Energy Drinks
లేటెస్ట్ న్యూస్, లైఫ్‌స్టైల్

Health Tips: ఎనర్జీ డ్రింక్స్‌పై పచ్చినిజాలు వెలుగులోకి!

Health Tips: ఎనర్జీ డ్రింక్స్ తాగితే గుండె సమస్యలు దూరమవుతాయనే ప్రచారం చాలాకాలంగా ఉంది. నిజమేనని చాలామంది భావిస్తున్నారు కూడా. అయితే, ఇదంతా అపోహ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎనర్జీ డ్రింక్స్‌ తాగితే పైకి కనిపించని చాలా ప్రమాదాలు ఉన్నాయని (Health Tips) హెచ్చరిస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక గాఢత కలిగిన కెఫిన్, షుగర్, గ్వారానా, టౌరిన్, ఎల్-కార్నిటైన్ వంటి పదార్థాలు ఉంటాయి. శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చే పదార్థంగా పనిచేసే కెఫిన్, చక్కెరతో కలిస్తే ‘శక్తి విస్ఫోటనం’ జరుగుతుందని, శరీరంలో ఈ ప్రేరణ ముగిసిన తర్వాత అకస్మాత్తుగా ఎనర్జీ లెవల్స్ పడిపోతాయని కౌశంబిలోని యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ ప్రిన్సిపల్ కన్సల్టెంట్, డైరెక్టర్ కార్డియాలజీ డాక్టర్ అసిత్ ఖన్నా వివరించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.

Read this- Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ జెన్యూన్ రివ్యూ

ఎనర్జీ డ్రింక్స్ తాగినప్పుడు హృదయ స్పందన రేటు, బీపీ పెరుగుతాయని అసిత్ ఖాన్నా వివరించారు. ఎనర్జీ డ్రింక్స్ తాగితే సగటున 5.23/3.29 ఎంఎంహెచ్‌జీ వరకు బీపీ పెరుగుతుందని హెచ్చరించారు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్, కరోనరీ వాసోస్పాస్మ్, గుండె కండరాలు క్రమంగా బలహీనపడటం వంటి గుండె సమస్యలకు దారితీస్తాయని హెచ్చరించారు. బరువు పెరుగుదల, ఊబకాయం, మధుమేహం వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయని అప్రమత్తం చేశారు. ఎనర్జీ డ్రింక్స్ తాగితే జరిగేది హైడ్రేషన్ కాదని, గుండె దెబ్బతినమేనని అసిత్ ఖన్నా అలర్ట్ చేశారు. నిద్రలేమి, ఆందోళన వంటి హైపర్ యాక్టివిటీ సమస్యలతో పాటు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) సమస్యల ముప్పు ఉంటుందని వివరించారు. ఈ సమస్యలన్నీ గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.

Read this- Viral News: కోడలి హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. అర్ధరాత్రి గదిలోకి మామ

ఢిల్లీలో ఉన్న సీకే బిర్లా హాస్పిటల్‌ కార్డియాలజీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ సంజీవ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక స్థాయిలో ఉండే కెఫిన్, షుగర్ హృదయ స్పందన రేటు, బీపీని పెంచుతాయని చెప్పారు. టెన్షన్‌గా అనిపించడం, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఎనర్జీ డ్రింక్స్ తరచుగా తీసుకుంటే క్రమంగా గుండె ఒత్తిడికి గురవుతుందని, ఆరోగ్యవంతులకు కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశాలను పెంచుతుందని డాక్టర్ సంజీవ్ కుమార్ గుప్తా అప్రమత్తం చేశారు. ఎనర్జీ డ్రింక్స్ తాగినప్పుడు వచ్చే మానసిక ఉత్సాహం కొద్దిసేపేనని, కానీ, దాని కారణంగా ఏర్పడే శారీరక ఒత్తిడి శాశ్వత ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గుండె, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనైనా ఎనర్జీ డ్రింక్స్‌ లేబుల్స్ చదవాలని, ఏమేం కంటెంట్ ఉందో తెలుసుకొని ఆరోగ్యకరమైన డ్రింక్స్ ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఎప్పుడెప్పుడు తాగుతున్నారనే దానిని బట్టి యూజర్లు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా తాగితే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని ఆయన హెచ్చరించారు.

Read this- Illegal Sand Transportation: జోరుగా సాగుతున్న ఇసుక మాఫియా.. పట్టించుకోని అధికారులు


గమనిక: మీ అవగాహన కోసం ఆర్టికల్‌ను యథావిథిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?