Fake Toothpaste: ఆరోగ్యకరమైన జీవనశైలిలో పళ్లు, నోటి శుభ్రతకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎవరైనా పళ్లు శుభ్రంగా తోముకుంటారు. ఆ తర్వాతే ఇతర పనులు మొదలుపెడతారు. గతంలో ప్రకృతిలో లభించే వేప, ఇతర ప్రయోజనకరమైన పుల్లలను బ్రష్‌లుగా ఉపయోగించేవారు. నాడు నోటి ఆరోగ్యానికి ఢోకా ఉండేది కాదు. కానీ, నేడు గ్రామీణ ప్రాంతంలో సైతం బ్రష్‌లు, టూత్‌పేస్టులను మాత్రమే వాడుతున్నారు. కానీ, నోటిలో పెడుతున్న ఆ టూత్ పేస్టులు ఎంతవరకు నాణ్యమైనవి?, మార్కెట్‌లో లభ్యమయ్యే ఉత్పత్తులు అన్నీ మంచివేనా? అంటే, దీనికి సమాధానం కాదని చెప్పక తప్పదు. ఢిల్లీ, కాశ్మీర్‌లలో రెండు రోజులక్రితం అచ్చం కోల్గెట్ టూత్ పేస్టు బ్రాండ్‌ను పోలివున్న భారీ నకిలీ టూత్ పేస్టుల రాకెట్ (Fake Toothpaste) బయటపడింది. ఒక గదిలో భారీ గుట్ట కనిపించింది ఈ ఫేక్ తయారీ బయటకొచ్చిన తర్వాత ప్రతిఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చివరికి టూత్ పేస్టులను కూడా వదలకుండా నకిలీమయం చేసేశారా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు కూడా టూత్ పేస్టులను వాడుతుంటారని, నకిలీవి ఆరోగ్యానికి హానికరమంటూ వాపోతున్నారు. చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
మరి నకిలీవి గుర్తించేదెలా?
నకిలీ టూత్ పేస్టులు ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మరి నాణ్యతలేని, నకిలీ టూత్ పేస్టులను గుర్తించడం ఎలా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అచ్చం ఒరిజినల్ బ్రాండ్లను పోలి ఉంటున్న నకిలీ బ్రాండ్లను సాధారణంగా గుర్తించడం అంత సులభం కాదు. అయితే, కొన్ని ట్రిక్స్‌ను ఉపయోగించి గుర్తుపట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్యాకింగ్ తీరు, క్యూఆర్ కోడ్, తయారీ తేదీ వంటి వాటిని జాగ్రత్తగా పరిశీలించి కొంతవరకు గుర్తించవచ్చునని అంటున్నారు. నమ్మకమైన షాపుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని, ఎక్కడపడితే అక్కడ కొనకూడదని అంటున్నారు. కొన్ని షాపుల వాళ్లు తక్కువ రేటుకు లభిస్తాయనే ఆశతో నకిలీ టూత్ పేస్టులను విక్రయించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Read Also- Lord Shiva: ప్రళయం వచ్చినప్పుడు శివుడు ఆ ఒక్క నగరాన్ని మాత్రమే రక్షిస్తాడు? దానికి అంతమే లేదా?
ఈ టిప్స్ గమనించండి
అసలైన టూత్‌పేస్ట్‌కి, నకిలీ టూత్‌పేస్ట్‌కి మధ్య కొన్ని తేడాలను గమనించడానికి ఈ మెలకులు ఉపయోగపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్యాకేజింగ్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి
టూత్ పేస్టుల ప్యాకింగ్ జాగ్రత్తను పరిశీలించారు. ప్యాకింగ్ కవర్ రంగులు, ముద్రణ నాణ్యత ఏవిధంగా ఉందో గమనించాలి. ఒరిజినల్ బ్రాండ్ల టూత్‌పేస్ట్ ప్యాకేజింగ్‌పై ప్రింటింగ్ చాలా క్వాలిటీగా, స్పష్టంగా ఉంటుంది. కానీ, నకిలీ టూత్ పేస్టుల రంగులు మసకగా కనిపిస్తుంటాయి. అక్షరాల ప్రింటింగ్ సరిగా ఉండదు.
Read Also- Pak Afghan Clashes: పాక్‌పై ఆఫ్ఘనిస్థాన్ ప్రతీకార దాడులు.. ఏకంగా 58 మంది పాక్ సైనికులు మృతి
స్పెల్లింగ్ తప్పులకు అవకాశం
నకిలీ టూత్ పేస్టుల ప్యాకింగ్‌పై స్పెల్లింగ్ తప్పులు, వ్యాకరణ దోషాలు కనిపిస్తుంటాయి. వాటిపై ముద్రించే సమాచారం కూడా అసంబద్ధంగా ఉంటుంది. అలా గనుక ఉన్నట్టు గమనిస్తే అది ఫేక్ ప్రొడక్ట్ అని కనిపెట్టవచ్చు.
బ్యాచ్ నంబర్, గడువు గమనించాలి
ఒరిజినల్ బ్రాండ్లకు సంబంధించిన ఉత్పత్తులపై బ్యాచ్ నంబర్, తయారీ తేదీ (Mfg Date), ఎక్స్‌పైరీ తేదీలు (Expiry Date) చాలా స్పష్టంగా ముద్రించి ఉంటాయి. అయితే, నకిలీ ప్రొడక్టులపై ఇవి లేకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అస్పష్టంగా ఉంటాయి.
టూత్‌పేస్ట్ ట్యూబ్ చూసి కనిపెట్టొచ్చు
ప్యాకింగ్ ఓపెన్ చేశాక.. టూత్ పేస్ట్ ట్యూబ్ నాణ్యత చూసి అసలైనదా?, నకిలీదా? అనేది గుర్తించవచ్చు. నకిలీ ట్యూబ్స్ సాధారణంగా నలిగిపోయి, వంకర్లు తిరిగి ఉంటాయి. వాటిలో ఉపయోగించే నాణ్యతలేని మెటీరియల్ ఇందుకు కారణం కావొచ్చు. కొన్నిసార్లు మూత (cap) కూడా సరిగ్గా పట్టవు. అలాంటి వారిని ఫేక్ ప్రొడక్ట్స్‌గా గుర్తించవచ్చు.
రుచి, వాసన చూడాలి
అసలైన టూత్‌పేస్ట్‌కి ప్రత్యేకమైన రుచి, వాసన ఉంటాయి. ఎప్పుడూ ఉపయోగించేవారికి ఇవి బాగానే తెలుస్తుంటాయి. రుచి, వాసనలో తేడా ఉంటే అది నకిలీ కావడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతన్నారు.
నురగలో తేడాను కూడా చూడాలి
సాధారణంగా ఒరిజినల్ టూత్‌పేస్ట్‌లు ఎక్కువగా నురుగ ఇస్తుంటాయి. అయితే, నకిలీ టూత్‌పేస్ట్‌ల్లో నురుగా సరిగ్గా రాదు.
నమ్మకమైన షాపుల్లోనే కొనాలి
టూత్‌పేస్ట్‌లను ఎక్కడపడితే అక్కడ కొనడం అంతసురక్షితం కాదు. ఆరోగ్య కేంద్రాలు, ఫార్మసీ ఉత్పత్తులు లభించే దగ్గర నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని నిపుణలు సూచిస్తున్నారు. అందుకే ఫార్మసీ, సూపర్ మార్కెట్, లేదా అధికారిక ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో కొనుగోలు చేయడం ఉత్తమం.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి
కొన్ని ప్రముఖ బ్రాండ్స్ తమ ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దానిని స్కాన్ చేసి ఒరిజినల్ ప్రొడక్టో కాదో నిర్ధారించుకోవచ్చు. అసలైన టూత్ పేస్టు అయితే దానికి సంబంధించిన వివరాలు అన్నీ డిస్‌ప్లే అవుతాయి. స్కాన్ చేసినా ఏమీ రాకుంటే అది ఫేక్ ప్రొడక్ట్‌గా భావించవచ్చు. కోల్గెట్, సెన్సొడైన్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తులపై స్పష్టమైన లోగో, రిజిస్టర్డ్ మార్క్, బ్యాచ్ నంబర్, ప్రింటింగ్ క్వాలిటీతో ప్యాకింగ్‌లను అందిస్తున్నాయి.
🚨 A fake Colgate toothpaste factory got caught running in Delhi and Kashmir. Check before purchasing. pic.twitter.com/hS2mjB2qXS
— Indian Tech & Infra (@IndianTechGuide) October 12, 2025
