US Strikes Venezuela: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పనిచేశారు. వెనిజులా నుంచి పడవల ద్వారా తమ దేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందని, దీనికి అడ్డుకట్ట వేయడంతోపాటు అధ్యక్షుడు నికోలస్ మధురో పదవి నుంచి దిగిపోవాలని, లేదంటే ఆ దేశంపై సైనిక చర్యకు దిగాల్సి ఉంటుందంటూ హెచ్చరించినట్టుగానే పెనుసంచలనం చోటుచేసుకుంది. శనివారం వేకువజామున వెనిజులాపై అమెరికా బలగాలు భీకర దాడులతో (US Strikes Venezuela) విరుచుకుపడ్డాయి. స్థానిక కాలమానం ప్రకారం, రాత్రి 2 గంటల సమయంలో దాడులు జరిపాయి. రాజధాని కరాకస్ నగరంలో సైనిక ఆపరేషన్ మొదలుపెట్టాయి. నగరంలోని పలు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. నగరం మీద యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ ఈ దాడులు జరిపాయి. బాంబు దాడులు పలుచోట్ల విధ్వంసం సృష్టించాయి. భారీ శబ్దాలు, అగ్నికీలలు ఎగసిపడ్డాయి. పేలుళ్ల శబ్దాలకు నగరమంతా కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగచక్కెర్లు కొడుతున్నాయి. మంటల్లో తగలబడుతున్న భవనాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.
ఇది తీవ్రమైన మిలిటరీ దాడి: వెనిజులా
అమెరికా సైనిక ఆపరేషన్‌పై వెనిజులా ప్రభుత్వం స్పందించింది. అమెరికా అతి తీవ్రమైన మిలిటరీ దూకుడు చర్యకు పాల్పడిందని వ్యాఖ్యానించింది. వెనిజులా సార్వభౌమత్వానికి, తమ దేశ ప్రజలకు అమెరికాలో ప్రస్తుతమున్న ప్రభుత్వం వ్యతిరేకమని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో వ్యాఖ్యానించారు. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టుగా ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా జరిపిన దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. కాగా, భారీ దాడుల కారణంగా నగరంలోని చాలా చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. పేలుళ్లలో ఒకటి ప్రధానమైన మిలిటరీ బేస్‌కు సమీపంలోనే జరిగింది. అక్కడ భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కారకస్ నగరంలోని మిరాండా, అరుగువా, లా గైరా ప్రాంతాలలో దాడులు జరిగినట్టుగా ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.
Read Also- Municipal Elections: మున్సిపోల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల!
కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొన్నివారాలుగా వెనిజులాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ దేశం నుంచి అమెరికాలోకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని చెబుతున్నారు. డ్రగ్స్‌తో వస్తున్న పడవలను సముద్రంలోనే పేల్చివేశామంటూ పలు వీడియోలను కూడా ఆయన విడుదల చేశారు. ఇక, డ్రగ్స్ అక్రమ రవాణా, వ్యాపారంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో ప్రమేయం ఉందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే, ఆయన పదవి నుంచి దిగిపోవాలంటూ హెచ్చరిస్తూ వచ్చారు. కాగా, డ్రగ్స్ వ్యాపారం, రవాణాతో తనకు ఎలాంటి సంబంధం లేదని నికోలస్ మధురో పలుమార్లు ఖండించారు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున అమెరికా ఈ దాడులు జరపడం అంతర్జాతీయంగా సంచలనంగా రేకెత్తిస్తోంది.
Read Also- Ticket Bookings Offer: సంక్రాంతి వేళ ధమాకా ఆఫర్.. రైళ్లల్లో ప్రయాణిస్తే డబ్బు వాపస్.. భలే ఛాన్సులే!
కనీసం ఏడు భారీ పేలుళ్లు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. భయభ్రాంతులకు గురైన కారకస్ నగర ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. నేలంతా కంపించిందని, చాలా భయంకరంగా ఉందని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
que dios bendiga a todas las personas inocentes que quedaron en medio del bombardeo en caracas – venezuela pic.twitter.com/etH1wbo1sa
— haaland erling (@gxldehaalandd) January 3, 2026

