Budget friendly Luxury Interior (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, లైఫ్‌స్టైల్

Budget friendly Luxury Interior: మీ ఇంటికి రిచ్ లుక్ కావాలా? ఈ టాప్-10 చిట్కాలు ఫాలో అవ్వండి!

Budget friendly Luxury Interior: ఇల్లు అందంగా కనిపించడంలో ఇంటీరియర్ డిజైన్ (Interior Design)ముఖ్య పాత్ర పోషిస్తాయి. రూ. కోట్లు ఖర్చు చేసి ఇంటిని నిర్మించినప్పటికీ.. సరైన ఇంటీరియర్ డిజైన్ లేకుంటే ఆ గృహం ఎవరీ దృష్టిని ఆకర్షించదు. ఈ నేపథ్యంలో ఇంటి లోపలి భాగాన్ని ఎంతో అందంగా అలంకరించేందుకు యజమానులు ఎంతగానో కష్టపడుతుంటారు. రిచ్ లుక్ తీసుకువచ్చేందుకు ఎంతగానో ఖర్చు చేస్తుంటారు. అయితే తక్కువ ఖర్చుతో మీ ఇంటికి గ్రాండ్ లుక్ తీసుకొచ్చే టాప్ -10 ఇంటీరియర్ డెకరేషన్ టిప్స్ ఈ కథనంలో చూద్దాం.

నాణ్యమైన ఫాబ్రిక్స్‌
కిటికీల వద్ద ఏర్పాటు చేసే కర్టెన్స్.. ఇంటిని లుక్ ను చాలా వరకూ డిసైడ్ చేస్తాయి. కాబట్టి సిల్క్, వెల్వెట్ లేదా లినెన్ వంటి లగ్జరీ ఫాబ్రిక్స్‌ను కర్టెన్లుగా ఎంచుకోండి. కుషన్ కవర్లు లేదా థ్రో బ్లాంకెట్ల కోసం కూడా వాటిని ఉపయోగించవచ్చు.

న్యూట్రల్ కలర్స్
తెలుపు, బూడిద, బీజ్ లేదా క్రీమ్ రంగులు.. ఇంటికి లగ్జరీ లుక్‌ (Luxury Look)ను తీసుకొస్తాయి. ఈ రంగులు.. గోడలకు, ఫర్నిచర్ లేదా డెకరేషన్ కు ఉపయోగించి ఇంటిని హైలెట్ చేయవచ్చు.

మెటాలిక్ యాక్సెంట్స్
బంగారం (Gold), వెండి (Silver) లేదా రాగి రంగులో ఉన్న డెకర్ ఐటెమ్స్ (లాంప్స్, ఫ్రేమ్స్, టేబుల్ డెకర్ ప్రొడక్ట్స్) ఉపయోగించడం ద్వారా మీ ఇంటికి గ్లామరస్ టచ్ తీసుకురావచ్చు. ఈ మెటాలిక్ యాక్సెంట్స్ చిన్నవైనప్పటికీ ఇంటికి ఖరీదైన రూపాన్ని అందిస్తాయి.

అద్దాల డెకరేషన్
ప్రస్తుత రోజుల్లో ఎంతో ఆకర్షణీయమైన మిర్రర్ డెకరేషన్ ఐటెమ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. మీ ఇంటf గోడలపై ఉన్న ఖాళీ ప్రదేశాన్ని వాటితో నింపడం ద్వారా లగ్జరీ లుక్ తీసుకురావొచ్చు.

డీప్ క్లీనింగ్
పరిశుభ్రంగా ఉండే ఇల్లు.. ఎప్పుడూ అపరూపమైన అందాన్ని ప్రతిబింబింప చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అనవసరమైన వస్తువులను తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేయాలి.

అర్ట్‌వర్క్ లేదా గ్యాలరీ వాల్
గోడలపై అందమైన కళాత్మక చిత్రాలను అమర్చడం ద్వారా ఇంటికి సుందరమైన లుక్ తీసుకొని రావొచ్చు. లేదంటే ఒక గోడను అచ్చంగా ఫొటో గ్యాలరీకి అంకింత చేయడం ద్వారా ఇంటికి వచ్చే బంధువులను ఆకర్షించవచ్చు.

కలర్ ఫుల్ లైటింగ్
స్టైలిష్ చాండ్లియర్ లేదా ఆధునిక ఫ్లోర్ లాంప్ ఒక గది రూపాన్ని పూర్తిగా మార్చగలదు. అయితే ఇవి కాస్త ఖరీదుతో కూడుకున్నవి. కాబట్టి సెకండ్ హ్యాండ్ స్టోర్ లో వీటిని కొనుగోలు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో ఇంటికి అందమైన రూపాన్ని అందించవచ్చు.

ఫర్నిచర్ ను స్టైలిష్ గా అమర్చడం
ఇంట్లోని ఫర్నిచర్ ను గది లేఅవుట్‌కు అనుగుణంగా అమర్చడం ద్వారా ఆకర్షణీయమైన లుక్ ను సంపాదించవచ్చు. ఇంటి లుక్ ను మరింత పెంచేందుకు ఫర్నిచర్ పై డిజైనింగ్ రగ్గులను అమర్చుకోవచ్చు.

గ్రీనరీని జోడించండి
ఇండోర్ మొక్కలు లేదా ఫ్రెష్ ఫ్లవర్స్ ఇంటికి సహజమైన లగ్జరీని జోడిస్తాయి. ఇవి ప్రశాంత వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా.. అహ్లాదకరమైన లుక్ ను తీసుకొస్తాయి.

Also Read: Heroine Affairs: పెళ్ళైన హీరోలతో ఆ స్టార్ హీరోయిన్ ఎఫైర్స్.. ఫైర్ అవుతున్న హీరోల భార్యలు?

కిటికీలకు భారీ కర్టెన్స్
సాధారణంగా ప్రతీ ఇంట్లోనూ కిటికీలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కిటికీ వద్ద భారీ కర్టెన్స్ (larger curtains) ఏర్పాటు చేయడం ద్వారా ఖరీదైన లుక్ ను తీసుకొని రావొచ్చు.

Also Read This: KA Paul: సెలబ్రిటీలపై ఈడీ కేసు.. బాలయ్యను ఇరికించిన కేఏ పాల్.. ఎలాగంటే?

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు