Venezuela Nicolas Maduro: వెనిజులా రాజధాని కారకస్‌లో అమెరికా ప్రత్యేక బలగాలు శనివారం మిలిటరీ ఆపరేషన్ చేపట్టి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో (Venezuela Nicolas Maduro), ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌ను బంధించి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఎక్కడికి తీసుకెళ్లారనే సస్పెన్స్‌కు తెరదించుతూ, వారిద్దరినీ న్యూయార్క్ నగరం తీసుకెళ్లారు. మదురో చేతులకు బేడీలు వేసి, న్యూయార్క్‌లో ఉన్న అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) ప్రధాన కార్యాలయంలోకి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
మదురో హ్యాపీ న్యూఇయర్..
విడుదల చేసిన ఆ వీడియోలో మదురో చేతులకు బేడీలు, నలుపు రంగు హుడీ ధరించి ఆయన కనిపిస్తున్నాయి. ‘డీఈఏ ఎన్‌వైడీ’ అని రాసి ఉన్న నీలం రంగు కార్పెట్‌పై ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మదురోను తీసుకెళ్లిన గదిలో ఉన్న అధికారులకు హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ నైట్ అని మదురో చెబుతున్నట్లు వీడియోలో వినిపించింది. మదురోను అమెరికాను తీసుకెళ్లినట్టుగా మరొక వీడియోను కూడా విడుదల చేశారు. మెరుపు దాడి చేసి బంధించిన తర్వాత ఆయనను మొదట ఒక సైనిక స్థావరానికి తీసుకెళ్లి, అక్కడి నుంచి న్యూయార్క్ నగరానికి తరలించినట్టుగా స్పష్టమవుతోంది. నార్కో టెర్రరిజం, అమెరికాలోకి భారీగా కొకైన్ ఎగుమతి, అక్రమ ఆయుధాలను కలిగి ఉండటం వంటి తీవ్రమైన అభియోగాలను వీరిపై నమోదు చేశారు. కాగా, డీఈఏ ఆఫీస్ నుంచి మదురోను బ్రూక్లిన్‌లో ఉన్న మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు (MDC) తీసుకెళ్లినట్టుగా సంబంధిత అధికారులు తెలిపారు. ఇదొక ఫెడరల్ జైలు అని అధికారులు పేర్కొన్నారు.
Read Also- Crime News: ముఖ్తల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో వాహణం బైక్ ఢీకొని స్పాట్‌లో యువకుడు మృతి
30 నిమిషాల్లోనే ఆపరేషన్ ఫినీష్
అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడానికి అమెరికా సేనలు పెద్దగా టైమ్ పట్టలేదు. కేవలం 30 నిమిషాల్లోనే పని ముగించారు. ‘డెల్టా ఫోర్స్’ అనే ప్రత్యేక దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. దీనికి ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’ అని పేరు పెట్టారు. మదురో ఉక్కుతో నిర్మించిన తన ‘సేఫ్ రూమ్’లోకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, బలగాలు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో మదురో పాటు ఆయన భార్య ఇద్దరూ బెడ్‌రూమ్‌లో ఉన్నారని తెలిసింది. బలవంతంగా బందీలుగా తీసుకున్నారు. ఇక, ఈ ఆపరేషన్‌లో అమెరికా సైనికులు ఒక్కరు కూడా చనిపోలేదని అమెరికా సేనలు నిర్ధారించాయి.
ఆగస్టు నుంచి డేగ కన్ను
నికోలస్ మదురోను కదలికలపై గతేడాది ఆగస్టు నెల నుంచి అమెరికా నిఘా సంస్థలు డేగ కన్నువేశాయని కథనాలు వెలువడుతున్నాయి. ఆయన ఎటు వెళ్తున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, ఏయే ప్రదేశాలకు ప్రయాణిస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారనే విషయాలను పరిశీలిస్తూ వచ్చారు. చివరకు ఆయన ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల వివరాలను కూడా తెలుసుకున్నారంటే ఎంత పకడ్బందీగా ఆపరేషన్ చేపట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్ విఫలం కాకుండా రిహార్సల్స్ కూడా చేశారు. మదురో ఉంటున్న ఇంటిని పోలిన ఒక నమూనా భవనాన్ని నిర్మించి దాంట్లో ప్రాక్టీస్ చేశారు. మరో హైలెట్ ఏంటంటే, ఈ ఆపరేషన్ మొత్తాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైవ్‌లో చూశారు.
Read Also- Telangana Politics: సర్కారు స్ట్రాటజీతో సతమతమవుతున్న ప్రతిపక్షాలు.. రెండు పార్టీలపై కాంగ్రెస్ ఎటాక్!
Perp walked.pic.twitter.com/34iIsFUDdG
— Rapid Response 47 (@RapidResponse47) January 4, 2026

