Lord Shiva: ప్రళయం వచ్చినప్పుడు ఈ భూమి మీద ఏం ఉండవు? ఎందుకంటే, మొత్తం అంతమైపోతుంది కాబట్టి. కానీ, శివుడు మాత్రం ఒక్క నగరాన్ని కాపాడాతాడు. దాని కోసం ఏమైనా చేస్తాడు. మరి, ఈ నగరం శివునికి ఎందుకు ప్రత్యేకంగా మారింది. ఇంతకీ ఆ నగరం ఇప్పుడు ఎక్కడ ఉంది ? దాని పేరేంటో ఇక్కడ తెలుసుకుందాం..
శివుడు ఆ ఒక్క నగరాన్నే ఎందుకు రక్షిస్తాడు?
మనం ఇప్పుడు కలి యుగంలో ఉన్నామన్నా విషయం అందరికీ తెలుసు. పురాణాల ప్రకారం, యుగాలు నాలుగు ఉంటాయి. సత్యా యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ నాలుగింటిని కలిపి మహా యుగం అని పిలుస్తారు. ఇలాంటివి 71 మహా యుగాలు కలిస్తే మన్వంతరం. అలాంటివి 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం. అంటే ఇది బ్రహ్మకు ఒక పగటి కాలంతో సమానం. ఇలా రెండు కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక రోజు. దీని గురించి మన పురాణాల్లో కూడా ప్రస్తావించారు. కానీ, బ్రహ్మ కూడా పుట్టక ముందే ఆ పరమేశ్వరుడు ఒక మహా నగరాన్ని నిర్మించాడు. దీని గురించి ఎవరికీ తెలియదు. ఇది ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉంది. మనం నివశిస్తున్న నగరాలు వేరు. ఆ మహా నగరం చాలా వేరు.
ఎందుకంటే, ఆ మహా నగరానికి కాలంతో, యుగాలతో , యుగ యుగాలతో అస్సలు సంబంధం లేకుండా. బ్రహ్మ ఆయుష్షు తీరే చివరి వరకు కూడా అది అలాగే ఉండిపోతుంది. అది మోక్షపురి, శివ పురి గా పిలవబడే పుణ్య క్షేత్రం వారణాసి. సాధారణంగా బ్రహ్మ జీవితంలో ఒక కల్పం పూర్తయిన ప్రతి సారి ప్రళయం వచ్చి భూమి మీద ఉన్న జీవ రాశులు అంతమైపోయి కొత్త కల్పం మొదలవుతుంది. కానీ, అలాంటి ఎన్ని ప్రళయాలు వచ్చినా ఒక్క కాశీ నగరాన్ని ఆ పరమ శివుడు తన త్రిశూలంపై పెట్టుకుని రక్షిస్తాడని స్కాంద పురాణం చెబుతోంది.
