంగా పురోగతి లేకపోతే ఫలితం శూన్యంకాదు. కొన్నిసార్లు శరీరంలో కొవ్వు కరుగుతూనే ఉన్నా గమనించలేరు. ఎందుకంటే, శరీరంలో నీరు, బలం పెరగడం ఇందుకు కారణాలు కావొచ్చు. కొన్నిసార్లు హార్మోన్ల వల్ల కూడా ఫలితాలను పసిగట్టలేరు.
Read Also- Budget friendly Luxury Interior: మీ ఇంటికి రిచ్ లుక్ కావాలా? ఈ టాప్-10 చిట్కాలు ఫాలో అవ్వండి!
4. ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు
ఫిట్‌నెస్ కోసం ఆహారాన్ని కొంతమేర మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రైస్‌కు బదులుగా గ్రిల్డ్ చికెన్ మాదిరిగా ఫుడ్ తినాల్సి రావొచ్చు. అలాంటప్పుడు ఫ్రెండ్స్, సహచరులు సరదాగా ఆటపట్టించవచ్చు. అయితే, అలాంటివాటిని పట్టించుకోకూడదు. క్రమంగా కొన్ని రోజులకు మీరే అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు.
5. నిర్లక్ష్యం అంత మంచిది కాదు
చాలామంది ఆరోగ్యం దెబ్బతిని, పొట్ట పెరిగిపోయే వరకు పాత నిర్లక్ష్య అలవాట్లను కొనసాగిస్తుంటారు. అయితే, ముందుగానే వ్యాయామం మొదలుపెడితే మంచి ఫలితాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. అర్ధరాత్రి ఏవిపడితే అవి తినడం, గందరగోళం మధ్య వీకెండ్ పార్టీలు వంటి అలవాట్లను మానుకోవడం మంచిది. ధూమపానం లాంటి అలవాట్లను ఎంత త్వరగా వదులుకుంటే అంతమంచిది.