Jagadish Reddy(Image creditL: twitter)
Politics

Jagadish Reddy: రేవంత్ చర్యలు వీధి బాగోతాలను మించి పోయాయి

Jagadish Reddy: రాష్ట్రంలో మళ్లీ ఫ్యాక్షన్ రోజులు తెస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.  ఆయన (Telangana Bhavan) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ (KCR) పాలన‌లో నల్లగొండలో ఎలాంటి రాజకీయ కక్షలకు సంబంధించిన కేసులు లేవు అన్నారు. పదేండ్ల పాలనలో తమది నీళ్ల కోసం ఆరాటమని, ఇప్పుడు కమీషన్ల కోసమే కాంగ్రెస్ (Congress) నేతల ఆరాట పడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమం ఏది అని చూడకుండా రేవంత్ (Revanth Reddy)  అన్ని పాత్రలు తానే వేస్తున్నాడని, ఆయన చర్యలు వీధీ బాగోతాలను మించి పోయాయన్నారు. కాళేశ్వరం సాక్షిగా నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానన్నారు.

 Also Read: MP Chamal Kiran Reddy: లక్కులో గెలిచిన నువ్వు కాంగ్రెస్‌ను ఓడిస్తావా?

చర్చకు సిద్ధం

(KCR) కేసీఆర్‌కు మూడు రోజులు టైమ్ ఇస్తే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్‌చేసి చూపిస్తామని, ఏ పంప్ హౌస్‌ల దగ్గరైనా చర్చ పెడదామన్నారు. కాళేశ్వరంలో అన్నీ బాగానే ఉన్నాయి. ఏవీ కూలలేదని నిరూపిస్తామన్నారు. గోదావరిని కావాలనే ఎండబెడుతున్నారని ఆరోపించారు. సీఎం వచ్చినా సరే, మంత్రి వచ్చినా సరే రైతు సమక్షంలో చర్చకు సిద్ధం అని సవాల్ చేశారు.

కాళేశ్వరం ఎవరిది తప్పయితే రైతు చేతిలో చెంప దెబ్బ తిందామన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాల భర్తీ విషయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. రేవంత్ స్థాయికి దిగజారి తాను మాట్లాడాలని కొందరు కోరుకుంటున్నారు. కానీ, తాను అలా చేయనన్నారు. రేవంత్ మాట్లాడింది ప్రతిదీ అబద్ధమని సాక్ష్యాలతో నిరూపించానన్నారు. 6.47లక్షల రేషన్ కార్డులను కేసీఆర్ పానలో పంచామన్నారు. బనకచర్లపై చంద్రబాబు రాసిచ్చిన వ్యాఖ్యలను రేవంత్ (Revanth Reddy) చదువుతున్నారన్నారు.

 Also Read: BC Reservation Bill: స్థానిక సమరానికి సర్కార్ ప్రిపరేషన్.. ఎన్నికల జాబితా కోరిన ఈసీ

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?