Hariyana Case
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: కోడలి హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. అర్ధరాత్రి గదిలోకి మామ

Viral News: హర్యానాలోని ఫరీదాబాద్‌లో మెట్టినింటి వారి చేతిలో తనూ అనే మహిళ దారుణ హత్య కేసులో మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అత్తింటివారు కోడలిని హత్య చేసి, ఇంటికి ఆనుకొని ఉన్న వీధిలో మృతదేహాన్ని 10 అడుగుల లోతులో పూడ్చిపెట్టిన ఈ ఘటనలో, హత్యకు ముందు కోడలిపై మామయ్య అత్యాచారం చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

కోడలి గదిలోకి మామ
హత్య చేయడానికి ముందు, కోడలి తనూపై అత్యాచారం చేసినట్టుగా నిందిత వ్యక్తి ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కస్టోడియల్ విచారణలో అతడు నిజాలు అంగీకరించినట్టు వివరించారు. నిందిత మామ ప్రస్తుతం మూడు రోజుల పోలీసు రిమాండ్‌లో ఉన్నాడు. ‘‘బాధితురాలిని చంపేయాలని ఏప్రిల్ 14న నిర్ణయించుకున్నారు. తనూ భర్త అరుణ్, అత్తమామలు ఈ కుట్రలో భాగస్వాములు. పథకం ప్రకారం, తనూ అత్తను ఉత్తరప్రదేశ్‌లోని ఎటా అనే ఊరిలో పెళ్లికి పంపించారు. ఏప్రిల్ 21న రాత్రి భర్త అరుణ్, తనూతో పాటు అతడి సోదరి తిన్న ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. ఆ తర్వాత, ఇద్దరూ వేర్వేరు అంతస్తుల్లోని గదుల్లో నిద్రలోకి జారుకున్నారు. స్పృహ లేకుండా నిద్రపోయారు. కోడల్ని చంపాలనే ఉద్దేశ్యంతో ఆ రాత్రి బాగా పొద్దుపోయాక తనూ గదిలోకి మామయ్య వెళ్లాడు. హత్య చేయడానికి ముందు కోడలిపై అత్యాచారం చేశాడు. అయితే, అత్యాచారం చేసిన విషయాన్ని భార్యకు, కొడుకు అరుణ్‌కు చెప్పలేదు. హత్య చేసిన తర్వాత కొడుకుని గదిలోకి పిలిచాడు. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ఒక సంచిలో చుట్టి, ఇంటి వెలుపల వీధిలో ఇప్పటికే తవ్వి ఉంచిన గుంతలో పాతిపెట్టారు’’ అని పోలీసులు వివరించారు.

Read this- Rath Yatra: భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగు.. విషాదం

కొడలు కనిపించడం లేదంటూ ఏప్రిల్ 25న నిందితుడు మామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుకు కొన్ని గంటల ముందే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. డ్రైనేజీ రిపేర్ కోసం గుంత తవ్వినట్టుగా ఇరుగుపొరుగువారిని మామయ్య నమ్మించాడు. గుంతను కాంక్రీట్, ఇటుకలు, మట్టితో నింపారు. కొన్ని రోజుల తర్వాత, ఆ గుంతపై కాంక్రీట్ స్లాబ్ కూడా వేశారని పోలీసులు దర్యాప్తులో తేలింది. గుంతను తవ్వేందుకు ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించినట్టు గుర్తించారు. గుంత తవ్వుతున్న సమయంలోనే ఇరుగుపొరుగు అనుమానించారు. గుంత ఎందుకని ప్రశ్నించగా, డ్రైనేజ్ రిపేర్ కోసమని నమ్మబలికారు. ఏదో జరుగుతోందని స్థానికులు అనుమానించారు. కానీ, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయామని అంటున్నారు.

దర్యాప్తులో హత్యగా తేలడంతో శవపరీక్ష కోసం పాక్షికంగా కుళ్లిపోయిన మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. హత్య వెలుగులోకి రావడంతో మామ, అత్త, భర్త, ఆడపడుచుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, తన అక్కను పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం వేధించారని బాధితురాలి సోదరి ప్రీతి చెప్పారు. ‘‘పెళ్లి జరిగిన కొన్ని నెలలకే మా అక్క తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. సంవత్సరం పాటు ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత, అమ్మానాన్న సర్దిచెప్పి  సంసారానికి పంపించారు. కట్నం విషయంలో అత్తమామలు అసంతృప్తిగా ఉన్నారని పెళ్లైన దగ్గర నుంచి మా అక్క చెబుతుండేది. డబ్బు, సామాన్లు కావాలంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేశారు’’ అని ప్రీతి వివరించారు. ఈ అంశాలన్నింటిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read this- Kannappa Movie: బ్రేకింగ్.. కన్నప్ప పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. మంచు విష్ణు పై కేసు పెడతామంటూ వార్నింగ్

అసలు ఏం జరిగిందంటే?
పెళ్లైన నాటి నుంచి అత్తింటివారు కట్నంగా బంగారు నగలు, డబ్బు కోసం తనూని మానసికంగా, శారీరకంగా వేధించారని మృతురాలి సోదరి ప్రీతి చెప్పారు. వాళ్లు అడిగిన వాటిని పెట్టేందుకు తన కుటుంబం వీలైనంత వరకు ప్రయత్నించిందని, అయినప్పటికీ వారి డిమాండ్లకు ముగింపుపడలేదన్నారు. పదే పదే ఒత్తిడి తీసుకొచ్చారని వాపోయింది. వివాహం జరిగిన నాటి నుంచి అరుణ్, అతడి తల్లిదండ్రులు భారీగా డబ్బు డిమాండ్ చేశారని ప్రీతి పేర్కొంది. ‘‘తనూ పెళ్లైన కొన్ని నెలలకే మా ఇంటికి వచ్చేసింది. అమ్మానాన్నలతో కలిసి ఇంట్లోనే ఉంది. అత్తింటివారు ఆమెను మంచిగా చూసుకోకపోవడమే ఇందుకు కారణం. ఒక ఏడాదితో పాటు మాతోనే ఉంది. చివరికు మేము సర్దిచెప్పి సంసారానికి పంపించాం. మళ్లీ హింసించడం మొదలుపెట్టారు. తనూని మాతో మాట్లాడనివ్వకుండా చేశారు. ఫోన్ కాల్స్‌ కూడా మాట్లాడనివ్వలేదు. తనూ ఇంటి నుంచి పారిపోయిందని ఆమె అత్తమామలు ఏప్రిల్ 23న మా కుటుంబ సభ్యులకు చెప్పారు. అంతకుముందు ఏప్రిల్ 9న ఫోన్ చేస్తే కలవకపోవడంతో అనుమానం వచ్చింది. పారిపోయిందని చెప్పడంతో అనుమానం బాగా బలపడింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వారంపాటు పెద్దగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని ప్రీతి వివరించింది. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన బాధితురాలు తనూ (24), ఉత్తరప్రదేశ్‌కు ఫిరోజాబాద్‌కు చెందిన అరుణ్‌కు జులై 2023లో పెళ్లి జరిగింది.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?