లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Water Dispute: నీటి కేటాయింపులపై ఏం చేస్తారు?.. గోదావరి కృష్ణా వాటాలు తేలేనా!

Water Dispute: ఒకవైపు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. మరోవైపు జలశక్తి మంత్రికి లేఖలు రాస్తున్నారు. ఏపీ నిర్మించబోతున్న(Banakacharla Project) బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని పేర్కొంటున్నారు. అయితే, ఏపీ, తెలంగాణ సీఎంలతో ఢిల్లీలో భేటీ జరుగనున్నది. ఇది కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil) నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. అయితే, ఈ భేటీలో కృష్ణా, గోదావరి జలాల నీటి వివాదాలపై చర్చించనున్నారు. ఇందులో ప్రధాన అంశంగా బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project)  అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. దీంతో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాసింది. అయితే, కేంద్రం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.


నీటి పంపకాలే ప్రధాన ఎజెండాగా సమావేశం
ఢిల్లీలో బుధవారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక సమావేశం జరుగనున్నది. నీటి పంపకాలే ప్రధాన ఎజెండాగా కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఏపీ గోదావరి -బనకచర్ల ప్రాజెక్టు రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ దానిని అడ్డుకునేందుకు ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాసింది. జలశక్తి మంత్రితో పాటు పలువురు మంత్రులకు ఈ ప్రాజెక్టుతో జరిగే నష్టాన్ని వివరించింది. అయితే, సీఎంల భేటీలో తెలంగాణ ప్రయోజనాల విషయంపై ఏ మేరకు గళం వినిపిస్తారు? ఏపీని ఎలా అడ్డుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Also Read: MP Chamal Kiran Reddy: లక్కులో గెలిచిన నువ్వు కాంగ్రెస్‌ను ఓడిస్తావా?


గత కొంతకాలంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లతో బనకచర్లతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించకుండా చేసిన నిర్లక్ష్యాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షకోట్ల భారం ప్రజలపై మోపిందని వివరించారు. సీఎం (Revanth Reddy) రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్, మంత్రివర్గం గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే, సీఎంల సమావేశంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏ మేరకు తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలపై వాదన వినిపిస్తారు? లేకుంటే చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజల్లోనూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కేంద్రాన్ని సైతం ఎలా ఒప్పించి తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన వాటిని ఎలా సాధిస్తారనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది.

నీటి వాటా ఇవ్వాలని సీఎం కొరతారా
68 శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి వాటా ఇవ్వాలని సమావేశంలో సీఎం కొరతారా? లేదా అనేది కూడా ఆసక్తి నెలకొన్నది. గోదావరిలో తెలంగాణకు 2918 టీఎంసీలు, కృష్ణాలో ఒకవైపు 763 టీఎంసీల కోసం పోరాటం చేయాల్సి ఉంది. అయితే, పలు సందర్భాల్లోనూ గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు అని ప్రభుత్వం తరుపున పేర్కొన్నారు. ఇది భవిష్యత్‌లో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూరనుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇప్పటికే ఏపీ ప్రభుత్వం లెక్కలు చూపకుండానే కృష్ణాజలాలను వాటాకు మించి వినియోగిస్తున్నది. ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తికి ఫిర్యాదులు చేసినా చోద్యం చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే, సీఎంల భేటీలో నీటివాటాపై ఏవిధంగా కొట్లాడుతారనేది ఆసక్తి నెలకొన్నది. ఈ భేటీలో గోదావరి, కృష్ణా జలాల వాటా తెలుస్తారా? లేదా? అనేది చూడాలి.

తప్పిదాల నుంచి బయటపడేందుకు ఏం చేస్తారు
గత బీఆర్ఎస్ (BRS)  ప్రభుత్వం 299:512 శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తున్నది. అయితే, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల నుంచి బయటపడేందుకు ఏం చేస్తారు? ఎలాంటి ఒప్పందం చేసుకుంటారు? పరివాహాక ప్రాంతం ఆధారంగా నీటివాటాపై కొట్లాడుతారా? సముద్రంలో గోదావరి కలిసే నీటి విషయంలో వాటాపై ఎలా స్పందిస్తారు? భవిష్యత్‌లో ప్రాజెక్టులు నిర్మిస్తే అందుకు నీటివాటాను ఇప్పుడే కోరతారా? అనేది చూడాలి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు నీటావాటాలపై, ప్రాజెక్టులపై మాటలతో ఎదురుదాడి చేస్తున్నారు. తాత్కాలిక నీటి వినియోగం, నీటి పంపకానికి తేడా తెలవకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని, నీటి వినియోగం కేఆర్ఎంబీ చేస్తుంది, నీటి పంపకం ట్రైబ్యునల్ చేస్తుంది. నీటి వినియోగం ఆ ఏడాదికి మాత్రమే పరిమితం, నీటి పంపకం శాశ్వతమైందని పేర్కొంటుంది.

శాశ్వతంగా పంపిణీకి బీఆర్ఎస్ (BRS) సంతకాలు పెట్టామని చెప్పడం పచ్చి అబద్దం అని విమర్శలు చేస్తుంది. ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ పాలకులు ఇదే జానారెడ్డి, ఉత్తమ్, కోమటి రెడ్డి వంటి నాయకుల వల్ల, పెదవులు మూసుకోవడం వల్ల 299 మనకు కేటాయించడం జరిగిందని ఆరోపణలు చేస్తుంది. ఆనాటి కాంగ్రెస్ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి ఇచ్చిన నివేదికలోనూ గోదావరిలో 968, కృష్ణాలో 299 టీఎంసీలు కేటాయించిన విషయం చెప్పారని, గోదావరిలో 968 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ అని గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డి, కృష్ణాలో 299 ఇచ్చి అన్యాయం చేసిన విషయం ఎందుకు దాచి పెడుతున్నావని విమర్శలు చేస్తుంది. శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే, సెక్షన్ 3 కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతారని ప్రశ్నలు గుప్పిస్తుంది. నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నదిలో పున: పంపిణీ చేయాలని ఎందుకు అడిగారని నిలదీస్తున్నారు. 763 టీఎంసీల కోసం న్యాయవాదులు, ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తున్నదని, దానిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. ఈ నేపథ్యంలో సీఎంల భేటీలో ఎలా రేవంత్ రెడ్డి స్పందిస్తారనేది ఆసక్తి నెలకొన్నది.

 Also Read: Jagadish Reddy: రేవంత్ చర్యలు వీధి బాగోతాలను మించి పోయాయి

కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతించాలి
తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని, గోదావరిపై పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులు చేపట్టమని జీడబ్ల్యూడీటీ పేర్కొందని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సమకూర్చుతున్నందున, అంతే సమానంగా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు సమకూర్చాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

జాతీయ నదుల అనుసంధాన ప్రణాళికలో భాగంగా ఇచ్చంపల్లి కావేరి లింక్ కెనాల్ ప్రతిపాదనలున్నాయి. ఇచ్చంపల్లి నుంచి కావేరికి 148 టీఎంసీల నీటి బదిలీలో 50 శాతం తెలంగాణకు ఇవ్వాలని నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ 2024 మార్చిలో లేఖ రాసింది. గోదావరి బేసిన్ నుండి ఇతర బేసిన్‌లకు నీటిని బదిలీ చేసే విషయంపై చర్చలు జరగాల్సిన అవసరముంది. ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నీటిని కేసీ కెనాల్ నుంచి హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కెనాల్‌కు నీటిని డైవర్ట్ చేస్తున్నది. ఇది కేడబ్ల్యూడీటీ-I అవార్డును ఉల్లంఘించటమే అవుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ అడుగు నుంచి (+797 అడుగుల వద్ద) రోజుకు 3 టీఎంసీల నీటిని అవతల బేసిన్‌కు లిఫ్ట్ చేసేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ఏపీ ప్రభుత్వం చేపట్టింది.

శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ డిశ్చార్జ్ కెపాసిటీని అనధికారికంగా పెంచుకుంది. 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని తరలించుకునేలా ఏర్పాట్లు చేసుకుందని, 44 వేల క్యూసెక్కుల సామర్థ్యమున్న ఈ కెనాల్‌ను ఇటీవల 89 వేల క్యూసెక్కులకు పెంచుకుంది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి భారీ మొత్తంలో నీటిని మళ్లించేలా ఏపీ నిర్మించుకున్న ప్రాజెక్టులతో విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతున్నది. దీనిపైనా ఎలా సీఎం రియాక్ట్ అయి ఏపీ దూకుడును అడ్డుకుంటారనేది చూడాలి.

చంద్రబాబు దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేస్తారు
మరోవైపు చంద్రబాబు నాయుడు ఒకరు రోజు ముందుగానే ఢిల్లీకి వెళ్లారు. కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. అయితే, చంద్రబాబు నాయుడును దూకుడు ఎలా అడ్డుకట్ట వేస్తారు? అసలు నీటివాటా తేల్చేందుకు ఎలాంటి డిమాండ్‌లను కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ వద్ద పెడతారు. తెలంగాణ వాటాను సాధిస్తారా? లేదా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని, బనకచర్లను అడ్డుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో విమర్శల విమర్శలకు చెక్ పెట్టేలా నీటివాటాపై గళం వినిపించి సాధిస్తారా? లేక పోతే వారికి ఆయుధం ఇస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: High Court: మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా.. నల్లపురెడ్డిపై హైకోర్టు సీరియస్

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం