Trump on Iran: ఇజ్రాయెల్ – ఇరాన్ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) దాక్కున్న కచ్చితమైన స్థావరం ఎక్కడ ఉందో తమకు తెలిసని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్ లో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఖమేనీని చంపాలనే ఉద్దేశం ఈ సమయంలో లేదని అన్నారు. అయితే ఆయన బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరించారు.
సహనం తగ్గకముందే లొంగిపోండి: ట్రంప్
అణ్వాయుధ దేశంగా ఇరాన్ మారడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా అండతోనే ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోందన్న వాదనలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉద్రిక్తలను మరింత పెంచేలా సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. ‘సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నాడనే విషయం తమకు స్పష్టంగా తెలుసు. ఆయన ఉన్న స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం తేలికైన పని. కానీ, ఇప్పటికిప్పుడు ఆయనను అంతం చేసే ఉద్దేశం లేదు. సామాన్యులు, అమెరికా సైనికులపై క్షిపని దాడులు చేయడంపై అమెరికా సహించదు. ఈ విషయంపై ఇరాన్‌కు స్పష్టత ఉండటం సంతోషించ దగ్గ విషయం. తమకు సహనం నశించక ముందే లొంగిపోవడం మంచిదని’ వార్నింగ్ ఇచ్చారు. అయితే షరతుల్లేకుండా లొంగిపోవాలనే వ్యాఖ్యలను ట్రంప్ పెద్ద అక్షరాలతో పేర్కొనడం విశేషం.
Also Read: PM Modi – Trump: నీకు అంత సీన్ లేదు.. ట్రంప్ గాలి తీసేసిన ప్రధాని మోదీ!
ఖమేనీ రియాక్షన్ ఇదే!
అయితే ట్రంప్ హెచ్చరించిన కొద్ది సేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘యుద్ధం మెుదలైంది’ అని ఖమేనీ రాసుకొచ్చారు. ‘నమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్‌తో(కత్తి) కలిసి ఖైబర్‌కు వచ్చేశారు’ అని ఖురాన్ లో రాసిన సూక్తిని ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు ఖడ్గం పట్టుకొని గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫొటోను పోస్ట్ కు జత చేశారు. ఫోటోను గమనిస్తే కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఉంది. 7వ శతాబ్దంలో యూదుల పట్టణమైన ఖైబర్‌పై షియా ఇస్లాం మొదటి ఇమామ్ యుద్ధం చేసి అందులో విజయం సాధించారు. దానిని గుర్తుచేస్తూ ఖమేనీ ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.
"Help from Allah and an imminent conquest" (Holy Quran: 61:13).
The Islamic Republic will triumph over the Zionist regime by the will of God. pic.twitter.com/sUZvapaV4G
— Khamenei.ir (@khamenei_ir) June 16, 2025