Maoist Encounter: ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులకు భద్రత బలగాలకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. రంపచోడవరం అటవీ ప్రాంతంలోని మారేడుమిల్లి సమీపంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏరియా కమిటీ కార్యదర్శి ఉదయ్, ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణతో పాటు అంజూ మృతి చెందినట్లు తెలుస్తోంది.
మావోయిస్టులను పూర్తిస్థాయిలో అణిచివేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలం సృష్టిస్తోంది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుండి మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యులు ముగ్గురు మృతి చెందినట్లు భద్రత బలగాల అధికారికంగా ప్రకటించాయి. అయితే మరో 11 మంది కేంద్ర కమిటీ సభ్యులు మావోయిస్టు నేతల్లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి అమిత్ షా గత రెండు రోజుల క్రితమే అధికారిక ప్రకటన చేయడం గమనార్హం.
Also Read: Honeymoon Murder: బాబోయ్.. ఒకటి కాదు రెండు.. హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్!
ఏది ఏమైనా మావోయిస్టులను వేరువేయడమే ధ్యేయంగా కేంద్ర భద్రత బలగాలు వివిధ రకాల ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మార్చి 31 2026 నాటికి పూర్తిగా మావోయిస్టులను ఏరివేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఆంధ్రా – చత్తీస్ గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎదురుకాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం.